![Hyderabad Police Arrested Man Who harassing Minor Girl - Sakshi](/styles/webp/s3/article_images/2022/06/16/minorr.jpg.webp?itok=o6MJgmEo)
సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. శేరిలింగంపల్లి పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని ఓ మైనర్ బాలిక(16)ను స్థానికంగా ఉండే నాగేశ్వర్‌రావు కుమారుడు అరవింద్ (21) ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం బాలిక ఇంట్లో తెలియడంతో బాలిక తండ్రి అరవింద్‌ను మందలించారు. ఇదిలా ఉండగా ఈ నెల 2న బాలిక తండ్రి ద్విచక్ర వాహననంతోపాటు మరో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఓ ఇంటికి అమర్చిన ఏసీ ఔట్ డోర్ కంప్రెషర్ కూడా కాలిపోయింది.
దీనికి కారణం అరవిందేనని స్థానికులు చితకబాదారు. ఈనెల 9న బాలికను అరవింద్ వే«ధిస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు 14న అరవింద్‌ను విచారణ కోసం పిలిచారు. తనపై వారు దాడిచేశారని ఫిర్యాదు చేశాడు. దీంతో బుధవారం చందానగర్ పోలీస్ స్టేషన్ ముందు బాలిక కుటుంబసభ్యులు ధర్నాకు దిగారు.చివరకు చందానగర్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సీఐ క్యాస్ట్రో తెలిపారు.
చదవండి: 'నా పిల్లలకు తల్లిని లేకుండా చేశావ్.. నిన్ను చంపి నా భార్యను తీసుకెళ్తా'
Comments
Please login to add a commentAdd a comment