ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణేలు చెల్లుబాటు | Rs.10 coins valued in RTC buses | Sakshi

ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణేలు చెల్లుబాటు

Published Fri, Apr 21 2017 11:14 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని రీజినల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(రాజ్‌విహార్‌): ఆర్టీసీ బస్సుల్లో రూ.10 నాణేలు చెల్లుబాటు అవుతాయని రీజినల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల రూ.10 నాణేలు చెల్లవంటూ ప్రచారం జరుగుతోందని, అయితే ఆర్టీసీ బస్సుల్లో వాటిని తీసుకోవాలని డిపో మేనేజర్లు, కండక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే కండక్టర్ల నుంచి కూడా రూ.10 నాణేలు తీసుకుని ప్రయాణికులు సహకరించాలని కోరారు. వీటిపై ఇబ్బందులు ఎదురైతే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఆర్టీసీ ఖాళీ స్థలాల్లో మినీ థియేటర్లు నిర్మించుకునేందుకు స్థలాలను అద్దెకు ఇస్తామని, వీటిపై సమీక్షించేందుకు ఈడీలు శశిధర్, రామారావు శనివారం కర్నూలుకు రానున్నట్లు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement