సాక్షి, హైదరాబాద్: జిల్లా స్థాయి టీఆర్‌ఎస్ నేతను రాంచీ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. మంచిర్యాల జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత మూల సత్యనారాయణ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టుల నుంచి డబ్బులు తీసుకువస్తుండగా పోలీసులకు చిక్కిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆగష్టు 31న మావోయిస్టు కేంద్ర కమిటి సభ్యుడు మూల దేవేందర్ రెడ్డి నుండి డబ్బులు తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు రాంచీ పోలీసులు పేర్కొన్నారు. సత్యనారాయణతో పాటు నిర్మల్‌కు చెందిన మరో మావోయిస్టు సానూభూతిపరుడు ఉన్నట్టు సమాచారం. దేవేందర్ రెడ్డి మావోయిస్టు కేంద్ర కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పట్టుబడిన సత్యనారాయణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ (టీఆర్‌ఎస్) మూల రాజిరెడ్డి సోదరుడు. సత్యనారాయణపై కేసు నమోదు చేసిన రాంచీ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
మావోల డబ్బు తరలిస్తున్న టీఆర్‌ఎస్ నేత.. అరెస్టు..!
Published Sun, Sep 3 2017 11:00 AM | Last Updated on Tue, Oct 9 2018 2:53 PM
Advertisement