Ranchi Police
-
పనిమనిషిని చిత్రహింసలు పెట్టిన బీజేపీ నేత అరెస్టు
రాంచీ: బీజేపీ నుంచి సస్పెండ్ అయిన జార్ఖండ్ మహిళా నాయకురాలు సీమ పాత్రను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గరిజన తెగకు చెందిన పనిమనిషిని చిత్రహింసలు పెట్టిందనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలిస్తామని అధికారులు చెప్పారు. సీమపాత్ర ఇంట్లో పనిచేసే గిరిజన మహిళ సునీత ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసింది. రోజూ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పింది. తనతో టాయిలెట్‌ను నాకించడమే గాక.. వేడి వేడి వస్తువులతో వాతలుపెడుతూ సీమ పాత్ర వికృత చర్యలకు పాల్పడుతున్నారని సునీత వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీమ పాత్ర కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆమె పరారైంది. చివరకు పోలీసులు ఆమెను బుధవారం ఉదయం అరెస్టు చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ సీమపాత్ర రోడ్డుపైనుంచి వెళ్తున్న సమయంలో చాకచక్యంగా పట్టుకున్నారు. సునీత ఆరోపణల అనంతరం జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై స్పందించింది. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని జార్ఖండ్ డీజీపీకి లేఖ రాసింది. విచారణ పారదర్శకంగా చేపట్టాలని సూచించింది. మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్ర సతీమణి అయి ఉండి సీమ పాత్ర ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చదవండి: సీఎం స్టాలిన్ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు.. -
భార్య, ప్రియుడు కలిసి..
రాంచీ : భార్య, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం, తరుచు భార్యాభర్తల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. వివరాలు.. జంషెడ్‌పూర్‌లో నివసిస్తున్న తపన్ దాస్, శ్వేతాదాస్‌కు ఏనిమిదేళ్ల అమ్మాయి ఉంది. తపన్ దాస్ రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడప పడేవాడని దీంతో విసుగు చెందిన భార్య.. మూడు నెలల క్రితం పరిచయమైన ఫేస్ బుక్ ప్రియుడు, అతని స్నేహితుడు ముగ్గురు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వివరించారు. జనవరి 12 రాత్రి మద్యం తాగి వచ్చిన తపన్‌దాస్‌కు అతని భార్యకు గొడవ జరిగింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన సుమిత్ సింగ్‌కు ఫోన్ చేయగా.. అతని స్నేహితుడైన సోను లాల్‌ను వెంటపెట్టుకుని వచ్చాడు. ముగ్గురు కలిసి తపన్ దాస్‌ను హత్య చేశారు. అనంతరం అతని శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి.. ఊరి చివరన పడేశారు. అయితే పోలీసులకు అనుమానం రాకుండా శ్వేతాదాస్.. తన భర్త తాగొచ్చి 1.5లక్షలు తీసుకెళ్లాడని, అప్పటి నుంచి కనిపించడం లేదని జనవరి 12న పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే అనుమానం వచ్చిన పోలీసులు శ్వేతాదాస్ ఫోన్ రికార్డులు, ఇంటిముందు సీసీటీవీలు పరిశీలించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. అరెస్ట్ చేసి ఇంటరాగేషన్ చేస్తుండగా.. ముగ్గురు నిందితులు హత్య చేసినట్టు ఒప్పుకున్నారు. -
మావోల డబ్బు తరలిస్తున్న టీఆర్ఎస్ నేత.. అరెస్టు..!
సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి టీఆర్ఎస్ నేతను రాంచీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత మూల సత్యనారాయణ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల నుంచి డబ్బులు తీసుకువస్తుండగా పోలీసులకు చిక్కిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగష్టు 31న మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు మూల దేవేందర్ రెడ్డి నుండి డబ్బులు తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు రాంచీ పోలీసులు పేర్కొన్నారు. సత్యనారాయణతో పాటు నిర్మల్‌కు చెందిన మరో మావోయిస్టు సానూభూతిపరుడు ఉన్నట్టు సమాచారం. దేవేందర్ రెడ్డి మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పట్టుబడిన సత్యనారాయణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ (టీఆర్ఎస్) మూల రాజిరెడ్డి సోదరుడు. సత్యనారాయణపై కేసు నమోదు చేసిన రాంచీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. -
చికెన్‌ఫ్రై చేయడం వస్తే ప్రభుత్వోద్యోగం వచ్చినట్లే
రాంచీ: జార్ఖండ్ పోలీస్ శాఖలో వంట మాస్టర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. దీంతో ఎవరు చికెన్‌ఫ్రై బాగా చేస్తారో, రోటీలు ఎంత వేగంగా ఎవరైతే తయారు చేస్తారో వారికే ఉద్యోగం దక్కుతుందని పోలీసులు తెలిపారు. మొత్తం 4000 మంది అభ్యర్ధులు 78 ఉద్యోగాలకు పోటీ పడుతున్నారు. ఈ రిక్రూట్మెంట్కు రాంచీలోని పేరున్న పెద్ద పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల చెఫ్‌లు కూడా దరఖాస్తు చేసుకుని పోటీపడుతున్నారు. ఉద్యోగానికి ఎంపికయినవారికి నెలకు రూ.15000 నుంచి 18000 వరకు జీతంగా నిర్ణయించారు. ‘‘రాంచీలోనే పేరుపొందిన క్రిష్ణా రెస్టారెంట్లో పనిచేస్తాను. శాకాహార వంటకాలు వండుతాను’’ అని గుప్తా తెలిపారు. ఒకవేళ ఉద్యోగానికి ఎంపికైతే మంచి జీతం ఇస్తారని గుప్తా చెప్పారు. ‘‘నేను అదృష్టాన్ని పరిశీలించుకోవడానికి వచ్చాను. నేను చికెన్‌కర్రీ , రోటీ, వాటితో పాటు సలాడ్, శాకాహార కూరలు చేయగలను'' అని నగరంలోని క్యాపిటల్ గ్రూప్‌లో పనిచేస్తున్న మనీష్ తెలిపారు. అభ్యర్ధులు ఎక్కువగా వంట చేయడం వృత్తిగా ఉన్నారని పోలీస్ రిక్రూట్మెంట్ ఇన్ఛార్జ్ , డీఎస్పీ ఆర్.కె.చౌధరి తెలిపారు. కానీ ఎక్కువ మంది అభ్యర్ధులు రోడ్డు పక్కన చిన్న చిన్న హోటళ్లు నడుపుకునేవారని ఆయన అన్నారు. ‘‘చాలామంది పోటీపడుతున్నారు. కానీ అదృష్టం ఉండాలి. ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోతే తిరిగి మా గ్రామానికి వెళ్లి చైనీస్ ఫుడ్ అమ్ముకుంటాను’’ అని జంషెడ్పూర్ నివాసి శైలేష్‌కుమార్ అంటున్నారు. రాంచీకి 450 కిలోమీటర్ల దూరంలో ఉండే రానూపూర్ నుంచి వచ్చిన స్వర్గిని మరాండి మాట్లాడుతూ ‘‘స్లోకుక్డ్ పేరుతో వంట కాలు చేశాను. ప్రయాణపు ఖర్చులు, వసతి, సరుకులు మెత్తానికి రూ.2500 ఖర్చు చేశాను. అయినా ఫైనల్‌కు వచ్చినందుకు సంతోషంగానే ఉంది'' అని అన్నారు. జార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది అభ్యర్ధులు వచ్చారు. వారి వంటల రుచి చూసి ఆశ్చర్యపోయామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎంపికయిన వారు నక్సలైట్ల ప్రాబల్యం అధికంగా ఉండే పోలీస్ పికెట్స్, క్యాంపులు, జార్ఖండ్ ఆర్మ్డ్ ఫోర్స్, జార్ఖండ్ జాగ్వర్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జార్ఖండ్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్‌ల్లో పనిచేయాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇలా వంటవాళ్లను నోటిఫికేషన్ ద్వారా ఎన్నుకోవటం మొదటిసారని జార్ఖండ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధ్యక్షుడు హరి నారాయణ రామ్ మహలి పేర్కొన్నారు. వంటలు మంచిగా, రుచిగా, ఆరోగ్యకరంగా ఉండటమే ఒక కొలమానంగా పోటీలు నిర్వహిస్తున్నామని ఆయనన్నారు. జనవరి 29 నుంచి ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నాం. వచ్చే గురువారం తుది ఫలితాలు వెలువరిస్తామని చెప్పారు. -
భారత కెప్టెన్ ధోనికి భద్రత తగ్గింపు!
రాంచీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి భద్రతను కుదిస్తూ జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వీఐపీలకు ఏర్పాటు చేస్తున్న భద్రతపై ఇటీవల నిర్వహించిన సమీక్షలో ధోనికి భద్రత తగ్గించామని పోలీసు అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. భారత కెప్టెన్ కు ఎలాంటి ముప్పులేదని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని రాజీవ్ తెలిపారు. ఇప్పటి వరకు తొమ్మిది మందితో కూడిన జెడ్ కేటగిరి భద్రత ఉండేది. తాజా నిర్ణయంతో ధోని భద్రత 'వై' కేటగిరికి మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. వై కేటగిరిలో ఏడుగురు పోలీసు సిబ్బంది భద్రతగా ఉంటారని పోలీసులు తెలిపారు. ధోని భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన పడకూడదని.. సొంత పట్టణానికి ఎప్పుడొచ్చినా.. జెడ్ కేటగిరి కంటే ఎక్కువ భద్రతనే ఏర్పాటు చేస్తామని రాజీవ్ అన్నారు. గతంలో ధోనికి ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకే తాము జెడ్ కేటగిరి భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం ధోనికి ఎలాంటి ముప్పు లేదని ఆయన అన్నారు. రాంచీలోని హార్మూలో ధోని నివాసముంది. రాంచీని సందర్శించిన ప్రతిసారి డియోరి ఆలయాన్ని సందర్శిస్తారు. అంతేకాకుండా సొంత పట్టణంలో మోటార్ సైకిల్ నడపడానికి ధోని ఇష్టపడుతారని పోలీసులు తెలిపారు.