Husbend Murder
-
హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం!
సాక్షి, నల్గొండ: రియాల్టర్, బిల్డర్ సోమ కేశవులును అర్ధరాత్రి హత్య చేసిన ఘటనలో మొత్తం నలుగురి పాత్ర ఉన్నట్లు జిల్లా పోలీసులు గుర్తించారు. కేశవులు హత్య లో అతని భార్య స్వాతి ప్రమేయం ఉందని, అతన్ని హతమార్చేందుకు రెండు నెలలుగా పలువురిని సంప్రదించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తన ప్రియుడు ప్రదీప్‌తో కలిసి భర్త హత్య కు స్వాతి స్కెచ్ వేసింది. ఎస్పీ ఎలక్ట్రానిక్స్ పేరుతో సీసీ కెమెరాల షాప్ నిర్వహిస్తున్న ప్రదీప్, స్థానికులైన శివ, శ్రీను సహయం తీసుకున్నాడు. హత్య తర్వాత నిందితులకు ఎంజాయ్ చేయడానికి స్వాతి లక్ష రూపాయలు ఇచ్చింది. కాగా, పలువురితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను తీరు మార్చుకోవాలని కేశవులు పలుమార్లు హెచ్చరించాడు. -
భర్తను ముక్కలు ముక్కలుగా చేసి..
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లాలో ఓ వ్యక్తి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో కట్టుకున్న భార్యే నిందితురాలిగా తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 45 రోజుల క్రితం జిల్లాలోని కల్వకుర్తి పట్టణం హనుమాన్ నగర్ కాలనీకి చెందిన తన భర్త కావలి మల్లయ్య కనిపించడం లేదంటూ పార్వతమ్మ అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. భార్య పార్వతమ్యే తన భర్తను చంపినట్టు బయటపడింది. పార్వతమ్మకి రాములు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తన సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన ఇరువురు.. మల్లయ్యను హతమార్చాలనుకున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌లతో కలిసి భర్తను హత్యచేసింది. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బస్తాలో కట్టేసే జిల్లాలోని నాగనూల్ చెరువులో పడేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ పార్వతమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో తమదైన శైలిలో దర్యాప్తు చేసిన పోలీసులు పార్వతమ్మే హత్య చేసినట్టు నిర్ధారించారు. దీంతో పార్వతమ్మ, ప్రియుడు రాములు, కొడుకు శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
భర్తను చంపిన శ్రీవిద్య అరెస్టు
-
ఘరానా భార్య అరెస్టు
బనశంకరి : తాళి కట్టిన భర్తను హత్య చేయించి పరారీలో ఉన్న భార్యతో పాటు మరో వ్యక్తిని ఆదివారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది మైసూరు నగరంలో ఓ పాఠశాల వ్యవస్థాపకుడు కృష్ణ (40)ను అతని భార్య రాధ గత ఏడాది తనకు సన్నిహితులైన మంజునాథ్, మరో వ్యక్తితో కలిసి హత్య చేయించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు పరారీలో ఉన్న రాధా, మంజునాథ్‌లను అరెస్ట్ చేశారు. -
నా భర్తను హత్యచేశారు
నందలూరు : ఆడపూరు పంచాయతీ పరిధిలోని మర్రిపల్లె దళితవాడ సమీపంలో ఈనెల 18వ తేదీన కుప్పాల వేణుగోపాల్ అనే వ్యక్తి మృతి చెందిన సంఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతుని భార్య వరలక్ష్మి, కుమారులు సాయి, మణిశేఖర్లు పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని వారు ఆరోపించారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వారు విలేకరులతో మాట్లాడుతూ వ్యాపారాల నిమిత్తం తన భర్త ఒంటిమిట్టలోని బ్రాంది షాపులో రూ.8లక్షలు, నందలూరు మండలం మర్రిపల్లెలోని పూలతోటపై రూ.3లక్షలు పెట్టుబడి పెట్టాడని తెలిపారు. తన కుమారుడి ఉద్యోగం కోసం డబ్బులు కావాలని, తాను పెట్టుబడిన పెట్టిన డబ్బులు మొత్తం రూ.11 లక్షలు ఇవ్వాలని పూలతోట యజమానిని అడుగుతూ వచ్చాడన్నారు. దీంతో తోటయజమాని ప్రసాద్ నేడు, రేపు ఇస్తానంటూ తిప్పుకుని చివరకు హత్యచేశాడని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. హత్య జరిగే ముందురోజు మధ్యాహ్నం కూడా తన భర్తతో తాను ఫోన్లో మాట్లాడానని, ఇంకా భోజనం చేయలేదని, తోట యజమాని ప్రసాద్ తనకు భోజనం తీసుకువస్తాడని చెప్పాడన్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఫోన్ స్విచ్ఆఫ్ అని వచ్చిందని తెలిపారు. తన భర్త మరణించిన విషయం తోట పక్కన ఉన్న మరో వ్యక్తి తమకు తెలిపాడన్నారు. మా ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడుకాదని ఆయన చేతులు, కాళ్లపై గాయాలు కూడా ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ హత్యలో రాజంపేట మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్, తోట కాపలాదారుడు పెంచలయ్యల హస్తం కూడా ఉందన్నారు. ఈ ముగ్గురిని విచారించి నిజానిజాలు వెలికితీసి తమకు న్యాయం చేయాలని స్థానిక ఎస్ఐ ప్రతాప్‌రెడ్డిని కోరారు. ఈ సంఘటనపై ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. -
భర్తను హత్య చేసిన భార్య
అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి ఘాతుకం నూజెండ్ల: అక్రమ సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చిన సంఘటన మండల కేంద్రమైన నూజెండ్ల సమీపంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వినుకొండ రూరల్ సీఐ టి.వి. శ్రీనివాసరావు, ఐనవోలు ఎస్సై విజయ చరణ్ తెలిపిన వివరాల ప్రకారం... నకిరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన పొట్లూరి అమరలింగయ్యకు, పిన్నెల్లిగ్రామానికి చెందిన కృష్ణవేణితో 16 ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి 7వ తరగతి చదువుతున్న నాగలక్ష్మి, ఆరోతరగతి చదువుతున్న ప్రియాంక అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రాజుపాలెం గ్రామానికి చెందిన చిన్న అంకయ్యతో రెండేళ్లుగా అక్రమసంబంధం సాగించిన కృష్ణవేణి భర్తకు దూరంగా ఉంది. ఇటీవల కుటుంబ పెద్దలు మందలించి భర్తతో ఉండాలని రాజీ చేసి ఒకటి చేశారు. ఈ నేప«థ్యంలో నాలుగు నెలల క్రితం స్వగ్రామం వదిలి బతుకు దెరువుకోసం నూజెండ్ల వచ్చారు. నూజెండ్ల శివారులో కోళ్లఫారంలో అమరలింగయ్య వాచ్‌మన్‌గా పనికి కుదిరాడు. అయితే ఇటీవల కాలంలో భార్య ప్రవర్తనలో మార్పురాకపోవటం, మరోవ్యక్తితో సంబంధం పెట్టుకోవడంతో తరచూ ఘర్షణ పడుతున్నారు. ఈ నేప«థ్యంలో శనివారం రాత్రి అమరలింగయ్య హత్యకు గురయ్యాడు. హత్య అనంతరం పక్కనే ఉన్న మరో కుటుంబానికి తన భర్తను ఎవరో చంపారని కృష్ణవేణి తెలిపింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఐనవోలు పోలీసులు సంఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించారు. డాగ్, క్లూస్ టీమ్‌లు కూడా రప్పించి నిజాన్ని రాబట్టారు. మృతునిభార్య కృష్ణవేణి చేతులకు రక్తపు మరకలు ఉండటంతో అనుమానించిన పోలీసులు ఆమెను విచారించారు. కృష్ణవేణి, ఆమె ప్రియుడు చిన్న అంకయ్య కలసి హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అక్రమసంబధాలకు అడ్డుగా ఉన్న భర్తను అర్ధరాత్రి సమయంలో ప్రియుడితో కలసి కత్తితో మెడపై, పొట్టలో పొడిచి చంపినట్లు తేలింది. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చినఅంకయ్య, కృష్ణవేణిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుడి అన్న ఆంజనేయులు ఫిర్యాదుతో కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ హత్యలో మూడోవ్యక్తి ప్రమేయం కూడా ఉండిఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తండ్రి హత్యకు గురికావడం, తల్లి జైలుకు వెళ్లడంతో కుమార్తెలు అనాథలుగా మిగిలారు.