భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో ఇటీవల వెలుగుచూసిన ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన బోర్‌వెల్ డ్రిల్లర్ సల్ల సైదులు హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. సఖ్యతకు అడ్డొస్తున్నాడన్న కారణంతో హతుడి ఇల్లాలు, ఆమె ప్రియుడు, మరో పాత్రధారుడితో కలసి ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సోమవారం డీసీపీ రాజేష్ చంద్ర భువనగిరిలో మీడియా ఎదుట ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు(ఎం) మండలం లింగరాజుపల్లి గ్రామానికి చెందిన సల్ల సైదులుకు శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన ధనలక్ష్మితో 12 ఏళ్ల క్రితం వివాహమైంది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నాయి.సైదులు బోర్‌వెల్‌పై డ్రిల్లర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఏడాది క్రితం గ్రామానికి వచ్చి కట్టెకోత పనికి వెళ్తున్నాడు.
మూడేళ్లుగా వివాహేతర సంబంధం
సైదులు బోర్‌వెల్ డ్రిల్లర్‌గా పనిచేస్తున్న క్రమంలో నెలల తరబడి విధి నిర్వహణలో ఉంటూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తుండేవాడు. దీంతో ధనమ్మ తరచూ గురజాలలోని పుట్టింటి వద్దే ఎక్కువగా ఉంటుండేది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎడ్ల నవీన్‌తో మూడేళ్ల క్రితం ధనలక్షి్మకి ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ధనలక్ష్మి తరచూ పుట్టింటికి వెళ్తుండడంతో సైదులు అనుమానించాడు. దీంతో దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడి కుటుంబంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. విషయం పెద్దమనుషుల వద్దకు చేరడంతో సర్దిచెప్పగా ప్రస్తుతం సజావుగానే కాపురం సాగుతోంది.
బోనాల పండుగకు రప్పించి..
ధనలక్షి్మని పుట్టింటికి వెళ్లనీయకుండా తమ సఖ్యతకు సైదులు అడ్డొస్తున్నాడని ఎడ్ల నవీన్ కక్ష పెంచుకున్నాడు. అతడిని ఎలాగైనా అంతమొందించాలని ప్రియురాలు ధనలక్షి్మతో కలసి పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే సైదులు, ధనలక్ష్మి, పిల్ల లను తీసుకుని ఈ నెల 10వ తేదీన గురజాలలోని పుట్టింటికి వచ్చారు. అనుకున్న పథకం ప్రకారం సైదులు హత్య చేసేందుకు నవీన్ తన సమీప బంధువు స్వామి సహాయం కోరాడు. అందుకు అతడు ఒప్పుకోవడంతో ఈ నెల 11వ తేదీన ఇద్దరూ కలసి ధనలక్ష్మి పుట్టింటికి వచ్చారు.
అనంతరం మద్యం తాగేందుకు సైదులును వెంటబెట్టుకుని ఆటోలో అమ్మనబోలుకు వెళ్లారు. అక్కడ నవీన్, స్వామి, సైదులు మద్యం తాగారు. పూటుగా మద్యం తాగిన సైదులు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం నవీన్, స్వామి ఇద్దరూ కలసి ఆటో స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడుతో సైదులు మెడకు ఉరి బిగించారు. అనంతరం సైదులు ఆటోలో వేసుకుని మోత్కూరు మండలం పొడిచేడులోని మూసీ నది బ్రిడ్జి వద్ద మట్టిరోడ్డులోకి వెళ్లి చనిపోయాడో లేదోనని మరో సారి తాడుతో ఉరి బిగించి ఘాతుకానికి ఒడిగట్టారు. ఆపై మృతదేహాన్ని పొడిచేడు లోని మూసీ నది ఒడ్డున గంగదేవమ్మ ఆలయం సమీపంలో పడవేసి వెళ్లిపోయారు.
నిందితుడిని గుర్తించిన డాగ్‌స్కా్వడ్
మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలోని మూసీ నది ఒడ్డున వ్యక్తి మృతదేహాన్ని గుర్తించి న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. సైదులు మెడకు రెండు చోట్ల తాడుతో ఉరిబిగించినట్లు ఆనవాళ్లు ఉండడంతో హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అప్పటికే విష యం తెలుసుకుని ఘటనా స్థలానికి వచ్చిన హ తుడి తల్లి గురజాలకు చెందిన నవీన్‌పై అనుమానం వ్యక్తం చేసింది. ఘటనా స్థలంలో ఆటో గుర్తులను గుర్తించిన పోలీసులు పోలీస్ డాగ్‌స్వా్కడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు.
అయితే, అప్పటికే నవీన్ తన ఆటోలో ధనలక్ష్మి తల్లితో పాటు ఇతర కుటుంబ సభ్యులను ఆటోలో ఘటనా స్థలానికి తీసుకువచ్చాడు. దీంతో పోలీస్ జాగిలం సైదులు మృతదేహాన్ని తీసుకువచ్చిన ఆటో చుట్టూ తిరగడంతో పాటు నవీన్‌ను గుర్తించింది. అనుమానంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. మిగతా ఇద్దరు నిందితులు హైదరాబా ద్‌కు పారిపోతుండగా అనాజిపురం వద్ద పట్టుకున్నట్లు డీసీపీ వివరించారు. వారి వద్ద హత్యకు ఉపయోగించిన తాడు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు ఛేదనలో పోలీస్ డాగ్‌స్కా్వడ్ కీలకంగా వ్యవహరించిందని డీసీపీ చెప్పారు. సమావేశంలో అడిషినల్ డీసీపీ రవికుమార్, ఏసీపీ మొగులయ్య, రామన్నపేట సీఐ మోతీరాం, మోత్కూర్ ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment