
రక్తపు మడుగులో సత్తయ్య
మంచిర్యాలక్రైం: మంచిర్యాల పట్టణంలోని మారుతినగర్‌లో నివాసముంటున్న మంద సత్తయ్య (52)పై భార్య విజయలక్ష్మి మంగళవారం రాత్రి రోకలి బండతో తలపై మోది హత్య చేసేందుకు యత్నించింది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ మహేశ్ ఘటనా స్థలానికి చేరుకొని సత్తయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలకు తీవ్రగాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సత్తయ్య పరిస్థితి విషమంగా ఉంది. తన భర్త గత కొంత కాలంగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, తరుచూ మద్యం సేవించి వేధింపులకు గురి చేస్తున్నాడని విజయలక్ష్మి ఆరోపించింది. మంగళవారం రాత్రి సైతం వేధింపులకు గురి చేయడంతో భరించలేక హత్యాయత్నం చేసినట్లు తెలిపింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment