జై శ్రీరాం అనలేదని 15 ఏళ్ల బాలుడికి నిప్పు | Muslim Boy Set On Fire For Not Chanting Jai Shri Ram | Sakshi
Sakshi News home page

జై శ్రీరాం అనలేదని 15 ఏళ్ల బాలుడికి నిప్పు

Published Mon, Jul 29 2019 8:59 AM | Last Updated on Mon, Jul 29 2019 8:59 AM

Muslim Boy Set On Fire For Not Chanting Jai Shri Ram - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

లక్నో : జై శ్రీరాం అంటూ నినదించలేదని ఓ 15 ఏళ్ల ముస్లిం బాలుడికి నలుగురు వ్యక్తులు నిప్పంటించిన ఘటన యూపీలోని చందౌలీ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో 60 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలుడిని కబీర్‌ చౌరా ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

జై శ్రీరాం అని నినదించేందుకు నిరాకరించడంతోనే తనకు నిప్పంటించారని బాలుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆస్పత్రి కెమెరాలో రికార్డయింది. మరోవైపు పోలీసులు చెబుతున్నవివరాలు బాలుడి స్టేట్‌మెంట్‌కు విరుద్ధంగా ఉన్నాయి. దుధారి బ్రిడ్జ్‌పై తాను వెళుతుండగా నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్‌ చేశాడని, వారిలో ఇద్దరు తన చేతులను కట్టివేయగా..మరో వ్యక్తి తనపై కిరోసిన్‌పోసి నిప్పటించాడని, అనంతరం వారు పారిపోయారని బాధిత బాలుడు పేర్కొన్నాడు.

కాగా, బాలుడు ఇంటికి చేరే సమయానికే కాలిన గాయాలయ్యాయని పోలీసులు చెబుతూ దీన్ని అనుమానిత కేసుగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement