
చెన్నై, తిరువొత్తియూరు: కోవై సమీపంలో ప్రియురాలితో కాపురం చేస్తున్న భర్తను భార్య హతమార్చింది. అనంతరం అరెస్ట్ భయంతో ఆత్మహత్యాయత్నం చేసింది. కోవై సుందరాపురం బాలమురుగన్ ఆల యం వీధికి చెందిన బాబురాజ్ (37) కార్పెంటర్. ఇతని భార్య భాగ్యం (34). వీరికి ముగ్గురు కుమార్తెలు. బాబురాజ్‌కు గునియముత్తూరు బి.కె.పుదూర్‌కు చెందిన ఒక మహిళతో వివాహేతర సంబం ధం ఏర్పడింది. కొన్ని నెలలుగా ఇతను భార్య పిల్లలను వదలి ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు.
భాగ్యం కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తోంది. శనివారం ఇంటికి వచ్చిన బాబు రాజ్‌తో భాగ్యం గొడవ పడింది. రాత్రి దంపతుల మధ్య మళ్లీ గొడవ ఏర్పడింది. ఆగ్రహించిన బాబురాజ్ అక్కడున్న బీర్ బాటిల్‌తో భార్యను పొడవడానికి ప్రయత్నించాడు. తప్పించుకున్న భాగ్యం కర్రతో భర్త తలపై దాడి చేయడంతో మృతి చెందాడు. అనంతరం పోలీసులకు భయపడి భాగ్యం చేతిని కత్తితో కోసుకుని, దోమల మందు తాగి స్పృహ తప్పింది. ఉదయం నిద్ర లేచిన పిల్లలు తండ్రి మృతి చెంది ఉండడం, తల్లి స్పృహతప్పి పడి ఉండడంతో కేకలు వేశారు. ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని భాగ్యం ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment