
కాకినాడ రూరల్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే భార్య చంపిన సంఘటన శనివారం కాకినాడలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట ఐశ్వర్యా కాలనీలో నివాసముంటున్న ట్యాక్సీ డ్రైవర్ రాయుడు హరిప్రసాద్, భార్య హిమచందుకు ముగ్గురు ఆడ పిల్లలు. హిమచందు తండ్రి రెండో భార్య కొడుకు (సొంత తమ్ముడు) భానుప్రసాద్‌తో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుం ది. ఈ విషయం హరిప్రసాద్‌కు తెలిసి అనేక సార్లు భార్యను హెచ్చరించాడు. అయినా ఆమెలో మార్పూలేదు. దీంతో భా ర్యా భర్తలు నిత్యం గొడవలు పడుతుండేవారు.
ఈ నేపథ్యంలో హరిప్రసాద్‌ను అడ్డు తొలగించుకోవాలని హిమచందు, భానుప్రసాద్ భావించారు. హత్య చేసేందుకు పథకం రూపొందించారు. శుక్రవారం రాత్రి హరిప్రసాద్ తాగి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో ఉండడంతో హరిప్రసాద్‌ను కొట్టి, ముఖంపై తలగడ పెట్టి నొక్కి చంపేశారు. భానుప్రసాద్ తన స్నేహితులతో కలిసి చనిపోయిన హరిప్రసాద్‌ను మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి రమణయ్యపేట కాలువ పక్కన ఉన్న డంపింగ్ యార్డులో టైర్లు, చెత్త వేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఉదయం హరిప్రసాద్ కోసం తండ్రి ఇంటికి వెళ్లగా హిమచందు బయటకు వెళ్లారని చెప్పింది.
ఎంతకూ కన్పించకపోవడంతో హరిప్రసాద్ తమ్ముడు రాయుడు శ్రీను శనివారం ఉదయం సర్పవరం పో లీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈలోగా సగం కాలి ఉన్న మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సగం కాలిన మృతదేహం రాయుడు హరిప్రసాద్‌దేనని గుర్తించారు.
ఈ నేపథ్యంలో హరిప్రసాద్ భార్య హిమచందును, భానుప్రసాద్‌ను అతని తల్లిని, హత్యతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ రవివర్మ వివరించారు. సర్పవరం పోలీసులు కేసు నమోదు చేయగా త్రీటౌన్ సీఐ దుర్గారావును దర్యాప్తునకు ఆదేశించినట్లు డీఎస్పీ రవివర్మ తెలిపారు. హరిప్రసాద్‌ను తగులబెట్టిన స్థలాన్ని డీఎస్పీ రవివర్మతో పాటు సర్పవరం సీఐ చైతన్యకృష్ణ, ఎస్సై స్వామినాయుడు పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment