
Comedian Bill Cosby Found Guilty Sexually Assaulting In 1975: ఎంతటి ప్రముఖులైన చేసిన నేరానికి శిక్ష అనుభవించక తప్పదని మరో సంఘటన నిరూపించింది. ఓ ప్రముఖ కమెడియన్ 1975లో చేసిన నేరం సుమారు 50 ఏళ్ల తర్వాత రుజువైంది. 5 దశాబ్దాల క్రితం అమెరికన్ కమెడియన్ బిల్ కాస్బీ ప్లేబాయ్ మాన్షన్‌లో ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆమె బిల్‌పై కేసు పెట్టింది. తర్వాత విచారించిన కాలిఫోర్నియాలోని జ్యూరీ తాజాగా మంగళవారం (జూన్ 21, 2022) తీర్పునిచ్చింది.
హాస్య నటుడు బిల్ కాస్బీ నేరం చేసినట్లు నిర్ధారించింది. అంతేకాకుండా బాధితురాలు జూడీ హుత్‌కు 5 లక్షల డాలర్లు నష్టపరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. 1975లో 36 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీ 16 సంవత్సరాల జూడీ హుత్‌ను లైంగికంగా వేధించాడు. ఓ సినిమా సెట్‌లో జరిగిన ఈ ఘటనలో జూడీతోపాటు ఆమె స్నేహితురాలు డొన్నా శామ్యూల్ సన్ (17) కూడా బాధితురాలైంది.
చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. అతడే కారణమని తండ్రి ఆరోపణ
ప్రస్తుతం 84 ఏళ్ల వయసున్న బిల్ కాస్బీపై పలువురు మహిళలు లైంగిక ఆరోపణలతో కేసులు వేశారు. ఈ క్రమంలోనే బిల్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కాగా 'అమెరికాస్ డాడ్'గా పిలవబడే బిల్ కాస్బీ 2018లో కూడా ఒక క్రిమినల్ కేసులో జైలుపాలయ్యాడు. తర్వాత పలు కారణాల వల్ల నేరం రద్దు కావడంతో గతేడాది విడుదల అయ్యాడు.
చదవండి: సినిమా సెట్‌లో ఇద్దరు నటులు మృతి.. ఆరుగురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment