యోగా గురు రామ్ దేవ్ పతంజలి ఉత్పత్తుల ప్రకటనలపై 30 ఫిర్యాదులు అందాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి మంత్రి రాజవర్దన్ రాథోడ్ లోక్ సభకు తెలిపారు.
న్యూఢిల్లీ: యోగా గురు రామ్ దేవ్ పతంజలి ఉత్పత్తుల ప్రకటనలపై 30 ఫిర్యాదులు అందాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి మంత్రి రాజవర్దన్ రాథోడ్ లోక్ సభకు తెలిపారు. పతంజలి ఆయుర్వేదం లిమిటెడ్ ప్రకటనలకు వ్యతిరేకంగా ఏప్రిల్ 2015 , జూలై 2016 మధ్య కాలానికి 30కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయని పార్లమెంట్ కు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేసారు. దీంతో మొత్తం ఈ సంవత్సరానికి 33 కంప్లయిట్స్ నమోదయ్యాయన్నారు.
కన్జూమర్ ఫిర్యాదుల కౌన్సిల్ (సీసీసీ) పరిశోధనలను ప్రకారం ప్రకటనల స్వీయ నియంత్రణపై ఈ ఫిర్యాదులందాయన్నారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం మొత్తం 21 ఫిర్యాదుల్లో , 17 అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఉల్లంఘించినట్టుగా పరిగణించినట్టు చెప్పారు. ఆరు ఉత్పత్తి ప్యాకేజింగ్ సమాచార ప్రకటనలు కూడా, అడ్వర్టైజింగ్ కంటెంట్ స్వీయ నియంత్రణ కోల్పోయినట్టుగా గుర్తించామనీ, ఏఎస్సీఐ కోడ్ ఉల్లంఘనగానే భావించినట్టు మంత్రి తెలిపారు.