
ముంబై: సినీనటి పాయల్ ఘోష్ చేసిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై ముంబై పోలీసులు తదుపరి చర్యలు ప్రారంభించారు. విచారణకు హాజరు కావాలని అనురాగ్ కశ్యప్‌కు సమన్లు జారీ చేశారు. గురువారం వెర్సోవా పోలీసు స్టేషన్‌కు రావాలని పేర్కొన్నారు. అనురాగ్‌పై సెప్టెంబర్ 22న పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆయన తనపై 2013లో తనను వేధించాడని పాయల్ ఘోష్ ఫిర్యాదు చేశారు. అనురాగ్‌ను కఠినంగా శిక్షించాలని, తనకు న్యాయం చేయాలని పాయల్ ఘోష్ మంగళవారం మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీని కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment