
ఇటీవల అత్యధిక పాపులారిటీ సంపాందించుకున్న షోలలో 'పాండ్యా స్టోర్' ఒకటి. ఇందులో రిషితా ద్వివేది పాండ్యా పాత్రను నటి సిమ్రాన్ బుధారుప్ పోషించింది. అయితే ఈ పాత్ర కారణంగా నిజ జీవితంలో తనకు ఎదురైన బెదిరింపు సంఘటనలను తాజాగా తెలిపింది సిమ్రాన్.
Pandya Store Actress Simran Budharup Gets Rape Threats Because Of Role: ఇటీవల అత్యధిక పాపులారిటీ సంపాందించుకున్న షోలలో 'పాండ్యా స్టోర్' ఒకటి. ఇందులో రిషితా ద్వివేది పాండ్యా పాత్రను నటి సిమ్రాన్ బుధారుప్ పోషించింది. అయితే ఈ పాత్ర కారణంగా నిజ జీవితంలో తనకు ఎదురైన బెదిరింపు సంఘటనలను తాజాగా తెలిపింది సిమ్రాన్. సోషల్ మీడియా వేదికగా తనకు అత్యచారం, చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని చెప్పుకొచ్చింది. ఆ బెదిరింపులు తట్టుకోలేక చివరికీ వారిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేశానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న బెదిరింపుల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది సిమ్రాన్ బుధారుప్.
'పాండ్యా సోర్ట్ షోలో లీడ్ రోల్స్ అయిన రవి, దేవ్ మధ్య సంబంధాన్ని విడగొట్టే పాత్ర నాది. ఇది చూసిన ప్రేక్షకులు నన్ను దుర్బాషలాడడం మొదలు పెట్టారు. యువకులు, బాలికల సమూహం సోషల్ మీడియాలో అత్యచారం, చావు బెదిరింపులతో వేధించింది. వారు సుమారు 13-14 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలే. చదువు కోసమని వారి తల్లిదండ్రులు ఫోన్ల్ ఇచ్చారు. కానీ ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల నమ్మకాన్ని దుర్వినియోగం చేశారు. వారికి ఏది మంచి ఏది చెడు అనేది తెలియదు. అందుకే వారు ఇలా చేశారు. పరిస్థితులు దిగజారడంతో తప్పలేక పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాను. పిల్లలు మంచి, చెడుల మధ్య తేడాను అర్థం చేసుకోలేరు. కాబట్టి వారిని ఎప్పుడూ తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి.' అని సిమ్రాన్ తెలిపింది.
చదవండి: ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు
తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకునేలా ఉన్నావని నాన్న అన్నారు: సాయి పల్లవి
ఇప్పుడు నా అప్పులన్నీ తీర్చేస్తా: కమల్ హాసన్