అందాన్ని ఎరవేసి.. దోచేయబోయింది!
అందాన్ని ఎరవేసి.. దోచేయబోయింది!
Published Fri, Jan 27 2017 8:15 PM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM
ఒక వ్యక్తిని తన అందచందాలతో రెచ్చగొట్టి, అతడివద్ద ఉన్న ఖరీదైన రోలెక్స్ వాచీతో పారిపోయేందుకు ప్రయత్నించిన కొలంబియా బ్యూటీ క్వీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కెనడాకు చెందిన మల్హి అనే వ్యక్తి తన బావమరిది ఇస్తున్న బ్యాచిలర్స్ పార్టీ కోసం మియామీ వచ్చాడు. అక్కడ ఓషన్ డ్రైవ్ సమీపంలో బార్ వద్ద అతడు లిలియానా వనెగాస్ అనే అందాల రాణిని చూశాడు. అతడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో టాక్సీ కోసం చూస్తుండగా ఈమె అక్కడకు వచ్చి, హోటల్ గదిలో ఏమైనా మద్యం తాగావా అని అడిగింది. అంత అందగత్తె వచ్చి తనతో మాట్లాడటంతో ఆరోజు తాను చాలా లక్కీ అనుకున్నానని, కానీ హోటల్ గదికి ఆమెను తీసుకెళ్లాక అసలు ముట్టుకోనివ్వలేదని చెప్పాడు. ఉదయం 7 గంటల సమయంలో ఆమె ఉన్నట్టుండి బూట్లు వేసుకుని తన రోలెక్స్ వాచీ తీసుకుని తలుపు వద్దకు పరుగెత్తుకు వెళ్లిందని, దాంతో తాను కూడా ఆమె వెంటపడి, పట్టుకున్నానని తెలిపాడు.
ఆ మహిళ.. తన బోయ్‌ఫ్రెండుకు ఫోన్ చేసి అతడు తన తెల్లటి మెర్సిడిస్ కారులో రాగానే అందులో పారిపోదామనుకుందని, అయితే ఈలోపే మల్హి వెంటపడి పట్టుకోవడంతో కథ అడ్డం తిరిగిందని పోలీసులు చెప్పారు. ఇంతకుముందు కూడా ఈమె దాదాపు రూ. 17 లోల విలువ చేసే వాచీ, మరొకొన్ని విలువైన వస్తువులను ఓ జంట నుంచి కొట్టేసిందని పోలీసులు తెలిపారు. తర్వాత వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లినప్పుడు పోలీసులు ఈమె ఫొటో చూపించగా వెంటనే గుర్తుపట్టారు.
Advertisement
Advertisement