ప్రేమించటం లేదని ఇంటికి నిప్పు | love harassment case in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమించటం లేదని ఇంటికి నిప్పు

Published Tue, Jan 12 2016 12:58 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

love harassment case in hyderabad

హైదరాబాద్: ప్రేమ, పెళ్లి పేరుతో ఓ యువతిని వేధిస్తూ మాట వినటం లేదనే అక్కసుతో చంపేందుకు యత్నించారు ఓ యువకుడు, అతని కుటుంబసభ్యులు. ఇందుకు సంబంధించి వివరాలివీ... ఫిల్మ్ నగర్‌కు చెందిన శివ అనే యువకుడు స్థానికంగా ఉండే యువతిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిర్భయ కేసు పెట్టి జైలుకు పంపారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన ఆ యువకుడు బాధితురాలిని మళ్లీ వేధించటం మొదలుపెట్టాడు.
 
కేసు వెనక్కి తీసుకోవాలని, శివను పెళ్లి చేసుకోవాలంటూ అతడి బంధువులు కూడా బెదిరిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ రాత్రి యువతి, ఆమె కుటుంబసభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటికి నిప్పుపెట్టి సజీవ దహనం చేసేందుకు యత్నించారు.  అయితే ఇంటి నుంచి బయటపడిన బాధితురాలు మళ్లీ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనకు పద్మ, మురళి, ఆటోరెడ్డి తదితరులు బాధ్యులంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement