dhrmavaram
-
పరిటాల ఫ్యామిలీకి గడ్డు కాలం
తెలుగుదేశంలో వ్యక్తులను బట్టి న్యాయ సూత్రాలు మారిపోతున్నాయి. ఒకొక్క కుటుంబానికి ఒక్కో రూల్ అన్నట్లుగా పార్టీ నడుస్తోంది. తమకు నచ్చితే ఒక విధంగా లేకుంటే ఇంకోవిధంగా రూల్స్ మార్చేసే చంద్రబాబు ఇప్పుడు పరిటాల కుటుంబాన్ని మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు. ఒకనాడు అనంతపురంతోబాటు రాయలసీమలో అధికభాగాన్ని ప్రభావితం చేసిన పరిటాల కుటుంబం ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోంది. గతంలో పెనుగొండ నుంచి గెలిచిన పరిటాల రవి మంత్రిగా పని చేశారు. జిల్లావ్యాప్తంగానే కాకుండా రాయలసీమ, కోస్తాలో సైతం హవా వెలగబెట్టారు. అయన మరణం తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన సునీత సైతం టీడీపీలో మంత్రిగా చేసారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం సునీతతోబాటు కుమారుడు శ్రీరామ్‌కు రెండు టిక్కెట్స్ అడుగుతోంది. కానీ దీనికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ ఇస్తామని, రెండేసి ఇవ్వలేమని, ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ అని చెబుతున్నారు. కానీ లోకేష్, చంద్రబాబు, బాలయ్యబాబు మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఉండొచ్చా అనే ప్రశ్నలు పరిటాల క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి. ఇక లోకేష్, చంద్రబాబు మాత్రం రెండేసి చోట్ల పోటీ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి.. లోకేష్ మంగళగిరి నుంచి.. బాలకృష్ణ హిందూపురం నుంచి.. బాల కృష్ణ చిన్న అల్లుడు భరత్.. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాకానీ మాకు మాత్రం రాప్తాడు, ధర్మవరం రెండు సీట్లు ఇవ్వరా అని పరిటాల కుటుంబం ఆవేదన చెందుతోంది. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా టెక్కలి నుంచి అయన బాబాయ్ అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఒకే కుటుంబం కాదా అని పరిటాల కుటుంబం అడుగుతోంది. రాప్తాడు నుంచి పరిటాల రవి సతీమణి సునీత.. కుమారుడు శ్రీరామ్ ఆశిస్తున్నారు కానీ రాప్తాడు వరకూ ఒకే చేసిన చంద్రబాబు ధర్మవరం టిక్కెట్ మాత్రం ఇచ్చేదిలేదని అంటూ అక్కడ వరదాపురం సూరి వైపు మొగ్గు చూపుతున్నారు. యువతకు 40 సీట్లు ఇస్తానని మహానాడులో భారీగా హామీ అయితే ఇచ్చారు కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య యేళ్ళనాటి వైరం ఉంది. దీంతోబాటు పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి కూడా పరిటాలను ధర్మవరం రానివ్వడం లేదు. వాళ్ళు అవకాశం వస్తే పరిటాల కుటుంబాన్ని ఓడించడానికి చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా జిల్లాలో మూలమూలనా వ్యతిరేకత మూటగట్టుకుని శత్రువులను పెంచుకుంటూ వెళ్లిన పరిటాల కుటుంబాన్ని ఆదరించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాప్తాడుతో సరిపెట్టేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. - సిమ్మాదిరప్పన్న -
అంకుల్.. అంకుల్..సార్.. సార్
సాక్షి, ధర్మవరం : పట్టుమని పద్దెనిమిదేళ్లు కూడా ఉండవు ఆ యువకునికి.. అధికార పార్టీ అండ చూసుకొని అధికారులను సైతం నిబంధనలకు విరుద్ధంగా తన చెప్పుచేతల్లో ఉంచుకునేలా వ్యవహరిస్తుంటే.. డివిజన్ స్థాయి పోలీసు అధికారి సైతం అతన్నే ‘బాస్’లా భావిస్తూ ‘సార్..సార్’ అని సంబోధిస్తుండడాన్ని చూసి అక్కడున్నవారు అవాక్కయ్యారు. అతనేమో డివిజన్ స్థాయి పోలీసు అధికారిని కూడా ‘అంకుల్.. అంకుల్’ అని పిలవడం.. ఆ అధికారి మాత్రం తన స్థాయిని, ఎన్నికల నియమావళిని మరిచి ఆయనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పూర్తి స్థాయిలో గౌరవాన్ని ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఎవరతను.. ఇదంతా ఎక్కడ జరిగిందనుకుంటున్నారా..? అదెక్కడో కాదు.. ధర్మవరం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న సన్నివేశం ఇది. ధర్మవరం నియోజకవర్గ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులకు తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. అధికారిక హోదాలో అక్కడికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ తనయుడు గోనుగుంట్ల నితిన్సాయికి పోలీసులు, ఎన్నికల అధికారులు సైతం రాచమర్యాదలు చేశారు. ఏకంగా గోనుగుంట్ల నితిన్‌సాయి ఫెసిలిటేషన్ సెంటర్లోకి దూసుకుపోతున్నా.. ఉద్యోగులను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నా అధికారులు మిన్నకుండిపోవడం గమనార్హం. -
పెళ్లింట్లో భారీ చోరీ
పెళ్లి జరిగిన ఇల్లు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, బంధువులతో సహా అంతా అర్ధరాత్రి వరకూ కబుర్లతో కాలక్షేపం చేసి అప్పుడే నిద్రించారు. వేసవి రాత్రులు కావడంతో ఉక్కపోత వల్ల తలుపులు బార్ల తెరిచారు. ఇదే అదను కోసం ఎదురుచూస్తున్న దొంగలు నెమ్మదిగా ఇంట్లోకి ప్రవేశించారు. మహిళల మెడల్లో బంగారు చై న్లతో సహా మొత్తం క్షణాల్లో ఊడ్చేశారు. ఏం జరిగిందో తెలుసుకుని బాధితులు కేకలు వేసే లోగానే చీకట్లో మాయమైపోయారు. వివరాల్లోకి వెళ్తే.. –కొవ్వూరు రూరల్ కొవ్వూరు మండలం ధర్మవరంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు ఒంటిగంటన్నర సమయంలో పెళ్లి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ధర్మవరం గ్రామానికి చెందిన బొప్పన శ్రీనివాస్ తన మొదటి కుమార్తె వివాహం ఈ నెల 21వ తేదీన జరిపారు. ఈ క్రమంలో పెళ్లికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులతో పాటు అల్లుడు సురేష్, కుమార్తె అలేఖ్య ఇంట్లో నిద్రిస్తున్నారు. వేసవి కావడంతో ఇంటి తలుపులు తెరుచుకుని నిద్రిస్తున్న సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించారు. డ్రెస్సింగ్ టేబుల్‌పై ఉంచిన పెళ్లి కుమారుడి ఆరు కాసుల బంగారపు చైను, ఆరు కాసుల మూడు ఉంగరాలు, అక్కడే నిద్రిస్తున్న పెళ్లి కుమార్తె మెడలో ఉన్న నాను తాడును లాగేయడంతో మూడువంతుల తాడు దొంగ చేతికి వెళ్లింది. అంతేకాకుండా గుంటూరు నుంచి వివాహానికి వచ్చిన వృద్ధురాలు నల్లమోతు హనుమాయమ్మ తను నిద్రిస్తున్న మంచం తలగడ కింద ఉంచిన సుమారు 8 కాసుల రెండు గొలుసులను దోచుకుపోయారు. వెళుతూవెళుతూ పక్కగదిలో ఉన్న శ్రీనివాస్ చిన్న కుమార్తె సౌజన్య మెడలో సుమారు 4 కాసుల గొలుసును తెంపే ప్రయత్నం చేశారు. అయితే సౌజన్య మేల్కొని కేకలు వేస్తూ వెంబడించడంతో వారు పారిపోయారు. మొత్తం చోరీకి గురైన బంగారం 27 కాసుల వరకూ ఉండవచ్చని పోలీసులు తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకుని విచారణ ప్రారంభించారు. అంతకు ముందు రాత్రి 12 గంటల ప్రాంతంలో ధర్మవరం కొత్తకాలనీలో దోపిడీకి ప్రయత్నించగా అక్కడి వారు గుర్తించి కేకలు వేయడంతో నలుగురు వ్యక్తులు పారిపోయారని చెబుతున్నారు. డాగ్‌స్కా్వడ్, క్లూస్ టీం పరిశీలన చోరీ జరిగిన ఇంటిని కొవ్వూరు రూరల్ సీఐ సి.శరత్ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో ప్రతి అంగుళాన్ని పోలీసులు ఆధారాల కోసం వెతికారు. రాజమండ్రి నుంచి షాడో అనే జాగిలాన్ని తెప్పించి ఆ ప్రాంతమంతా పరిరక్షించారు. దొంగలు పారిపోతుండగా కంగారులో చేతి నుంచి జారిన పెండ్లి కుమారుడి మనీ çపర్స్‌ను జాగిలానికి వాసన చూపి వదిలారు. అయితే అది ఇంటి వద్ద నుంచి బయలు దేరి ధర్మవరం–కాపవరం ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఉన్న మురికి కాలువ వరకూ వెళ్లి వెనుదిరిగింది. క్లూస్ టీం బృందం నిందితుల వేలి ముద్రలను సేకరించింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు సేకరించామని, త్వరలో వారిని పట్టుకుంటామని తెలిపారు. రూరల్ ఎస్సై ఎం.శ్యాం సుందరరావు, సీసీఎస్ ఎస్సై పి. శ్రీనివాస సింగ్, సిబ్బంది పాల్గొన్నారు. దొంగ వెంట పరిగెట్టాను ఎవరో మెడలో చై న్లాగడంతో వెంటనే మెలకువ వచ్చింది. భయంతో కళ్లు తెరిచేసరికి మెడలో చై న్ లాక్కుని వెళుతున్న దొంగ కనిపించాడు. పెద్దగా కేకలు వేస్తూ దొంగ వెంట పరిగెట్టాను.. అయినా తప్పించుకుని పారిపోయాడు. బంధువులంతా ఇంట్లో ఉండగానే దొంగలు చొరబడి చోరీ చేయడంతో అంతా ఆందోళనగా ఉన్నాం. –బొప్పన సౌజన్య, ధర్మవరం -
చేనేత కార్మికుడి ఆత్మహత్య
ధర్మవరం అర్బన్ : అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని మహాత్మాగాంధీ కాలనీలో శంకర ప్రసాద్(40) అనే చేనేత కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పుల బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమారు రూ. 2 లక్షలు అప్పు ఉన్నట్లు వారు చెప్పారు. ప్రసాద్‌కు భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. సంఘటనా స్థలానానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు
ధర్మవరం: ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్న ఓ యువకుడికి బాలిక బంధువులు దేహశుద్ధి చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని సంజయ్‌నగర్‌లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సంజయ్‌నగర్‌కు చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. పట్టణంలోనే ఓ కళాశాలలో ఇంటర్ చదివే రాజేష్ ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం సదరు బాలిక పరీక్ష కోసం ఇంటి నుంచి బయటకు రాగా.. అక్కడే ఉన్న రాజేష్‌ను చూసి భయంతో కుటంబ సభ్యులకు అసలు విషయాన్ని చెప్పింది. దీంతో వారు రాజేష్‌ను పట్టుకుని ఓ స్తంభానికి కట్టేసి చితక్కొట్టారు. అనంతరం పట్టణ పోలీసులకు అప్పగించారు.