కోల్కతా: మాయమాటలు నమ్మి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువకులు కిడ్నాప్కు గురయ్యారు. ఉద్యోగాలు వస్తాయని ఆశపడి బ్రోకర్ చెప్పిన మాటలకు కోల్కతా వెళ్లి కనిపించకుండా పోయారు. ఉద్యోగాలు ఇప్పిస్తాను రాండంటూ ఓ బ్రోకర్ వారి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.18 లక్షలు వసూలు చేశాడు. అనంతరం, ఉద్యోగాల కోసం కోల్ కతా రావాల్సిందిగా చెప్పడంతో అక్కడికి వెళ్లిన యువకులను కిడ్నాప్ చేశాడు. అనంతరం మరో రూ.30 లక్షలు ఇస్తేనే వారిని వదులుతామంటూ వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. దీంతో విధిలేక తల్లిదండ్రులు చాగల్లు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు.
కోల్కతాలో పశ్చిమగోదావరి యువకులు కిడ్నాప్
Published Tue, Jun 23 2015 8:42 PM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM
Advertisement