కుప్ప కూలిన ఫ్లై ఓవర్
కోల్కతా: కోల్కతాలో గురువారం పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర కోల్కతాలోని గణేశ్ థియేటర్ గిరీశ్ పార్క్ ఏరియా సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ హఠాత్తుగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 18 మంది మృత్యువాత పడినట్లు సమాచారం. శిథిలాల కింద సుమారు 150 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కోల్కతా మెడికల్ ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న ఆర్మీ అధికారులు, జాతీయ విపత్తు నివారణ బృందంతో పాటు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కాగా ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతం ఉత్తర కోల్కతాలో జన సామర్థ్యం అధికంగా ఉండటమే కాకుండా,అత్యంతర ఇరుకైన ప్రదేశం. ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించిందని, దాంతో తామంతా ఉలిక్కిపడిటనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ శబ్ధానికి వెన్నులో నుంచి వణుకు పట్టిందని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. నిత్యం రద్దీగా ఉండే వివేకానంద రోడ్డులో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. ఈ ఫ్లై ఓవర్ పూర్తయితే కోల్ కతాలోనే పొడవైనదిగా గుర్తింపును పొందనుంది. గిరిష్ పార్క్ను హౌరాకు కలిపే ప్లై ఓవర్ కూడా ఇదే.