వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రోహిణీ కటౌచ్ నిందితులు శబానా,సమీర్
కర్ణాటక, కోలారు: నగరంలో గత ఏడాది డిసెంబర్‌లో చోటు చేసుకున్న యూపీవాసి అనుమానాస్ప మృతి కేసును పోలీసులు ఛేదించారు. మృతుడి భార్య, ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిణి కటౌచ్ బుధవాం వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గురైన శభానా, ఆమె పిన్నమ్మకుమారుడైన సమీర్‌లు పరస్పరం ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేము అంగీకరించని పోషకులు శభానాను ఉత్తర ప్రదేశ్ శ్యామిలి జిల్లా కైరాణా గ్రామానికి చెందిన సాజిద్ (30)కు ఇచ్చి వివాహం చేశారు. వివాహం అనంతరం దంపతులు హాసన్‌లో సంవత్సర కాలం క్షురక వృత్తిలో ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం కోలారుకు వలస వచ్చారు. అయితే శభానా తన ప్రియుడుతో అక్రమ సంభంధం కొనసాగించింది.
సాజిద్ పలు మార్లు హెచ్చరించినా ఫలితం కనిపించలేదు. దీంతో తరుచుగా దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో గత ఏడాది డిసెంబర్ 28న సాజిద్ షనాషా నగర్‌లో విగతజీవిగా కనిపించాడు. తన భర్తను ఉదయం ఎవరో తీసుకెళ్లారని, ఇంతలోనే విగతజీవుడై కనిపించాడని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు శబానాను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా ప్రియుడితో కలిసి ఇంట్లోనే గొంతునులిమి హత్య చేసి, తర్వాత మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసినట్లు అంగీకరించింది. కేసును ఛేదించడంలో ఎస్‌ఐ అణ్ణయ్య, సిబ్బంది హమీద్‌ఖాన్, రాఘవేంద్రలు చాకచక్యంగా వ్యవహరించారని ఎస్పీ ప్రశసించారు.
Comments
Please login to add a commentAdd a comment