స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు | allegedly-harassed-by-youth-girl-family-attacks-in ananthpur district | Sakshi
Sakshi News home page

స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు

Published Sat, Mar 26 2016 12:20 PM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM

allegedly-harassed-by-youth-girl-family-attacks-in ananthpur district

ధర్మవరం: ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న ఓ యువకుడికి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంజయ్‌నగర్‌కు చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. పట్టణంలోనే ఓ కళాశాలలో ఇంటర్ చదివే రాజేష్ ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సదరు బాలిక పరీక్ష కోసం ఇంటి నుంచి బయటకు రాగా.. అక్కడే ఉన్న రాజేష్‌ను చూసి భయంతో కుటంబ సభ్యులకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో వారు రాజేష్‌ను పట్టుకుని ఓ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. అనంతరం పట్టణ పోలీసులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement