వివాహేతర సంబంధాలు పెట్టుకొని ప్రియులతో కలిసి భర్తలను హతమారుస్తున్న సంఘటనలు నానాటికి పెరుగుతున్నాయి. మొన్న స్వాతి, నిన్న జ్యోతి సంఘటనలు సంచలనంగా మారగా తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర(27), శ్రీవిద్య అనే ఇద్దరు భార్యభర్తలు. శ్రీవిద్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.