ప్రేమగా మద్యం పోసి అందులో ప్రియుడి సాయంతో సైనెడ్ కలిపి భర్తను చంపిన శ్రీవిద్య అరెస్టయింది. భర్తను హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పరారీ అయిన ఆమెను ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. గుంటూరు జిల్లాకు చెందిన శ్రీవిద్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాదెండ్ల మండలం పునుగుపాడు గ్రామానికి చెందిన నల్లబోతు నరేంద్ర(27), శ్రీవిద్య అనే ఇద్దరు భార్యభర్తలు. శ్రీవిద్య గత కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. తన అక్రమ సంబంధానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి తన ప్రియుడితో కలిసి కుట్ర చేసింది.