మణిదీపిక (ఫైల్), దర్శ అలేఖ్య (ఫైల్)
సాక్షి, ఉప్పల్: భర్త, అత్త వేధింపులకు భరించలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. రామంతాపూర్, గాంధీనగర్ జనప్రియ అపార్టుమెంట్‌లో నివసించే పసుమర్తి రాఘవేంద్రరావు, భార్య మణిదీపిక (32), వీరికి సాయి విజ్ఞేష్ (15) ఆశ్రిత (12) సంతానం. గత నాలుగేళ్లుగా రాఘవేంద్రరావు మద్యానికి బానిసై నిత్యం భార్యను కొడుతుండేవాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టినా ఫలితం లేకపోయింది. గురువారం తండ్రి పంగలూరి లక్ష్మీనారాయణ దాస్‌కు ఫోన్ చేసి తన భర్త 20వ తేదీన తీవ్రంగా కొట్టి చచ్చిపో అంటున్నాడని తెలిపింది. 21వ తేదీన మణిదీపిక అత్త సుగుణమ్మ లక్ష్మీనారాయణ దాస్‌కు ఫోన్ చేసి మీ కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది అని తెలిపింది. ఘటనా స్థలానికి చేరుకున్న నారాయణ దాస్ అత్త, భర్తల పోరు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
ఉప్పల్: బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేçసుకున్న సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఉప్పల్ భరత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్ కుమార్తె దర్శ అలేఖ్య (20), బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఇటీవల పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి ఇప్పుడే వద్దని చదువుకుంటాననడంతో తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment