kolcutta
-
CBI: నిందితుడి డీఎన్ఏ, రక్తనమూనాలు సరిపోలాయి
కోల్‌కతా: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన ఆర్.జి.కర్ మెడికల్ కాలేజీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడి పనేనని సీబీఐ తెలిపింది. వైద్యురాలి మృతదేహంపై ఉన్న డీఎన్ఏ, రక్తనమూనాలు నిందితుని నమూనాలతో సరిపోలాయని సీబీఐ చార్జిషీటులో పేర్కొంది. సంజయ్ రాయ్‌కు వ్యతిరేకంగా 11 సాంకేతిక ఆధారాలను చార్జిషీటులో పొందుపర్చింది. బాధితురాలి మృతదేహం నుంచి సేకరించిన డీఎన్ఏ సంజయ్ రాయ్ డీఎన్ఏతో సరిపోలిందని తెలిపింది. అలాగే కురచ వెంట్రుకలు, పెనుగులాటలో సంజయ్ రాయ్ ఒంటిపై అయిన గాయాలు, అతని శరీరంపై, ప్యాంటుపై బాధితురాలి రక్తపు మరకలు, సీసీటీవీ ఫుటేజీ, అతని మొబైల్ ఫోన్ లొకేషన్, ఫోన్‌కాల్ వివరాలు.. ఇవన్నీ సంజయ్ రాయ్ పాత్రను నిర్ధారిస్తున్నాయని పేర్కొంది. సంజయ్ రాయ్ ఒంటిపై బలమైన గాయాలున్నాయని, వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించినపుడు ఇవి జరిగాయని వివరించింది. పాశవిక హత్యాచారం జరిగిన ఆగస్టు 9న సంజయ్ రాయ్ ఆర్.జి.కర్ మెడికల్ కాలేజిలో మూడో అంతస్తులోని సెమినార్ హాల్ వద్ద ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజి, అతని కాల్ డేటా ధ్రువీకరిస్తోందని తెలిపింది. సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు ఆగస్టు 10న అరెస్టు చేయగా.. తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ చేపట్టిన విషయం తెలిసిందే. సెమినార్ హాల్ వైపు వెళుతున్నపుడు సంజయ్ రాయ్ మెడపై ఉన్న బ్లూటూత్ ఇయర్‌ఫోన్ నెక్‌బ్యాండ్ తర్వాత అతను తిరిగి వెళుతున్నపుడు లేదని, సంజయ్ రాయ్ ఫోన్‌తో ఇది అనుసంధానమైనట్లు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లా»ొరేటరీ నివేదిక ఇచి్చందని స్థానిక కోర్టుకు సీబీఐ తెలిపింది. -
నిందితుడికి పాలిగ్రాఫ్ పరీక్ష
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిలి్చన వైద్యురాలి రేప్, హత్య కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించడానికి సోమవారం స్థానిక కోర్టు అనుమతించింది. ఆర్జి కార్ ఆసుపత్రిలో పీజీ ట్రైనీ డాక్టర్‌ను అత్యంత పాశవికంగా రేప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. నిందితుడికి ఏరోజు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించాలనేది సీబీఐ ఇంకా ఖరారు చేయలేదు. సంజయ్ రాయ్ మానసిక స్థితిని తెలుసుకోవడానికి సీబీఐ ఇదివరకే సైకోఅనాలసిస్ టెస్టు చేసింది. మరోవైపు కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అసత్య ప్రచారాన్ని అడ్డుకునేందుకేనని పోలీసులు చెబుతుండగా, నిరసనకారుల గళం నొక్కేందుకేనని విపక్షాలు మండిపడుతున్నాయి. వైద్యురాలి హత్యపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సీనియర్ డాక్టర్లు కునాల్ సర్కార్, సువర్ణ గోస్వామిలకు సమన్లు జారీ చేయడంతో వారు భారీ ర్యాలీతో కోల్‌కతా పోలీసు కేంద్ర కార్యాలయానికి వచ్చారు. వైద్య రంగానికి చెందిన వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘యువ డాక్టర్‌కు న్యాయం కోరుతున్నాం. మేమేమీ నేరం చేయలేదు. పోలీసులు తమ సమన్లను వెనక్కి తీసుకున్నారు. వైద్య పరివారం సహకారాన్ని కోరారు’ అని డాక్టర్ కునాల్ సర్కార్ తెలిపారు. సీఎం మమతా బెనర్జీని బెదిరించినందుకు, బాధితురాలి పేరును సోషల్ మీడియాలో బహిర్గతపర్చినందుకు పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. ఆర్జి కార్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ వరుసగా నాలుగోరోజు కూడా విచారించింది. మరోవైపు దేశ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల నిరసనలు సోమవారం కూడా కొనసాగాయి. కేంద్ర ఆరోగ్యశాఖతో సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయని, అంగీకారయోగ్యమైన ఒప్పందానికి రాలేకపోయామని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్ (ఫైమా) వెల్లడించింది. వైద్యుల సమ్మె కొనసాగుతుందని ప్రకటించింది. నేడు సుప్రీంకోర్టు విచారణ దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె, తీవ్ర ఆగ్రహావేశాల నేపథ్యంలో సుప్రీంకోర్టు మంగళవారం పీజీ డాక్టర్ హత్యోదంతంపై సుమోటోగా విచారణ చేపట్టనుంది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఉదయం 10:30 గంటలకు విచారణ చేపడుతుంది. ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సలె్టంట్స్ ఆఫ్ ఇండియా (ఫామ్కీ), ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా)లు సుమోటో కేసులో తమను భాగస్వాములను చేయాలని సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. మరోవైపు, వైద్యురాలి హత్యోదంతంలో పశి్చమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బదనాం చేస్తూ, రాజీనామా చేయాలని ఆమెవైపు వేలెత్తి చూపుతున్న వారి వేలు విరిచివేయాలని సీనియర్ మంత్రి ఉదయన్ గుహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మమతపై దాడి చేస్తూ ఆమెను వేలెత్తి చూపుతున్న వారు. రాజీనామాకు డిమాండ్ చేస్తున్న వారు ఎప్పటికీ సఫలం కాలేరు. మమత వైపు ఎత్తిన వేళ్లను విరిచేస్తాం’ అని ఉదయన్ అంటున్న వీడియో వైరల్‌గా మారింది. -
Mithun Chakraborty: బీజేపీలోకి మిథున్ చక్రవర్తి
కోల్‌కతా: బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్‌వర్గీయా, పార్టీ బెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేయాలని తాను కోరుకుంటున్నట్లు మిథున్ చక్రవర్తి చెప్పారు. తన ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు బీజేపీ ఒక వేదికగా ఉపయోగపడుతుందని అన్నారు. బెంగాలీని అని చెప్పుకోవడం తనకెంతో గర్వకారణమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అభిమానుల కోరిక మేరకు తాను నటించిన బెంగాలీ సినిమాలోని ఒక డైలాగ్ చెప్పి అలరించారు. అమీ జోల్దోరవో నోయి, బెలె బొరావో నోయి.. అమీ ఏక్తా కోబ్రా, ఏక్ చోబోల్–యి చోబి (నేను హాని చేయని పామును అనుకొని పొరపాటు పడొద్దు. నేను నాగుపామును. ఒక్క కాటుతో చంపేస్తా జాగ్రత్త) అనే డైలాగ్ చెప్పారు. తాను గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశానని మిథున్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని తెలిపారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది పార్టీ నాయకత్వమే నిర్ణయిస్తుందన్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని ప్రసంగిస్తూ.. ఈరోజు బంగ్లార్ చెలే(బెంగాలీ బిడ్డ) మిథున్ చక్రవర్తి మనతో ఉన్నారని చెప్పారు. ఆయన జీవితం, సాగించిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో గతంలో సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆయన 2014లో టీఎంసీ తరపున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో 2016లో రాజీనామా చేశారు. శారదా కుంభకోణంలో మిథున్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆయన అవకాశవాది అని టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీలు విమర్శించాయి. -
విమానం పేలుస్తానని మహిళ బెదిరింపు
కోల్‌కతా: బాంబులతో విమానాన్ని పేలుస్తానని ఓ ప్రయాణికురాలు బెదిరించడంతో ముంబైకి వెళ్తున్న విమానం వెనుదిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. 114 మంది ప్రయాణికులతో ఉన్న ఎయి ర్ ఏషియా విమానం శనివారం రాత్రి 9.57 గంటలకు కోల్‌కతా విమానాశ్రయం నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికే అందులోని ఓ ప్రయాణికురాలు విమాన సిబ్బ ందికి ఓ నోట్‌ను అందించింది. తన వద్ద బాం బులున్నాయని, వాటిని పేల్చేస్తానని అందులో ఉంది. పైలట్ వెంటనే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ)కి చేరవేశారు. ఏటీ సీ ఆదేశాల మేరకు విమానాన్ని తిరిగి కోల్‌కతా ఎయిర్‌పోర్టుకు తీసుకొచ్చాడు. ఆమె వద్ద కానీ, విమానంలో కానీ ఎక్కడా బాంబులు లేవని సోదాల అనంతరం భద్రతాధికారులు నిర్ధారించారు. ఆ ప్రయాణికురాలు మత్తులో ఉన్నట్లు తేలిందని తెలిపారు. -
నేడు మోదీ, మమత భేటీ
కోల్‌కతా: ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు శనివారం కోల్‌కతాలోని రాజ్‌భవన్ వేదికగా భేటీ కానున్నట్లు సెక్రెటేరియట్ అధికారికంగా ప్రకటించింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి కోల్‌కతా చేరుకోగానే, సాయంత్రం 4 గంటల సమయంలో భేటీ జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అయితే ఏ అంశాలపై భేటీ జరగనుందో ప్రభుత్వం చెప్పలేదు. ఈ నెల 12న కోల్‌కతాలో జరగనున్న కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్ (కేఓపీటీ) 150వ వసంతోత్సవ కార్యక్రమంలో వీరిరువురు మరలా ఒకే వేదికపై కలిసే అవకాశం ఉందని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తెలిపారు. ఇప్పటికే నౌకాయాన మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యక్తిగతంగా మమతను కలిసి ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఈ నెల 13న సోనియా గాంధీ తలపెట్టిన ప్రతిపక్షాల భేటీని కూడా వ్యతిరేకించారు. మోదీ, మమతల భేటీ గురించి సీపీఎం నేత సుజన్ చక్రవర్తి మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి బయటపడిందని వ్యాఖ్యానించారు. -
కార్మిక గళం మూగబోయింది
కోల్‌కతా: భారత కార్మికోద్యమ నేత, సీపీఐ జాతీయ నాయకుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు గురుదాస్ దాస్‌గుప్తా(83) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని స్వగృహంలో గురువారం ఉదయం 6 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, గురుదాస్ మృతిపట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. గురుదాస్ ఐదుసార్లు పార్లమెంటుసభ్యుడిగా ఉన్నారు. మూడుసార్లు రాజ్యసభకు, రెండుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటులో ఆయన ఆవేశపూరిత ఉపన్యాసాలు కొన్నిసార్లు పార్టీ సైద్ధాంతిక సరిహద్దులను చెరిపేసేవి. యాంగ్రీ యంగ్ మాన్ ‘యాంగ్రీ యంగ్ మాన్’గా పేరున్న గురుదాస్ దాస్ గుప్తా 1936 నవంబర్ 3న అవిభాజ్య బెంగాల్‌లోని బరిషాల్ (ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది)లో పుట్టారు. విభజన అనంతరం ఈయన కుటుంబం పశ్చిమబెంగాల్‌కి మారింది. 50వ దశకం చివరల్లో వామపక్ష సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన ఆయన విద్యార్థి ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అవిభాజ్య బెంగాల్ విద్యార్థి ఫెడరేషన్‌కి అ«ధ్యక్షుడిగానూ, కార్యదర్శిగా పనిచేశారు. కొన్ని సందర్భాల్లో రహస్య జీవితంలోకి వెళ్లారు. 1964 కమ్యూనిస్టు పార్టీ చీలికతో మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించాక సీపీఐలో గురుదాస్ ఉండిపోయారు. 70వ దశకంలో కమ్యూనిస్టు పార్టీ అవసరాలరీత్యా కార్మికరంగ బాధ్యతలు చేపట్టారు. 2001లో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి గురుదాస్ సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశారు. కార్మికవర్గ సమస్యల పరిష్కారానికై జీవితమంతా పోరాడి మాస్ లీడర్‌గా గుర్తింపు పొందారు. రాజకీయ వైరాన్ని పక్కనబెట్టి మాజీ ప్రధాని వాజ్‌పేయితోనూ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతోనూ, పలువురు కాంగ్రెస్ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఇటు పార్లమెంటులోనూ, అటు కార్మికవర్గంలోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గురుదాస్ గుప్తా లేని లోటు కార్మికలోకానికి తీరని నష్టమన్నారు. తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. గురుదాస్ దాస్‌గుప్తా∙మృతి పట్ల సంతాపం వ్యక్తంచేశారు. సీఎం జగన్ సంతాపం సాక్షి, అమరావతి: సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్ గుప్తా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు, కార్మికుల సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని, రాజకీయాల్లో ఆయన విలువలకు ప్రతీకగా నిలిచారని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. -
మాజీ మిస్ ఇండియాకు వేధింపులు
కోల్‌కతా: విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న తనను కొందరు ఆకతాయిలు వేధించారని మాజీ మిస్ ఇండియా, నటి ఉషోషి సేన్‌గుప్తాను తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపింది. 2010లో ఆమె మిస్ఇండియాగా గెలిచారు. కాగా, వేధింపుల వీడియోను ఆమె ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. సోమవారం రాత్రి 11:40 గంటలకు కోల్‌కతాలో ఈ ఘటన జరిగింది. ఉషోషి తెలిపిన వివరాల ప్రకారం.. సహోద్యోగితో కలసి వెళ్తున్న ఉషోషి కారును కొందరు ఆకతాయిలు బైక్‌తో ఢీకొట్టి, కారు డ్రైవర్‌ను బయటకు లాగారు. ఈ గొడవను ఆమె ఫోన్లో రికార్డ్ చేసి కేసు నమోదుచేయాలని దగ్గర్లోని పోలీస్స్టేన్కు వెళ్లారు. ఘటనప్రాంతం తమ పరిధిలోది కాదని చెప్పడంతో ఆమె ఇంటికి తిరుగుపయనమైంది. ఈ సమంలో ఆకతాయిలు మళ్లీ వచ్చి రాళ్లతో దాడి చేశారు. కాగా, ఫేస్బుక్ పోస్టును పరిశీలించిన పోలీసులు ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కోల్‌కతా మాజీ చీఫ్‌పై లుకౌట్ నోటీసు
న్యూఢిల్లీ: శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు గట్టి షాక్ తగిలింది. రాజీవ్ దేశం విడిచి వెళ్లకుండా ఆదివారం ఆయనపై సీబీఐ లుకౌట్ నోటీసు జారీ చేసింది. ఈమేరకు అన్ని ఎయిర్‌పోర్టులు, ఇమిగ్రేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రూ.2,500 కోట్ల శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై సీబీఐ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘రాజీవ్‌కు తప్పనిసరిగా నిర్బంధ విచారణ అవసరం. ఆయన దర్యాప్తునకు సహకరించకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు. ఆయన్ని ప్రశ్నించే సమయంలో అహంకారంతో వ్యవహరిస్తున్నారు’ అని సీబీఐ ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు రాజీవ్ కుమార్ 27వ తేదీన జరిగే విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతోపాటు ఆయన్ను అరెస్టు చేయకుండా ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ‘ఈ కేసులో వేసిన సిట్ దర్యాప్తు సంస్థకు రాజీవ్ కుమార్ అప్పుడు ఇన్చార్జిగా ఉన్నారు. కుంభకోణానికి సంబంధించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, పలువురు నేతల కీలక ఆధారాలను బాధితుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ పరీక్షకు పంపకుండా ఆధారాలను నాశనం చేశారు’ అని సీబీఐ తెలిపింది. -
కోల్‌కతాలో కుప్ప కూలిన ఫ్లై ఓవర్
-
కుప్ప కూలిన ఫ్లై ఓవర్
కోల్‌కతా: కోల్‌కతాలో గురువారం పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని గణేశ్ థియేటర్ గిరీశ్ పార్క్ ఏరియా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ హఠాత్తుగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 18 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. శిథిలాల కింద సుమారు 150 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కోల్‌కతా మెడికల్ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ అధికారులు, జాతీయ విపత్తు నివారణ బృందంతో పాటు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతం ఉత్తర కోల్‌కతాలో జన సామర్థ్యం అధికంగా ఉండటమే కాకుండా,అత్యంతర ఇరుకైన ప్రదేశం. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని, దాంతో తామంతా ఉలిక్కిపడిటనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ శబ్ధానికి వెన్నులో నుంచి వణుకు పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే వివేకానంద రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఫ్లై ఓవర్ పూర్తయితే కోల్ కతాలోనే పొడవైనదిగా గుర్తింపును పొందనుంది. గిరిష్ పార్క్‌ను హౌరాకు కలిపే ప్లై ఓవర్ కూడా ఇదే. -
విమానాన్ని ఢీకొట్టిన బస్సు
-
విమానాన్ని ఢీకొట్టిన బస్సు
కోల్ కతా: కోల్ కతా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగిఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని జెట్ ఎయిర్ వేస్ కు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో విమానం కొంత భాగం ధ్వంసమైంది. ఆ సమయంలో విమానంలో ప్రయాణీకులు లేరు. ఈ ఘటన తెలిసి ఒక్కసారిగా విమానాశ్రయ అధికారులు ఉలిక్కి పడ్డారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయాలవడంగానీ చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బస్సులో ప్యాసింజర్స్‌ను విమానం వద్దకు తీసుకెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల విమానాశ్రయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం అసోంలోని సిల్చార్ కు వెళ్లాల్సి ఉంది. బస్సు డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు. -
కుక్కతో ఆడుతూ బంతిని మింగి..
కోల్ కతా: కుక్కతో సరదాగా ఆడిన ఆట ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బంతి నోట్లోకి ఇరుక్కుపోయి శ్వాస ఆడకపోవడంతో ఓ 27 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన దక్షిణ కోల్ కతాలోని లేక్ గార్డెన్ వద్ద చోటుచేసుకుంది. బీబీఏ గ్రాడ్యుయేట్ అయిన ఆర్నేశ్ సింఘానియా వాళ్లింట్లోని పెంపుడు జంతువు స్కూబీ అనే కుక్కతో కాలక్షేపం చేసుకుంటూ ఉన్నాడు. అందులో భాగంగా 1.5 అంగుళాల బంతిని తీసుకొని రెండు దంతాల మధ్యలో కరిచిపట్టి కుక్క నోటికి అందించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అది కాస్త స్లిప్ అయిపోయి నేరుగా నోట్లోకి దూరిపోయి గొంతులోకి జారింది. ఆవెంటనే శ్వాసనాళానికి అడ్డుపడటంతో అతడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. -
కోల్‌కతాలో పశ్చిమగోదావరి యువకులు కిడ్నాప్
కోల్‌కతా: మాయమాటలు నమ్మి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువకులు కిడ్నాప్‌కు గురయ్యారు. ఉద్యోగాలు వస్తాయని ఆశపడి బ్రోకర్ చెప్పిన మాటలకు కోల్‌కతా వెళ్లి కనిపించకుండా పోయారు. ఉద్యోగాలు ఇప్పిస్తాను రాండంటూ ఓ బ్రోకర్ వారి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.18 లక్షలు వసూలు చేశాడు. అనంతరం, ఉద్యోగాల కోసం కోల్ కతా రావాల్సిందిగా చెప్పడంతో అక్కడికి వెళ్లిన యువకులను కిడ్నాప్ చేశాడు. అనంతరం మరో రూ.30 లక్షలు ఇస్తేనే వారిని వదులుతామంటూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో విధిలేక తల్లిదండ్రులు చాగల్లు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. -
కోల్‌కతా లోకల్ రైలులో బాంబు పేలుడు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా శివారులో సీల్దా-కష్ణానగర్ లోకల్ రైలులో మంగళవారం తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది. 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైరివర్గాల గ్యాంగ్‌వార్‌లో భాగంగా పేలుడు ఘటన జరిగి ఉంటుందని ఈశాన్య రైల్వే జనరల్ మేనేజర్ ఆర్.కె.గుప్తా అభిప్రాయపడ్డారు.