అతిపెద్ద కరెన్సీ నోటు రూ.2,000 నోట్లను (మే 19న) ఉపసంహరించుకున్న తర్వాత రిజర్వ్‌బ్యాంకు ఆఫ్ ఇండియా సోమవారం కీలక ప్రకటన చేసింది. జూన్ 30 నాటికి 76 శాతం వరకు పింక్ నోట్స్ బ్యాంకులకు అందాయని సోమవారం తెలిపింది. ఇప్పటివరకు తిరిగి వచ్చిన మొత్తం నోట్ల విలువ రూ. 2.72 లక్షల కోట్లని ఆర్‌బీఐ తెలిపింది. (స్టార్ క్రికెటర్ కోహ్లీ, ఫస్ట్ కారు ఏదో తెలుసా? దుమ్మురేపే లగ్జరీ కార్ల కలెక్షన్)
మార్చి 31, 2023న రూ. 3.62 లక్షల కోట్లకు చలామణిలో ఉన్న రూ. 2,000 నోట్ల మొత్తం విలువ మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి రూ. 3.56 లక్షల కోట్లకు తగ్గింది. బ్యాంకుల నుంచి అందిన సమాచారం ప్రకారం మే 19న ప్రకటన తర్వాత 2023 జూన్ 30 వరకు చెలామణి నుండి తిరిగి పొందిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 2.72 లక్షల కోట్లు. తత్ఫలితంగా, జూన్ 30న వ్యాపారం ముగిసే సమయానికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు రూ.84,000గా ఉన్నాయనీ మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లలో 76శాతం తిరిగి వచ్చాయని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.
అలాగే చెలామణి నుండి తిరిగి వచ్చిన రూ. 2,000 మొత్తం నోట్లలో 87శాతం డిపాజిట్ల రూపంలో ఉండగా, మిగిలిన 13శాతం ఇతర డినామినేషన్ నోట్లలోకి మార్పిడి జరిగినట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. సెప్టెంబర్ 30, 2023 నాటికి రెండు వేల నోట్ల మార్పిడికి ముగియనున్న సంగతి తెలిసిందే. కనుక ప్రజలు తమవద్ద ఉన్న రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయడానికి /లేదా మార్చుకోవడానికి వచ్చే మూడు నెలల సమయాన్ని ఉపయోగించుకోవాలని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది.(Tata Motors Price Hike: కొనుగోలుదారులకు టాటా మోటార్స్ షాక్!)
కాగా చలామణీలో ఉన్న రూ. 500, 1000 నోట్ల రద్దు తరువాత నవంబర్ 2016లో రూ. 2 వేల నోటును తీసుకొచ్చిన సంగతి తె లిసిందే. అయితే 2018-19లో రూ. 2,000 నోట్ల ముద్రణను నిలిపివేసినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment