అడ్డుగా ఉన్నాడని.. | Man Harassments On Boy | Sakshi
Sakshi News home page

అడ్డుగా ఉన్నాడని..

Published Wed, Mar 14 2018 8:20 AM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

Man Harassments On Boy - Sakshi

సనత్‌నగర్‌: భర్తను కోల్పోయిన మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి తమకు అడ్డుగా ఉన్నాడని ఆమె కుమారుడిని చిత్రహింసలకు గురిచేస్తుండటంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి సనత్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జయమ్మ భర్త చనిపోవడంతో మోతీనగర్‌ బబ్బుగూడలో ఉంటున్న పెద్దిరాజుతో సహజీవనం చేస్తోంది.

ఈ క్రమంలో ఆమె కుమారుడు పవన్‌ను వదిలించుకోవాలని పెద్దిరాజు జయమ్మపై ఒత్తిడి చేయడమేగాక తరచూ అతడిని కొట్టేవాడు. మంగళవారం అల్లరి చేస్తున్నాడంటూ పవన్‌ను ప్లాస్టిక్‌ వైర్‌తో బాదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు పెద్దిరాజుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బస్తీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  పెద్దిరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement