లిఫ్ట్‌ అడిగిన మహిళపై తండ్రీకొడుకుల అఘాయిత్యం | UP Sitapur Woman Molested By Father Son Duo And Set on Fire | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ అడిగిన మహిళపై తండ్రీకొడుకుల అఘాయిత్యం

Feb 27 2021 11:38 AM | Updated on Feb 27 2021 2:09 PM

UP Sitapur Woman Molested By Father Son Duo And Set on Fire - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బాధితురాలు వారిని లిఫ్ట్‌ అడిగి.. ఎడ్ల బండి ఎక్కింది

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై అత్యాచారం చేసిన తండ్రీ కొడుకులు ఆమెను చంపేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన శుక్రవారం  జరిగింది. వివరాలు.. బాధితురాలు యూపీ సీతాపూర్‌ జిల్లా సిధౌలి ప్రాంతంలోని తన పుట్టింటి నుంచి మిశ్రీఖ్‌లోని అత్తారింటికి వెళ్తోంది. అదే సమయంలో ఇద్దరు తండ్రీ కొడుకులు ఎడ్ల బండిపై అదే మార్గంలో వెళ్తున్నారు. దాంతో బాధితురాలు వారిని లిఫ్ట్‌ అడిగి.. ఎడ్ల బండి ఎక్కింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వారిద్దరూ సదరు మహిళను రోడ్డు పక్కకు లాక్కెళ్లి అత్యాచారం చేశారు. 

ఆమె బతికి ఉంటే తమకు ప్రమాదం అని భావించి మహిళ ఒంటికి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు. ఆ దారిన వెళ్తున్న స్థానికులు ఆమెను గుర్తించి ఎమర్జెన్సీ నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం అందించారు. బాధితురాలిని సీతాపూర్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. 30 శాతం గాయాలు అయ్యాయని ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. బాధితురాలు చెప్పిన సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేసి.. నిందితులైన తండ్రికొడుకులిద్దరిని అరెస్ట్‌ చేశారు. 
చదవండి: ‘అది ఖచ్చితంగా బ్యాడ్‌ టచే.. నాకు తెలుసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement