
రాంచీ : భార్య, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం, తరుచు భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు.. జంషెడ్‌పూర్‌లో నివసిస్తున్న తపన్ దాస్, శ్వేతాదాస్‌కు ఏనిమిదేళ్ల అమ్మాయి ఉంది. తపన్ దాస్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడప పడేవాడని దీంతో విసుగు చెందిన భార్య.. మూడు నెలల క్రితం పరిచయమైన ఫేస్ బుక్ ప్రియుడు, అతని స్నేహితుడు ముగ్గురు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వివరించారు.
జనవరి 12 రాత్రి మద్యం తాగి వచ్చిన తపన్‌దాస్‌కు అతని భార్యకు గొడవ జరిగింది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన సుమిత్ సింగ్‌కు ఫోన్ చేయగా.. అతని స్నేహితుడైన సోను లాల్‌ను వెంటపెట్టుకుని వచ్చాడు. ముగ్గురు కలిసి తపన్ దాస్‌ను హత్య చేశారు. అనంతరం అతని శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి.. ఊరి చివరన పడేశారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా శ్వేతాదాస్.. తన భర్త తాగొచ్చి 1.5లక్షలు తీసుకెళ్లాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని జనవరి 12న పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు శ్వేతాదాస్ ఫోన్ రికార్డులు, ఇంటిముందు సీసీటీవీలు పరిశీలించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తుండగా.. ముగ్గురు నిందితులు హత్య చేసినట్టు ఒప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment