
ఉరవకొండరూరల్: లత్తవరం గ్రామానికి చెందిన మాణిక్యబాయి (40) తన భర్త చేతిలో దారుణహత్యకు గురైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. మాణిక్యబాయి, లక్ష్మానాయక్ దంపతులు. వీరు శుక్రవారం రాత్రి ఇంట్లో గొడవపడ్డారు. శనివారం ఉదయం పొలానికి వెళ్లినపుడు కూడా ఇద్దరూ వాదులాడుకున్నారు. ఆవేశానికి లోనైన భర్త బండరాయి తీసుకుని భార్య తలపై మోదాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జనార్దన్‌నాయుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment