నన్నే ప్రేమించాలి.. నన్నే పెళ్లి చేసుకోవాలి | Coordinator Raju Harassments To Movie Artist | Sakshi
Sakshi News home page

నన్నే ప్రేమించాలి.. నన్నే పెళ్లి చేసుకోవాలి

Published Tue, Mar 20 2018 8:35 AM | Last Updated on Thu, Aug 9 2018 7:28 PM

Coordinator Raju Harassments To Movie Artist - Sakshi

బంజారాహిల్స్‌: ‘నన్నే ప్రేమించాలి... పెళ్లంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి.. ఇంకెవరితోనైనా మాట్లాడావో ఖబడ్దార్‌..! ఎవరితో మాట్లాడాలన్నా నా అనుమతి తీసుకోవాలి.. నా మాట వినకపోయావో.. నీ క్యారెక్టర్‌ మంచిది కాదని చిత్రపరిశ్రమతో పాటు నీ కుటుంబ సభ్యుల్లో కూడా బదనాం చేస్తా అంటూ ఓ యువకుడు తనను మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ ఓ సినీనటి బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శ్రీకృష్ణానగర్, పిల్లర్‌ నంబర్‌ 3 వద్ద నివసించే వర్ధమాన నటికి (23)ని రెండు నెలలుగా జూనియర్‌ ఆర్టిస్ట్‌లను సరఫరా చేసే కో–ఆర్డినేటర్‌ రాజు వేధింపులకు గురి చేస్తున్నాడు.

తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడమేగాక ప్రతి రోజూ ఆమె గది వద్దకు వెళ్లి న్యూసెన్స్‌ చేస్తున్నాడు. ఎవరితోనైనానా మాట్లాడాలంటే తన అనుమతి తీసుకోవాలని లేకపోతే మీ తల్లిదండ్రులకు చెడుగా చెబుతానని బెదిరిస్తున్నాడు. ఈ నెల 17న ఆమె తాను నటిస్తున్న సినిమా దర్శకుడితో మాట్లాడుతుండగా అక్కడికి వచ్చి అతడితో నీకు సంబంధం ఏంటంటూ ప్రశ్నించాడు. తనతో పాటు బైక్‌ ఎక్కకపోతే దుష్ప్రచారం చేస్తానని హెచ్చరించడంతో రాజుపై చర్యలు తీసుకోవాలని తనకు రక్షణ కల్పించాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జేబులో యాసిడ్‌ సీసా పెట్టుకొని తనను  బెదిరిస్తున్నాడని ఆరోపించింది. నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement