Single woman
-
తెలుగు తేజం రమాదేవి...
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా 25 మంది చీఫ్ ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేశారు. వీరిలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు! ఆమె తెలుగువారు కావడం విశేషం. ఆమే వి.ఎస్.రమాదేవి. అయితే ఆమె కేవలం 16 రోజులే ఆ పదవిలో కొనసాగారు. ఏలూరు జిల్లా చేబ్రోలుకు చెందిన రమాదేవి సివిల్ సర్వెంట్‌గా కేంద్రంలో పలు శాఖల్లో పని చేసి సత్తా చాటారు. కేంద్ర న్యాయ శాఖ స్పెషల్ సెక్రటరీగా, లా కమిషన్ మెంబర్ సెక్రటరీగా, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌గా పలు హోదాల్లో పని చేశారు. అనంతరం 1990 నవంబర్ 26న 9వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. 16 రోజుల అనంతరం డిసెంబర్ 11న రిటైరయ్యారు. ఆమెకు ముందు గానీ, తర్వాత గానీ మరో మహిళ సీఈసీ కాలేదు. అలా ఏకైక మహిళా సీఈసీగా రమాదేవి రికార్డు నెలకొల్పారు. పదవీ విరమణ తర్వాత ఆమె హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక గవర్నర్‌గా చేశారు. కర్ణాటకకు తొలి మహిళా గవర్నర్ కూడా రికార్డు నెలకొల్పారు. ► కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా అత్యధిక కాలం పదవిలో ఉన్న రికార్డు రెండో సీఈసీ కె.వి.కె.సుందరానిది. ఆయన 8 ఏళ్ల 284 రోజులు పదవిలో కొనసాగారు. ► ఆ తర్వాతి స్థానంలో తొలి సీఈసీ సుకుమార్ సేన్ ఉన్నారు. ఆయన 8 ఏళ్ల 273 రోజులు పదవిలో ఉన్నారు. -
జీవితంపై విరక్తితో.. మహిళ తీవ్రనిర్ణయం..!
మంచిర్యాల: జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై రాజవర్థన్ వివరాల ప్రకారం.. మండలంలోని నర్సింగాపూర్ గ్రామానికి చెందిన దామరకొండ శంకరమ్మ (50) భర్త పర్వతాలు సంవత్సరం క్రితం మరణించాడు. అప్పటి నుంచి ఆమె నర్సింగాపూర్‌లోని స్వంత ఇంటి వద్ద ఒంటరిగా ఉంటుంది. భర్త లేకపోవడంతో పాటు ఉన్న ముగ్గురు కుమారులు దగ్గర లేకపోవడంతో మానసికంగా కృంగిపోయింది. బుధవారం సాయంత్రం ఇంట్లోని పురుగుల మందు తాగి పడిపోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపాడు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
హిచ్ హైకింగ్: ఎవరెస్ట్ వరకూ లిఫ్ట్ అడిగింది
ఎవరెస్ట్ వరకూ వెళ్లాలంటే ఎవరైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. నలుగురితో కలిసి వెళతారు. ఆమె ఒక్కతే వెళ్లాలనుకుంది. అదీ లిఫ్ట్ అడుగుతూ వెళ్లాలనుకుంది. అలా ఒక్కరే ప్రయాణ ఖర్చులు లేకుండా దొరికిన వాహనంతో పర్యటించడాన్ని ‘హిచ్ హైకింగ్’ అంటారు. ఐదుగురు పిల్లల తల్లి నాజిరా నౌషాద్ సాహసంతో ఈ పని చేసి ‘ఈ దేశం స్త్రీలకు సురక్షితమైనదే’ అని సందేశం ఇస్తోంది. ఇది వింత సంగతి. ఘనంగా చెప్పుకోవలసిన సంగతి. లారీల్లో లిఫ్ట్ అడుగుతూ (హిచ్ హైకింగ్) కేరళ నుంచి ఒక ఒంటరి మహిళ ట్రావెల్ చేయగలదా? చేయగలదు అని నిరూపించింది నాజిరా నౌషాద్. ఫిబ్రవరి 9న బయలు దేరి కేరళ నుంచి నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకూ వెళ్లిరావడానికి 50 రోజుల లక్ష్యం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కేరళలోని కుట్టనాడ్‌లోని మన్‌కొంబు నాజిరా ఊరు. అది సముద్ర మట్టానికి 10 అడుగుల దిగువ. అక్కడి నుంచి బయలుదేరి సముద్రమట్టానికి 17,500 అడుగుల పైన ఉన్న ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు హిచ్ హైకింగ్ చేయాలని నిశ్చయించుకుంది నాజిరా. అలా చేయడంలో ఎంతో రిస్క్. ఒంటరి స్త్రీల మీద ఏ అఘాయిత్యం అయినా జరగొచ్చు. ‘లారీ డ్రైవర్ల మీద చాలా అపప్రథలు ఉన్నాయి. కాని నేను చూసిన లారీడ్రైవర్లు ఎంతో స్నేహపాత్రంగా ఉన్నారు. నా లక్ష్యం చేరుకోవడానికి సాయం చేశారు’ అంటుంది నాజిరా. షి కెన్ ట్రావెల్ అలోన్ ‘ఒంటరిగా స్త్రీ ప్రయాణించగలదు’ అనే స్లోగన్‌తో 33 ఏళ్ల నాజిరా ఈ యాత్ర మొదలెట్టింది. ఆమె భర్త ఒమన్‌లో ఉద్యోగం చేస్తాడు. ఆమెకు ఐదుగురు పిల్లలు. నాజిరా ట్రావెల్ వ్లోగర్. అంటే యాత్రా కథనాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ఆమెకు ఫాలోయెర్స్ ఉన్నారు. నాలుగేళ్ల క్రితం భర్త ఇండియా వచ్చినప్పుడు కారులో వాళ్లు టూరు చేశారు. అప్పుడే ఆమెకు తాను కూడా ప్రయాణాలు చేసి సోషల్ మీడియాలో పంచుకోవాలనిపించింది. ‘గత సంవత్సరం మరో ఇద్దరు మహిళలతో కలిసి లదాఖ్ వరకు యాత్ర మొదలెట్టాను రోడ్డు మార్గం ద్వారా. కాని 20 రోజులకే వారు వెనక్కు వెళ్లిపోయారు. నేను మాత్రం యాత్ర కొనసాగించాను. వెనక్కు తిరిగి వచ్చి ‘నేను చూసిన దేశం’ అనే పుస్తకం రాసి ప్రచురించింది. ఆ తర్వాత నెల రోజులకే కేవలం షిప్ చార్జీలు జేబులో పెట్టుకుని లక్షద్వీప్‌కు వెళ్లింది. 10 దీవులను 25 రోజుల్లో తిరిగి వచ్చింది. తన ఫాలోయెర్స్ ఇళ్లల్లో లేదా స్థానికుల ఇళ్లలో రిక్వెస్ట్ చేసి బస చేసేది. ఇప్పుడు ఈ ఎవరెస్ట్ యాత్ర చేసింది. మన దేశం సురక్షితమే ‘మన దేశం స్త్రీ పర్యాటకులకు సురక్షితమే అని చెప్పడమే నా ఉద్దేశ్యం. మన దేశాన్ని మనం చూడకుండా విదేశాలకు వెళ్లి అక్కడ భద్రత ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు’ అంటుంది నాజిరా. వీపుకు ఒక బ్యాక్‌ప్యాక్ తగిలించుకుని ఫిబ్రవరి 9న ఆమె కేరళలో బయలుదేరింది. పిల్లల్ని చూడటానికి ఇంట్లో తల్లి ఉంటుంది. ‘పిల్లల్ని అలా వదిలి బయలుదేరడం అందరికీ నచ్చదు. కాని మాటలు అనేవారిని నేను పట్టించుకోను’ అంటుంది నాజిరా. కేరళ నుంచి లారీలు, ట్రక్కులు పట్టుకుంటూ ఫిబ్రవరి 21కి ఆమె ఢిల్లీ చేరుకుంది. మరో లారీ దొరికే వరకు దిగిన ఊరులో ఏదో ఒక ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లో బస చేస్తూ వెళ్లింది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని సొనౌలీ చేరుకుని అక్కడి నుంచి నేపాల్‌లోని లుల్కాకు విమానంలో వెళ్లింది. రికార్డు జర్నీ ఎవరెస్ట్ బేస్‌క్యాంప్‌కు వెళ్లాలంటే లుల్కా నుంచి ట్రెక్ చేయాలి. అంటే కాలినడకన వెళ్లాలి. 2860 మీటర్ల ఎత్తున్న లుల్కా నుంచి 5364 మీటర్ల ఎత్తున్న బేస్‌క్యాంప్‌కు నడవాలంటే 8 రోజులు పడుతుంది. ‘కాని నేను ఐదురోజుల్లో చేరుకున్నాను. ఒక మహిళ ఇంత వేగంగా చేరుకోవడం రికార్డు’ అంటుంది నాజిరా. ఈ దారిలో ఆమె ప్రయాణించడానికి గైడ్‌ను మాట్లాడుకుంది. బేస్‌క్యాంప్ దగ్గర ఆమె దిగిన ఫొటో నిజంగానే ఒక సాహస చిహ్నం. కొంతమంది మరొకరు అనుకరించడానికి వీలులేని సాహసాలు చేస్తారు. నాజిరాను ఎంతమంది స్ఫూర్తిగా తీసుకోగలరు? అంత రిస్క్ ఎవరు చేయగలరు? కాని చేయాలనుకుంటే ఒక విజేత అంతకు ముందు దారి వేసింది అని చెప్పడానికి నాజిరా ఉంది. నాజిరా ఈజ్ గ్రేట్. -
భార్య మరో వ్యక్తితో పోయిందని.. భర్త ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని..
సాక్షి, సిద్ధిపేట: సిద్దిపేట జిల్లాలో జరిగిన జంట మహిళల హత్య కేసుల్లో సిద్దిపేట టూటౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సిద్దిపేట టూటౌన్ సీఐ పరశురామ్‌గౌడ్, త్రీటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన షేక్ షాబుద్దీన్ (43) కలాయి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో తన మొదటి భార్య మోసం చేసి వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని, ఈ విషయంలో వారి బంధువుల్లో ఇద్దరి ప్రమేయం ఉందని వారిని హత్య చేసిన కేసుల్లో 2006లో జీవితఖైదు పడి చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. చదవండి: మహిళా హత్య: వివాహేతర సంబంధం?.. తమ్ముడి భార్యే.. రెండు నెలల క్రితం బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని వారిని హత్య చేస్తున్నాడు. ఈ క్రమంలోనే గతంలో పరిచయం ఉన్న సిద్దిపేట పట్టణం కేసీఆర్‌నగర్‌లో ఉంటున్న లక్ష్మిని తన కోరిక తీర్చలేదనే కారణంతో ఈ నెల 1వ తేదీన మెడకు చీర కొంగుతో బిగించి హత్య చేశాడు. అదే రోజు రాత్రి దుద్దెడ గ్రామంలో ఒంటరిగా ఉంటున్న మర్కూక్ మండలానికి చెందిన స్వరూప అంబేడ్కర్ విగ్రహం పక్కన ఉన్న ఓ దుకాణం ముందు ఉండగా, మద్యం మత్తులో షాబుద్దీన్ తన కోరిక తీర్చాలని అడగాడు. అందుకు ఆ మహిళ నిరాకరించడంతో ఆమెను రాయితో నుదిటిపై కొట్టి హత్య చేశాడు. చదవండి: Disha Encounter: ముగిసిన సజ్జనార్ విచారణ.. అడిగిన ప్రశ్నలివే.. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే సోమవారం పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న కల్లు కాంపౌండ్‌లోకి కల్లు తాగడానికి నిందితుడు రావడంతో సిద్దిపేట టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, రెండు హత్యల వివరాలు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతురాళ్ల నుంచి దొంగిలించిన రెండు సెల్ ఫోన్లను నిందితుడిని నుంచి స్వా«దీనం చేసుకున్నారు. షేక్ షాబుద్దీన్ అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
అవివాహిత ఆత్మహత్య
మీర్‌పేట: ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డీఎంఆర్ఎల్లో శాస్త్రవేత్తగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన నిరంజన్‌దాస్ భార్యాబిడ్డలతో కలిసి మీర్‌పేట లెనిన్‌నగర్ అనూరాగ్‌నగర్ కాలనీలో ఉంటున్నారు. అతని సోదరి ప్రభావతిదాస్ (41) అవివాహిత. గతంలో ఆమె ఢిల్లీలోని బ్రహ్మకుమారీస్ ఆశ్రమంలో ఉండేది. ఉద్యోగం కోసం గత కొన్ని రోజుల క్రితం నగరానికి వచ్చిన ప్రభావతిదాస్ అనూరాగ్‌కాలనీలోని సోదరుడు నిరంజన్‌దాస్ వద్దకు వచ్చి ఉంటోంది. నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు కూడా హాజరైంది. సదరు కంపెనీ వారు 15 రోజుల తరువాత చెబుతామని చెప్పడంతో ఆమె సోదరుని వద్దే ఉంటోంది. ఈ నెల 8వ తేదీన నిరంజన్‌దాస్ తన కుమారుణ్ని ఒరిస్సాలోని బంధువుల వద్దకు తీసుకవెళ్లేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఆయన భార్య లక్ష్మీ ప్రియ దాస్, సోదరి ప్రభావతి దాస్ ఇద్దరే ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం లక్ష్మీ ప్రియ దాస్ బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి బయటి నుంచి గడియ పెట్టి ఉంది. అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా ప్రభావతి దాస్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, లక్ష్మీప్రియదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
పెట్రోల్ దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
-
ఒంటరి మహిళపై పెట్రోల్ దాడి..
నెల్లూరు, వాకాడు: వాకాడు మండలం నెల్లిపూడి పంచాయతీ వెంకటరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఓ మహిళపై ఆదివారం రాత్రి వాకాడు పంచాయతీ గొల్లపాళెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పెట్రోలు పోసి నిప్పుటించిన ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు వెంకటరెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఓ 28 ఏళ్ల మహిళకు వివాహమై భర్త చనిపోయి ఒంటరిగా జీవిస్తోంది. ఈ క్రమంలో గొల్లపాళెం గ్రామానికి చెందిన కావలి కృష్ణయ్య అనే వ్యక్తి ఆమెతో కొద్దికాలంగా సన్నిహితంగా ఉంటున్నాడు. వీరిద్దరి మధ్య ఆదివారం కొంత వివాదం చోటుచేసుకోవడంతో తట్టుకోలేని కృష్ణయ్య వాకాడు గురకుల పాఠశాలకు వెళ్లే రహదారి వద్దకు రమ్మని ముఖం, చాతీపై పెట్రోలుపోసి నిప్పు అంటించి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన మహిళ కేకలు వేయడంతో స్థానికులు వాకాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం కోటకు తరలించారు. బాధితురాలు, బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ రఘునాథ్ తెలిపారు. -
నెలకే దగా !
అమడగూరు: ఏ ఆధారం లేని ఒంటరి మహిళలకు ఆసరాగా నిలుస్తామని.. ప్రతి నెల పింఛన్ కింద రూ 1,000 ఇచ్చి ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రకటనతో చాలా మంది ఒంటరి స్త్రీలంతా ఎంతగానో సంతోషపడ్డారు. టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు అన్నీ మేమే చేసేస్తున్నట్లుగా ఫొటోలకు సైతం ఎగబడి ఫోజులిచ్చారు. అయితే పింఛన్లు మంజూరు చేసిన రెండో నెలకే పరిస్థితి తారుమారైంది. మొదటి నెల మంజూరు చేసిన పింఛన్లలో సుమారు 25 శాతం మందికి పింఛన్లను తొలగించేశారు. వయసు నిబంధనలు మార్చడంతో పింఛన్లు ఆగిపోయాయి. దీంతో ప్రభుత్వంపై ఒంటరి స్త్రీలంతా మండిపడుతున్నారు. కొత్త నిబంధనతో మెలిక ఎన్టీఆర్ భరోసా పథకం మొదట్లోనే ఒంటరి మహిళలను దగాకు గురి చేసింది. ఈ పథకం కింద ప్రభుత్వం జూలై నెలలో ఒంటరి స్త్రీలకు పింఛన్లను మంజూరు చేసింది. జీవనం కోసం ఎలాంటి ఆసరా లేని వారిని, పోషించే వారు దగ్గర లేని వారిని, భర్త వదిలేసిన మహిళలను పింఛన్లకు దరఖాస్తు చేసుకోమని ప్రభుత్వం జోరుగా ప్రచారం చేసింది. ఈ విధంగా ఉండి 21 సంవత్సరాలకు పైబడిన మహిళలు దరఖాస్తు చేసుకుంటే ప్రతినెలా పింఛన్ కింద రూ 1,000 ఇచ్చి ఆదుకుంటామని భరోసా కల్పించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న 63 మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుండి వేల సంఖ్యలో ఈ పింఛన్లకు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే జన్మభూమి కమిటీ సభ్యులు, రాజకీయ నాయకుల సిఫారసులు, తదితర కుంటిసాకులతో అనేక ఒడపోతల తర్వాత పుట్టపర్తి నియోజకవర్గానికి పింఛన్లు మంజూరు చేశారు. ఒంటరి మహిళ పింఛన్‌కు మొదట్లో వయసు 21 అని చెప్పి తర్వాత 35కు సడలింపు చేస్తూ మార్పులు చేసింది. ప్రజాసాధికార సర్వే, ఆధార్ సీడింగ్ ఆధారాలతో ఆన్లైన్ విధానంలో వయస్సు తక్కువ ఉన్న వారిని అనర్హులుగా ప్రకటించింది. ఈ విధంగా చేసిన ప్రభుత్వ తీరుతో నియోజకవర్గ వ్యాప్తంగా 67 మంది అనర్హులయ్యారు. ఇకనుండి ప్రతి నెలా రూ 1,000 చేతికందుతుందిలే అనుకుని ఆశపడిన మహిళలకు అది ఎన్నో రోజులు నిలబడలేదు. మొదటి నెల పింఛన్ అందుకుని మళ్లీ సెప్టెంబర్‌లో తీసుకుందామని వెళ్లిన మహిళలకు నిరాశ ఎదురైంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలాగా ఒంటరి స్త్రీ పింఛన్లలో కూడా మహిళలకు అన్యాయం చేస్తోందంటూ వారంతా కంటతడి పెడుతున్నారు. నమ్మించి మోసం చేశారు పన్నెండేళ్ల క్రితమే నా భర్త నన్ను వదిలేశాడు. నాకు ఇద్దరు చిన్న పిల్లలున్నారు. బడికెళ్లి వారు చదువుకుంటున్నారు. జీవనోపాధి బరువైపోయింది. నెలానెలా రూ 1,000 ఇస్తామంటే ఇంటి అవసరాలకు ఉపయోగపడుతుందనుకున్నాను. ఇచ్చిన నెలకే ఆపేశారు. నాలాంటి ఎంతో మంది మహిళలకు అన్యాయం చేశారు. సరిపడే వయసున్నా ఆధార్‌లో తక్కువగా ఉందని పింఛన్ తొలగించారు. – మణి, ఒంటరి మహిళ, అమడగూరు -
మహిళ దారుణ హత్య
భర్త చనిపోయి ఇంటిలో ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన పాయకాపురంలో గురువారం చోటుచేసుకుంది. అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): భర్త చనిపోయి ఇంటిలో ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన పాయకాపురంలో గురువారం చోటుచేసుకుంది. నున్న రూరల్ పోలీసులు తెలిపిన, సేకరించిన వివరాల ప్రకారం పాయకాపురం పెట్రోల్‌బంకు పక్క రోడ్డుకు చెందిన కారుమూరి అంజలి దేవి(52)కి ఒక కూతురు, ఒక కొడుకు సంతానం ఉన్నారు. భర్త కొన్నేళ్ల క్రితం చనిపోగా, పిల్లలిద్దరికి పెళ్లిళ్లు చేసి సమీపంలోనే వారికి రెండు ఇళ్లు ఇవ్వడంతో అప్పటినుంచి వారు వేరుగా ఉంటున్నారు. తనకున్న రెండంతస్తుల భవనంలో కింది గదులను అద్దెలకు ఇచ్చి భవనం పైభాగంలో ఆమె ఒక్కతే నివసిస్తుంది. అయితే బుధవారం రాత్రి ఇంటిపక్కన వారితో మాట్లాడి టీవీ చూసి నిద్రపోతానంటూ ఇంటిలోకి వెళ్లిపోయింది. అయితే గురువారం మధ్యాహ్నం అయినా కూడా ఆమె గదిలో నుంచి బయటకు రాకపోవడం, ఎంత పిలిచినా పలుకకపోవడంతో అనుమానం వచ్చిన చుట్టుపక్కన అద్దెకుంటున్న వారు తలుపులు పగలకొట్టి చూడగా ఇంటిలోని మంచంపై ఆమె విగతజీవిగా మారి కనిపించింది. బీరువాలోని దుస్తులన్నీ కిందపడేసి ఉండడం, ఇంట్లో సామాన్లన్నీ చెల్లాచెదురై ఉండడంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు. పాతనేరస్తులా.. తెలిసినవారి పనా..? సమాచారం అందుకున్న నున్న రూరల్ పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. బీరువాలో పెట్టిన 17 కాసుల బంగారం, కొంత నగదుతో పాటు మృతురాలి ఫోను కూడా మాయం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పాతనేరస్తులు చేసిన పనా, లేక ఎవరైనా తెలిసిన వ్యక్తులు ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ, ఏసీపీ మహిళ హత్య విషయాన్ని తెలుసుకున్న డీసీపీ నవాబ్‌జాన్, నార్త్ జోన్ ఏసీపీ శ్రావణిలు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలి వివరాలు అడిగి తెలుసుకొని హత్యకు కారణాలపై సిబ్బందిని, స్థానిక ప్రజలను ఆరా తీశారు. హత్యకు కారణాలు తెలుసుకుంటున్నామని త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ ఎంవీ దుర్గారావు తెలిపారు. -
మహిళ దారుణ హత్య
గుంటూరు, బెల్లంకొండ(పెదకూరపాడు): ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలోని మన్నెసుల్తాన్‌పాలెం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు గ్రామానికి చెందిన చేవూరి సీతారావమ్మ(45)గా గుర్తించారు. మృతురాలి భర్త చేవూరి శ్రీను కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. వారికి సంతానం లేదు. సీతారావమ్మ కూలి పనులకు వెళ్తూ ఒంటరిగా జీవిస్తోంది. రోజూమాదిరిగా ఇంటి వరండాలో నిద్రించింది. సీతారావమ్మ ఇంట్లో నీళ్ల మోటర్ ఉండడంతో తెల్లవారు జామున నీళ్ల కోసం వెళ్లిన చుట్టు పక్కల మహిళలు ఆమెను నిద్ర లేపేందుకు పిలిచారు. ఎంత పిలిచినా పలకకపోవడంతో దగ్గరకు వెళ్లగా ఆమె తలపై తీవ్ర గాయమై, రక్తంతో తడిసి మంచంపై విగత జీవిగా పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీçసులకు తెలియజేశారు. స్థానిక ఎస్ఐ డి.జయకుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. నేర స్థలంలో క్లూస్ టీమ్ సభ్యులను పిలిపించి ఆధారాలను సేకరించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బంధువులా... బయటి వాళ్ల పనా..? ఎవరితోనూ ఎటువంటి వివాదాలు లేకుండా అందరికీ తలలో నాలుకలా ఉంటూ భర్త చనిపోయినా ధైర్యంగా ఒంటరిగా జీవనం సాగిస్తున్న సీతారావమ్మ హత్య గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది. గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. కూలి పనులకు వెళ్తూ, తన పని తాను చేసుకుంటూ బతుకుతున్న సీతారావమ్మను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తలపై విపరీతంగా కొట్టి, బండలపై పడిన రక్తాన్ని మోటర్ ఆన్ చేసి నీటితో శుభ్రంగా కడిగారు. సంఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు దొరక్కుండా నేరం చేసిన వారు జాగ్రత్త పడ్డారు. ఇది బయటి వాళ్ల పనా... లేదా బంధువుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పిడుగురాళ్ల రూరల్ సీఐ ఎం.సుబ్బారావు తెలిపారు. -
అడ్డుగా ఉన్నాడని..
సనత్‌నగర్: భర్తను కోల్పోయిన మహిళతో సహజీవనం చేస్తున్న ఓ వ్యక్తి తమకు అడ్డుగా ఉన్నాడని ఆమె కుమారుడిని చిత్రహింసలకు గురిచేస్తుండటంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేసి సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జయమ్మ భర్త చనిపోవడంతో మోతీనగర్ బబ్బుగూడలో ఉంటున్న పెద్దిరాజుతో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఆమె కుమారుడు పవన్‌ను వదిలించుకోవాలని పెద్దిరాజు జయమ్మపై ఒత్తిడి చేయడమేగాక తరచూ అతడిని కొట్టేవాడు. మంగళవారం అల్లరి చేస్తున్నాడంటూ పవన్‌ను ప్లాస్టిక్ వైర్‌తో బాదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు పెద్దిరాజుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బస్తీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దిరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు. -
ఒంటరి మహిళ ఒడిలో వరాల మూట
సర్వే జీవితం.. మనిషిని ఒంటరిగా ఉంచదు. ఉదయాన్నే సూర్యుడొచ్చి లేపుతాడు. రాత్రవగానే నక్షత్రాలు పలకరిస్తాయి. పక్షుల పరవశ రాగాలొచ్చి వాలిపోతాయి. పూల పరిమళాలు మెత్తగా హత్తుకుంటాయి. ఇవి మాత్రమే కాదు.. అనాథ బాలల నవ్వులూ ఉన్నాయి! ఆ నవ్వులకు ఒడిపడుతున్న వారిలో ఇప్పుడు మహిళలదే ముందడుగు. ‘ఒంటరి మహిళ ఈ సమాజంలో బతకడమే కష్టం.’ ఇటీవల సమాజంలో వస్తున్న మార్పులను చూస్తే ఈ అభిప్రాయం మెల్లమెల్లగా దూరమవుతోందనిపిస్తోంది. ఒంటరి మహిళ తాను జీవించడంతోపాటు మరో అనాథ బిడ్డను దత్తు తీసుకొని ఆ బిడ్డకు తల్లిలా ప్రేమను పంచుతోంది. మంచి భవిష్యత్తును ఇవ్వగలదని నిరూపిస్తోంది. సమాజంలో వస్తున్న మార్పులకు ఇదో మంచి సూచిక. ఇటీవల భారత ప్రభుత్వ దత్తత గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. రెండేళ్ల క్రితం అంటే 2015 ఆగస్టు నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా దత్తత కోరే తల్లిదండ్రుల వివరాల నమోదు తప్పనిసరి చేశారు. దీంట్లో భాగంగా 412 మంది ఒంటరి మహిళలు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీకి,, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ శాఖవారికి తమ వివరాలను పొందుపరుస్తూ నమోదు చేసుకున్నారు. 2015లో 75 మంది ఒంటరి మహిళలు పిల్లలను దత్తత తీసుకోగా వీరి సంఖ్య కిందటేడాది అంటే 2016లో 93కి పెరిగింది. భారతదేశం మొత్తం మీద 2015 – 2016 సంవత్సరంలో 2,903 మంది పిల్లలు దత్తత వెళ్లారు. 2011 జనాభా గణన సంఖ్యను పరిశీలిస్తే ఒంటరిగా ఉండే మహిళలు (పెళ్లికానివారు, వితంతువులు, విడాకులు తీసుకున్నవారు) 71 లక్షల పైచిలుకు ఉన్నారు. సమాజంలో ఎదుగుదల, ఒత్తిడి పరిగణనలోకి తీసుకుంటే ఇటీవల వీరిలో ఎంతో అవగాహన, ఆత్మవిశ్వాసం పెరిగినట్టుగా అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అవగాహన కల్గి ఉండే ఒంటరి మహిళల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. మగువలే ముందడుగు.. ఒంటరి మహిళలతో పోల్చితే ఒంటరి మగవారు పిల్లలను దత్తత తీసుకోవడంలో వెనుకబడే ఉన్నారు. 2015–2016లో ఒంటరి మగవారు దత్తత కోసం తమ పేర్లను నమోదుచేసుకున్నవారి సంఖ్య 25 ఉండగా కేవలం ఐదుగురు పిల్లలను మాత్రమే దత్తత స్వీకరించారు. దత్తత నమోదు పట్టికలో ఒంటరిగా ఉండే మహిళలు లేదా మగవారికీ కొత్త గైడ్‌లైన్స్‌ను రూపొందించారు. అయితే, ఒంటరిగా ఉండే మగవారు అమ్మాయిలను దత్తత తీసుకునే సౌలభ్యం లేదు. 55 ఏళ్లు వస్తే ఒంటరి మగవాడు దత్తత తీసుకునే అర్హతనూ కోల్పోతాడు. వివక్షకు వీడ్కోలు ‘‘ఒంటరి మహిళ పిల్లలను దత్తత తీసుకోవడానికి సాంఘిక వైఖరిలో వస్తున్న మార్పులు సహకరిస్తున్నాయి. అదేవిధంగా పారదర్శక విధానాలూ ఇందుకు సహాయపడుతున్నాయి’’ అంటున్నారు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ సెక్రటరీ కొలొనెల్ దీపక్ కుమార్. మాతృహక్కు అర్హత ప్రమాణాలను నెరవేర్చితే సమాజంలో వివక్ష తగ్గిపోతోందని, అయితే, ఒంటరి మహిళలకు దత్తత ఇవ్వడానికి దత్తతసంస్థలు ఇంకా అంత సుముఖంగా లేవని స్త్రీ, శిశు సంక్షేమ శాఖాధికారులంటున్నారు. అయినప్పటికీ నిరాకరణ... అక్టోబర్ 2015 నుంచి ఒంటరి మహిళకు బిడ్డను దత్తత ఇవ్వడానికి మదర్ థెరిస్సా మిషనరీస్ స్వచ్ఛంద సంస్థలు నిరాకరిస్తున్నాయి. కొత్త స్వీకరణ మార్గదర్శకాలను పాటించడానికి వీరు నిరాకరిస్తున్నారు. సైద్ధాంతిక కారణాల వలన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ఆధ్వర్యంలోని అనాథ శరణాలయాల్లో ఈ దత్తత స్వీకరణను నిలిపివేసింది. అయినప్పటికీ దేశం మొత్తమ్మీద 2016–2017 (మార్చి వరకు) పిల్లల దత్తతు సంఖ్య 2,671గా ఉంది. సర్వే ప్రకార ంగా దేశం మొత్తం మీద చూస్తే వివిధ స్వచ్ఛంద సంస్థలలో 50 వేలకు పైగా అనాథలు ఉన్నారు. వీరి నుంచి కూడా డేటా సేకరిస్తే దత్తత సంఖ్యలో మార్పు ఉండవచ్చు. చట్టబద్ధత లేని దత్తత... సమస్యే... చట్టబద్ధంగా దత్తత తీసుకునే తల్లితండ్రుల నమోదు సంఖ్య 14,000 మంది ఉన్నారు. దత్తతు ఇచ్చే పిల్లల సంఖ్య మాత్రం 1,800 మంది ఉన్నారు. చాలా స్వచ్ఛంద సంస్థలు అనాథ పిల్లల పూర్తి వివరాలను నమోదు చేయడం లేదు. ఈ విషయమే ప్రస్తావిస్తూ స్త్రీ శిశు శాఖా మంత్రి మనేకా గాంధీ ఇటీవల యూనియన్ హెల్త్ మినిస్టర్‌కు కొన్ని సూచనలు ఇచ్చారు. యోగ్యతలేని నర్సింగ్‌హోమ్‌లు, ఆసుపత్రులలో పిల్లల పేర్లు, తల్లిదండ్రుల పేరు నమోదు చేయరని, ఇక్కడి నుంచే దత్తత కార్యక్రమాలు అనధికారికంగా జరుగుతుంటాయని తెలియజేసేవారు. ఇలాంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చట్టసమ్మతికాని దత్తత ఎప్పటికైనా సమస్యలకు కారణమే అవుతుందని, దీనిపట్ల సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. – ఎన్.ఆర్ -
లక్ష మందికిపైగా ఆర్థిక భృతి!
- ఒంటరి మహిళల ఆర్థిక భృతికి రూ.49.37 కోట్లు విడుదల - జూన్ 2న అందజేయనున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: జూన్ 2(రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం)న 1,09,292 మంది ఒంటరి మహిళలకు ఆర్థిక భృతిని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ.49.37 కోట్లను విడుదల చేసింది. ఏ ఆదరువు లేని ఒంటరి మహిళలకు గత ఏప్రి ల్ 1 నుంచి ఆర్థిక భృతిని వర్తింపజే స్తామని సీఎం కేసీఆర్ గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సెర్ప్ అధికారులు, వాటిని పరిశీలించిన అనంతరం లబ్దిదారుల లెక్క తేల్చారు. నిబంధ నల మేరకు ఎంపిక చేసిన లబ్దిదారులకు గత రెండు నెలల ఆర్థిక భృతి మొత్తం (రూ.2 వేలు)ను ఆవిర్భావ దినోత్సవం రోజున వారి బ్యాంకు/పోస్టాఫీసు ఖాతాలకు జమ చేయ నున్నారు. ఆర్థికభృతి మంజూరుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను అదేరోజున అన్ని నియోజక వర్గాల్లోనూ స్థానిక ఎమ్మెల్యేలతో లబ్దిదారులకు అందజేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం నిమిత్తం ఒక్కొక్క నియోజక వర్గానికి రూ.50వేల చొప్పున సెర్ప్ కేటాయించింది. బీడీ కార్మికులకు ఆలస్యంగానే.. అర్హులైన బీడీ కార్మికులందరికీ ఆర్థికభృతిని అందిస్తామని ప్రకటించిన మీదట కొత్తగా 62,930 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో 23,638 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు 9,298 మందిని అర్హులుగా గుర్తించారు. అర్హులైన బీడీ కార్మికులకు మే నెల నుంచి ఆర్ధిక భృతి వర్తించనుండగా, జూన్ 2న అందజేస్తారని లబ్దిదారులు ఆశించారు. అయితే, ఒంటరి మహిళలకు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేసినందున బీడీ కార్మికుల భృతి మరింత ఆలస్యం కావచ్చని తెలుస్తోంది. -
లక్ష మందికి ఇద్దామా!
- జూన్ 2న ఒంటరి మహిళలకు ఆర్థికభృతి అందజేయడంపై సర్కార్ తర్జనభర్జన - కేవలం 71 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తి - మరొక రోజు గడువు పెంచాలని సెర్ప్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న ఒంటరి మహిళలకు ఆర్థికభృతిని అందించే విషయమై సర్కారు తర్జనభర్జన పడుతోంది. ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి నెలకు రూ.1,000 చొప్పున ఆర్థికభృతిని వర్తింపజేస్తూ జూన్ 2న రెండు నెలల మొత్తాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఒంటరి మహిళలకు ఆర్థికభృతి పథకానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 1,46,280 దరఖాస్తులు అందాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 1,14,010 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుంచి 32,270 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల పరిశీలన ఈ నెల 25 లోగా పూర్తి చేసి అర్హులకు జూన్ 2న రెండు నెలల భృతిని అందించాల్సి ఉంది. అయితే, గురువారం నాటికి 71,815 దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. వీటిలోనూ 68,076 దరఖాస్తులు అర్హమైనవని తేల్చిన అధికారులు.. 3,739 దరఖాస్తులను తిరస్కరించారు. కాగా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు లక్ష మంది ఒంటరి మహిళలకైనా లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలని సెర్ప్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ గురువారంతో ముగియగా, శుక్రవారం వరకు పొడిగిం చాలని నిర్ణయించినట్లు తెలిసింది. బీడీ కార్మికులకు మరింత వెసులుబాటు ఆసరా పింఛన్దారులున్న కుటుంబాల్లోని బీడీ కార్మికులకు కూడా ఆర్థికభృతిని ఇచ్చే నిమిత్తం ప్రభుత్వం ఇటీవల వెసులు బాటు కల్పించింది. అయినప్పటికీ సర్కారు ఆశించిన మేరకు దర ఖాస్తులు అందలేదు. దాదాపు 80 వేల నుంచి లక్ష వరకు దర ఖాస్తులు రావచ్చని సర్కారు అంచనా వేయగా, దరఖాస్తు గడువు ముగిసే నాటికి కేవలం 49 వేల దరఖాస్తులు అందాయి. దీంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం... ఒక కుటుంబంలో ఒక బీడీ కార్మికుడికే ఆర్థికభృతిని అందించాలనే నిబంధనను తాజాగా సవరించింది. దీంతో ఒకే కుటుంబంలో ఎంతమంది బీడీ కార్మికులు ఉన్నప్పటికీ ఆర్థికభృతికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో గురువారం నాటికి మరో 10 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. మొత్తంగా 59,822 దరఖాస్తులు ప్రభుత్వానికి అందగా గురువారం నాటికి 36,415 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇందులో 19,286 దరఖాస్తులను అర్హమైనవిగా అధికారులు తేల్చారు. దరఖాస్తుల పరిశీలనకు శుక్రవారం వరకు గడువు పొడిగించిన అధికారులు... జూన్ 2 నాటికి కనీసం 25 వేలమంది బీడీ కార్మికులకు కొత్తగా ఆర్థికభృతి అందించాలని భావిస్తున్నారు. -
ఆర్థిక భృతి దరఖాస్తు గడువు పెంపు
- ఈనెల 21 వరకు పొడిగించిన ప్రభుత్వం - గడువులోగా దరఖాస్తు చేసిన ఒంటరి మహిళలకే జూన్ 2న ఆర్థిక భృతి - ఇప్పటి వరకు అందిన దరఖాస్తులు 1.20 లక్షలే సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి దరఖాస్తు గడువును ఈనెల 21 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఆర్థిక భృతి పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 8 నుంచి 13 వరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యాలయాలు, గ్రామ సభల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో వార్డు కార్యాలయాలు, మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. అయితే గడువులోగా ప్రభుత్వం ఊహించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో, దరఖాస్తు చేసుకోని వారికి మరో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో గడువును 21 వరకు పొడిగించారు. ఏ ఆదరువు లేని ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రతి నెల రూ.వెయ్యి చొప్పున ఆర్థిక భృతిని అందజేస్తామని గత శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆర్థిక భృతి మొత్తాన్ని (రూ.2 వేలను) రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఈనెల 21లోగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే జూన్ 2న ఆర్థిక భృతిని చెల్లించనున్నారు. గడువు దాటాక వచ్చిన దరఖాస్తులకు జూన్ నెల నుంచి ఆర్థిక భృతిని వర్తింపజేయాలని నిర్ణయించారు. అందిన దరఖాస్తులు 1.20 లక్షలే రాష్ట్రంలో ఒంటరి మహిళల ఆర్థిక భృతికి 2 నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు అందవచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా శనివారం వరకు 1,20,484 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భర్త వదిలేసిన మహిళలు, భర్తకు దూరంగా ఉంటున్న మహిళలు.. ఇప్పటికే వితంతు కేటగిరీలో ఆసరా పింఛన్ పొందుతున్నారని, ఈ కారణంగానే ఒంటరి మహిళల కేటగిరీలో దరఖాస్తుల సంఖ్య బాగా తగ్గిందని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతున్నారు. సెర్ప్ అధికారులకు అందిన మొత్తం దరఖాస్తుల్లో ఒక్క నిజామాబాద్ జిల్లా నుంచే అత్యధికంగా 10,313 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. అలాగే ఆసరా పెన్షనరు ఉన్న కుటుంబంలోని బీడీ కార్మికులకు కూడా ఆర్థిక భృతిని ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం, బీడీ కార్మికుల నుంచి సుమారు 80 వేల నుంచి 1 లక్ష దరఖాస్తులు రావచ్చని అంచనా వేసింది. అయితే చాలా తక్కువగా కేవలం 15,603 దరఖాస్తులు మాత్రమే అందాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా నుంచి 5,227, కామారెడ్డి జిల్లా నుంచి 3,567 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 31 జిల్లాల్లో 15 జిల్లాల నుంచి ఒక్క దరఖాస్తు కూడా అందకపోవడం గమనార్హం. -
సూక్ష్మ పరిశీలన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి కల్పించేందుకు చేపట్టిన గుర్తింపు ప్రక్రియ అత్యంత పకడ్బందీగా సాగుతోంది. ఎటువంటి అక్రమాలకు తావివ్వకుండా.. అత్యంత పారదర్శకంగా అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. దరఖాస్తులు స్వీకరించడం నుంచి ఆర్థిక భృతి అందించేవరకు అన్ని స్థాయిల్లో నిశితంగా పరిశీలన చేపట్టనున్నారు. కలెక్టర్ కూడా నేరుగా సూక్ష్మంగా పరిశీలించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అర్హుల గుర్తింపు కోసం ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన సర్వే.. ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్ఓలను విలేజ్ ఇన్చార్జి ఆఫీసర్లుగా నియమించారు. వీరంతా జిల్లాలోని 415 గ్రామ పంచాయతీల్లో ఇంటింటికీ తిరిగి అర్హులైన ఒంటరి మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి పంచాయతీలో గ్రామసభ నిర్వహించి అర్హతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు అందజేసిన మరుసటి రోజు నుంచే పరిశీలన ప్రారంభమైంది. తొలుత వీఆర్ఓలు పరిశీలిస్తున్నారు. ఆ తర్వాత వీటిని తహసీల్దార్లకు అందజేస్తారు. అక్కడికి చేరుకున్న ప్రతి దరఖాస్తును మరోసారి తహసీల్దార్లు కూడా జల్లెడ పడతారు. పిదప వాటిని ఎంపీడీఓ కార్యాలయాలకు చేర్చి.. ఆసరా వెబ్‌పోర్టల్‌లోకి అప్లోడ్ చేస్తారు. అనంతరం కలెక్టర్ కూడా పరిశీలన జరపనున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇలా.. జీహెచ్ఎంసీ, నగర పంచాయతీలు, మున్సిపాలిటీల్లో నేరుగా దరఖాస్తుల స్వీకరణ విధానం లేదు. మీ–సేవ కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఎటువంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదు. వివరాల నమోదు పూర్తిగా ఉచితం. జీహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్లే జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో వీఆర్ఓలను డివిజనల్ ఇన్చార్జి ఆఫీసర్లు(డీఐఓ)గా నియమించారు. మీసేవ ద్వారా అందిన దరఖాస్తులను డీఐఓలు పరిశీలిస్తారు. నివసించే ప్రాంతానికి వెళ్లి.. వివరాలకు సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకుంటారు. ఆపై స్థాయిలో తహసీల్దార్లు మరోసారి పరిశీలన జరుపుతారు. షాద్‌నగర్ మున్సిపాలిటీ, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, బడంగ్‌పేట నగర పంచాయతీల్లో బిల్ కలెక్టర్లు వార్డు ఇన్చార్జి ఆఫీసర్లుగా కొనసాగుతారు. అధికారుల మెడపై కత్తి.. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి అందజేతను ప్రభుత్వం ప్రతిష్టాతక్మకంగా తీసుకున్న నేపథ్యంలో.. అర్హుల ఎంపికలో ఎటువంటి అవకతవకలకూ తావివ్వకుండా జాగ్రత్త వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. గతంలో అనర్హులకు పింఛన్లు అందిన విషయం తెలిసిందే. ఒంటరి మహిళల విషయంలో.. అటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. పట్టణ ప్రాంతంలో తప్పిదాలు జరిగితే.. అధికారులను బాధ్యులుగా చేయనుంది. పరిశీలించిన ప్రతి దరఖాస్తుపై పరిశీలన జరిపిన అధికారి పేరు తదితర వివరాలు నమోదు చేయనున్నట్లు తెలిసింది. ఈ విధానం వల్ల అనర్హులకు జాబితాలో చోటు ఉండదన్న విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కలెక్టర్ కూడా ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే లోతుగా ఎలా పరిశీలించాలన్న అంశంపై ఆయా శాఖాధికారులకు సలహాలు అందజేశారు. వీటిని తప్పకుండా పాటించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. దరఖాస్తుల వెల్లువ ఆర్థిక భృతి కోసం ఒంటరి మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజు నుంచే ఆ ఒరవడి కనపించింది. శుక్రవారం రాత్రి వరకు 4,317 దరఖాస్తులు అందాయని అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాయని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 1,201 మంది, గ్రామాల నుంచి 3,116 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. గడువు శనివారం వరకు ఉండడంతో వీటి సంఖ్య ఐదు వేలకు చేరుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
తొలిరోజే.. 18,458 దరఖాస్తులు
ఒంటరి మహిళల ఆర్థికభృతి పథకానికి భారీ స్పందన - పట్టణ ప్రాంతాల్లోని మీసేవల్లో సాంకేతిక సమస్యలు - ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన సెర్ప్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఒంటరి మహిళలకు ఆర్థికభృతి’ పథకానికి భారీ స్పందన కనిపిస్తోంది. లబ్ధిదారుల ఎంపికకు సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించగా.. తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా 18,458 మంది మహిళలు ఆర్థికభృతి కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. మొత్తం దరఖాస్తుల్లో పట్టణ ప్రాంతాల నుంచి 2,283 రాగా, గ్రామీ ణ ప్రాంతాల నుంచి 16,175 దరఖాస్తులు అందినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అధికారులు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు, గ్రామసభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, పట్టణ ప్రాంతాల్లో మీసేవా కేంద్రాల నుంచి, వార్డు కార్యాలయాల నుంచి దరఖాస్తు లను స్వీకరిస్తున్నారు. సోమవారం మీసేవా కేంద్రాల ద్వారా 1,088 దరఖాస్తులు అంద గా.. వార్డు కార్యాలయాల నుంచి 1,195 దర ఖాస్తులు అందినట్లు సెర్ప్ అధికారులు పేర్కొ న్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అత్యధికంగా 1,500 నుంచి 2,500 దాకా దరఖాస్తులు అందాయి. జనగాం, కుమ్రంభీం, పెద్దపల్లి, వికారాబాద్ జిల్లాల నుంచి అందిన దరఖాస్తులు 100కు లోపే ఉండడం గమనార్హం. సాంకేతిక సమస్యలతో సతమతం.. పట్టణ ప్రాంతాల్లో మీసేవా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు తొలిరోజు దరఖాస్తుల స్వీకరణకు ఆటంకంగా మారాయి. దోమల గూడ మీసేవా కేంద్రానికి వచ్చిన మహిళల వద్ద ఆధార్ కార్డులు ఉన్నప్పటికీ.. కార్డు నంబర్‌ను కంప్యూటర్లో నమోదు చేశాక వివరాలు డిస్ప్లే కాకపోవడంతో దరఖాస్తు చేసేందుకు వచ్చిన వారు నిరాశగా వెనుదిరి గారు. మరికొన్ని మీసేవా కేంద్రాల్లో సిబ్బందికి ఒంటరి మహిళల దరఖాస్తులను స్వీకరించా లనే విషయం తెలియకపోవడంతో వచ్చిన వారిని వెనక్కి పంపేశారు. ఇంకొన్ని కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తడం, సర్వర్ డౌన్ కావడం.. తదితర ఇబ్బందులు తలెత్తాయి. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించా లని ఐటీ శాఖకు సెర్ప్ అధికారులు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించేం దుకు, పథకానికి సంబంధించిన వివరాలను తెలిపేందుకు సెర్ప్ కార్యాలయంలో కాల్ సెంటర్ (04023241474)ను ఏర్పాటు చేశారు. పనిదినాల్లో ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తుంది. పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన ఒంటరి మహిళలకు ఆర్థికభృతి పథకంపై అవగాహన కల్పించడంతో పాటు, ఇప్పటికే అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పర్యవేక్షించేందుకు 16 ప్రత్యేక బృందాలను సెర్ప్ సీఈవో పౌసమిబసు ఏర్పాటు చేశారు. మంగళవారం నుంచి ఈ నెల 21 వరకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి నివేదికలు సమర్పించాలని ప్రత్యేక బృందాలకు నాయకత్వం వహిస్తున్న డైరెక్టర్లను సీఈవో ఆదేశించారు. -
ఒంటరి మహిళల ఆర్థిక భృతికి దరఖాస్తులు
నేటి నుంచి ప్రారంభం..13 వరకు దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: ‘ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి’ పథకానికి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. సోమవారం నుంచి ఈనెల 13 వరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా షెడ్యూల్‌ను, మార్గదర్శకాలను జారీ చేసింది. లబ్ధిదారుల ఎంపికకు అర్హతలివే.. ► ఒంటరి మహిళల ఎంపికకు 18 ఏళ్లు నిండిన వివాహిత మహిళలు భర్త నుంచి ఏడాదికిపైగా వేరుగా ఉంటున్న వారై ఉండాలి. ► అవివాహితులైతే గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్ల వయస్సు నిండిన వారై ఉండాలి. ► దారిద్య్రరేఖకు దిగువన ఉండి, వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. ► ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సామాజిక భద్రత పథకాలు, పింఛన్ల లబ్ధిదారులై ఉండరాదు. ►దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు తహసీల్దార్, సంబంధిత మున్సిపల్ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. జీహెచ్ఎంసీ పరిధిలోని వారు మీసేవ, ఈ సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను సమర్పించేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తుతోపాటు వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు, ఎన్నికల గుర్తింపు కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, స్కూల్ టీసీలలో ఏదో ఒక జిరాక్స్ ప్రతిని జతపరచాలి. -
ఆన్లైన్లోనే ‘ఆసరా’ అప్లికేషన్
ఒంటరి మహిళలకు ఆర్థిక భృతితోనే అమలుకు శ్రీకారం సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ల మంజూరు ప్రక్రియను ఇకపై ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో దరఖాస్తు మొదలుకొని, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పింఛన్ మంజూరు వరకు అంతా ఆన్లైన్లోనే జరిగేలా సెర్ప్ అధికారులు సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఒంటరి మహిళలకు ప్రతినెలా రూ.1,000 వంతున భృతిని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినందున, వారి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ నుంచే ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు కూడా... తాజాగా యాసిడ్ దాడులు, రేప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులను కూడా ఈ కేటగిరీలోకి తీసుకురావాలని భావిస్తోంది. బాధితులు ఆయా కేసులకు సంబంధించిన ఎఫ్ఐఆర్, చార్జ్‌షీట్ పత్రాలను ఆన్లైన్లోనే దరఖాస్తుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడం వీలుకాని వారు గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శుల, పట్టణ ప్రాంతాల్లోనైతే మున్సిపల్, హైదరాబాద్ జిల్లాలో మండల రెవెన్యూ సిబ్బంది సహకారం తీసుకోవచ్చు. -
‘ఒంటరి మహిళ’కు 35 ఏళ్ల వయో పరిమితి!
ఆసరా పథకం వర్తింపునకు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న సెర్ప్ సాక్షి, హైదరాబాద్: ఆసరా పథకం ద్వారా ఆర్థికభృతిని పొందాలనుకునే ఒంటరి మహి ళలకు కనీస వయో పరిమితిని 35 ఏళ్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఎటువంటి ఆదరువు లేని ఒంటరి మహిళలకు ఆసరా పథకం ద్వారా నెలకు రూ.వెయ్యి చొప్పున సాయం అందించనున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతి ఏప్రిల్ 1నుంచి అమలులోకి రానున్నందున అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) మార్గదర్శ కాలను రూపొంది స్తోంది. వివాహం చేసుకోని మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, విడాకులు తీసుకోకుండా భర్త నుంచి విడిగా ఉంటున్న వారు, దేవునితో పెళ్లైన జోగినులను.. ఒంటరి మహిళలుగా పరిగణించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే.. ఆయా కేటగిరీల మహిళలంతా తల్లిదండ్రులతో గానీ, తోబుట్టువులతో గానీ కలసి ఉంటున్నట్లయితే ఒంటరి మహిళలుగా పరిగణించకూడదని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక భృతిని పొందేం దుకు ఆసరా పథకంలో లబ్ధిదారులకు వర్తించే నియమ నిబంధనలే ఒంటరి మహిళలకు కూడా వర్తించనున్నాయి. భర్తతో విడిపోయిన మహిళలు కనీసం నాలుగేళ్ల పాటు ఒంటరిగా నివసిస్తున్నవారై ఉండాలి. జోగినులకు సంబంధించి రాష్ట్రంలో 14,963 మంది ఉన్నట్లు వి.రఘునాథరావు కమిషన్ ద్వారా సాంఘిక సంక్షేమ శాఖ చేయించిన సర్వేలో వెల్లడైంది. అయితే.. అ సర్వే వివరాలను పరిశీలించి ఎంతమంది జీవించి ఉన్నారో లెక్కలు తేల్చాలని ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను సర్కారు ఆదేశించింది. ఒంటరి మహిళలకు ఆర్థిక భృతికి సంబంధించిన మార్గదర్శకాలపై సెర్ప్ అధికారులు, తుది కసరత్తు కోసం బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌తో సమావేశం కానున్నారు. సెర్ప్ రూపొందించిన మార్గదర్శకాలకు సీఎస్ ఆమోదం తెలిపిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. -
ఒంటరి విహారం
ఒంటరి మహిళ.. ప్రపంచ పర్యటన... అంటే మాటలు కావు. దానికి ఎంతో గుండె ధైర్యం, సంకల్ప బలం ఉండాలి. ఈ రెండూ మెండుగా ఉన్న యువతి అలిస్సా రామోస్. 6 ఖండాల్లోని 44 దేశాలలో ఎవరితోడూ లేకుండా పర్యటించింది. మనదేశంలోనూ నెలరోజులపాటు పర్యటించింది. ప్రపంచదేశాల స్థితిగతులు, ఆచార వ్యవహారాలను దగ్గరుండి చూసింది. తాను ఒంటిరిని అన్న ఆలోచనతో ఏనాడూ కుంగిపోలేదు. ప్రతిరోజూ తన ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించింది. ఆమె యాత్రా విశేషాలు మనమూ తెలుసుకుందాం! అలిస్సా రామోస్ దృఢసంకల్పం కలిగిన నేటితరం యువతి. అదే ఆమెను ప్రపంచం మొత్తం పర్యటించేలా చేసింది. స్నేహితులు గానీ కుటుంబ సభ్యులు గానీ ఎవరూ వెంట రాలేదు. కేవలం గోప్రో కంపెనీ కెమెరాను మాత్రమే తోడుగా తీసుకెళ్లింది. ‘మై లైఫ్ ఎ ట్రావెల్ మూవీ.కామ్’ అనే ప్రముఖ ట్రావెల్ ఏజె న్సీతో కలిసి తన ప్రయాణం సాగించింది. ఈ ప్రయాణంలో 28 ఏళ్ల అలిస్సా రామోస్‌కు సోషల్ మీడియాలో అనూహ్య మద్దతు లభించింది. అలిస్సా ఇన్‌స్టాగ్రామ్‌లో 60 వేల మంది ఫాలోవర్లు అమెకు అండగా నిలవడం విశేషం. ఒంటరి ప్రయాణం..! అలిస్సా ఒంటరిగా ప్రపంచ పర్యటన చేయడం వెనక ఓ కథ ఉంది. తొలుత స్నేహితులంతా కలిసి సరదాగా దక్షిణాఫ్రికాకు వెళ్లొద్దామని అనుకున్నారు. తీరా వెళ్లే సమయానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఆమె ఒక్కతే వెళ్లాలని నిర్ణయించుకుంది. ముందు అనుకున్న ప్రకారమే అలిస్సా దక్షిణాఫ్రికా వెళ్లింది. ఈ పర్యటన విజయవంతం అయింది. దీంతో ప్రపంచాన్ని చుట్టి వస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన ఆమె జీవితాన్ని కీలక మలుపు తిప్పింది. దక్షిణాఫ్రికా అంటే ఎలాగోలా పర్యటించిందిగానీ, ప్రపంచమంటే అంత డబ్బు ఎలా వస్తుంది? అని ఆలోచించింది. ఇందుకోసం తన దక్షిణాఫ్రికా పర్యటనలను రచనలో రూపంలో సోషల్ మీడియా ఆధారంగా పనిచేస్తున్న పలు వెబ్సైట్లకు అందించింది. ఆ విధంగా ఆమెకు వచ్చిన డబ్బునే పర్యటన కోసం వెచ్చించింది. భారత్ ఓ ప్రత్యేక అనుభూతి.. అలిస్సా భారత్ నుంచి ఎన్నో నేర్చుకున్నారు. ఇండియాలో ప్రతి రాష్ట్రం ప్రత్యేకంగా ఉంటుంది. వివిధ భాషలు, ఆచారాలు, మతాలు అన్ని వేటి కవే ప్రత్యేకం. ప్రధానంగా భారతీయ వస్త్రాధారణ ఆమెను అమితంగా ఆకర్షించింది. అదే ఆమెను చీరకట్టుకోవడం నేర్చుకునేలా చేసింది. ఇక్కడి వంటకాలు కూడా ఆమెకు ఎంతగానో నచ్చాయి. పన్నీర్ కూరలు, ఇరానీ టీ, స్వీట్లు అత్యంత ఇష్టమైన వంటకాలుగా మారాయి. ‘భారతీయలు ఎంతో మర్యాద కలిగి ఉంటారు. వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు. ఇండియాలో క్రికెట్, బాలీవుడ్‌లకు ఎక్కువ ఆదరణ ఉందన్నారు. అలిస్సా తన పర్యటనల గురించి ఎప్పటికప్పుడు పలు ఆన్లైన్ వెబ్సైట్లకు కథనాలు రాస్తూనే ఉన్నారు. మహిళ ప్రపంచ ప్రయాణంలో ఎదురైన అనుభవాలు ఎలా ఉంటాయి? అన్న ఆసక్తి తన రచనలకు ఎక్కువ ఆదరణ కలిగేలా చేసిందని అలిస్సా తెలిపారు. సంస్కృతుల నిలయం భారతదేశం అలిస్సాను అమితంగా ఆకర్షించింది. ఇక్కడ పర్యటించడం అంటే ఓ విస్తారమైన సంప్రదాయాలు, సంస్కృతులను తెలుసుకోవడమేనని అలిస్సా అభిప్రాయపడ్డారు. ఆసియా పర్యటనల్లో భారత్ పర్యటన ఓ అద్భుతమైన అనుభవాన్ని కలిగించింది అని అలిస్సా అన్నారు. నెల రోజుల పర్యటనలో భాగంగా న్యూఢిల్లీ, ఆగ్రా, జైపూర్, జోధ్‌పూర్, ఉదయ్‌పూర్, ముంబై, గోవాలలో పర్యటించారు. భారత్‌లో ఉన్న ప్రజలు అలిస్సాను ఎంతో గౌరవించారని, ఇక్కడ పర్యటన ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. రాజస్థాన్‌లో పర్యటించడం ఎక్కువ ఆనందాన్ని ఇచ్చిందన్నారు. జైపూర్‌లో తొలిసారిగా పర్యటించినప్పుడు అక్కడి రాజభవనాన్ని చూసి ఆశ్చర్యపోయారని తెలిపారు. తాను అక్కడ కొన్న గాజులు, ఏనుగుపై ప్రయాణం చాలా ఆనందాన్ని ఇచ్చాయన్నారు. జోధ్‌పూర్ అత్యంత ప్రియమైన నగరం అని తెలిపారు. జోధ్‌పూర్ ప్యాలెస్‌లో బస చేసినప్పుడు నిజమైన తనకు తాను రాణిగానే భావించానంది. -
పిజ్జాతో ఆమె నిశ్చితార్థం!
యవ్వనం తోడు కోరుకుంటుంది. యుక్త వయస్సుకు రాగానే సహజంగానే చాలామంది ప్రేమలో పడుతుంటారు. అదేవిధంగా 19 ఏళ్ల నికోల్ లార్సన్ కూడా ప్రేమలో పడింది. అయితే యువకుడితో కాదు పిజ్జాతో.. అవును వినడానికి ఇది విచిత్రంగానే ఉన్నా.. కెనడాలోని అల్బెర్ట్‌కు చెందిన ఈ అమ్మాయి 'పిజ్జా హట్'తో నిశ్చితార్థం చేసుకుంది. అంతేకాకుండా '2015 దంపతుల ఫొటోలు' పేరిట పిజ్జాతో వివిధ ఫోజుల్లో దిగిన ఫొటోలను ఫేస్బుక్లో పెట్టింది. పిజ్జాపై తన ప్రేమను చాటుతూ మొత్తం 16 ఫొటోలను పెట్టింది. ఇది ఫేస్బుక్లో హల్చల్ సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ పోస్టుకు 12వేల లైకులు, 30వేల షేర్లు వచ్చాయి. యవ్వనంలోకి వచ్చాక కూడా ఒంటరిగా ఉండటమే లార్సన్‌కు ఇష్టమట. అందుకే తనకు ఇష్టమైన పిజ్జాతో ప్రేమగా ఫొటోలు తీసుకుంది. 'ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిని వెతుక్కునే తొందరలో ఉన్నారు. అంతకన్నా మన రోజును మెరుగుపరిచే వాటిపై దృష్టిపెట్టడం మేలు అని నేను సూచిస్తాను' అని ఆమె చెప్తున్నది.