Jai sriram
-
ప్రభాస్ 'ఆదిపురుష్'.. వెండితెరపై మెప్పించిన టాలీవుడ్ రాముళ్లు వీరే!
ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రేక్షకులు 'ఆదిపురుష్' నామం జపిస్తున్నారు. ఎవరినీ పలకరించినా జై శ్రీరామ్ అనే పదమే వినిపిస్తోంది. ఎందుకంటే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రామాయణం ఆధారంగా తెరకెక్కించిన చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి రాముడిగా నటించడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే స్థాయిలో చిత్రబృందం సైతం ప్రమోషన్లలో భాగంగా భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే తెలుగులో రామాయణం ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు గతంలో చాలానే వచ్చాయి. కానీ అప్పటి స్టార్ హీరోలు సైతం రాముడి పాత్రలో కనిపించారు. వెండితెరపై రాముడిగా మెప్పించినవారిలో నటసార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్‌తో పాటు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, శోభన్‌బాబు సైతం రాముడి పాత్ర పోషించారు. మరీ రాముడి పాత్రలో ఎవరు చక్కగా ఒదిగిపోయారు? రాముడి వేషధారణలో అచ్చం రాముడే అనిపించేలా ఎవరు మెప్పించారు? అలా వెండితెరపై మొదటిసారి రాముడిగా ఎవరు కనిపించారు? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చదివేయండి. (ఇది చదవండి: విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా) తొలిసారి రాముడిగా ఆయనే.. సినీరంగంలో చాలామంది అగ్రనటులు రాముడిగా కనిపించినా.. తొలిసారి తెరపై రాముడిగా కనిపించింది మాత్రం నటుడు యడవల్లి సూర్యనారాయణనే. 1932లో విడుదలైన పాదుకా పట్టాభిషేకం చిత్రంలో రాముడిగా కనిపించారు. బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో తెలుగు చిత్రంగా తెరకెక్కింది. ఆ తర్వాత ఇదే పేరుతో 1945లో విడుదలైన చిత్రంలో సీఎస్ఆర్ ఆంజనేయులు రాముడిగా కనిపించారు. తొలి చిత్రంలోనే రాముడిగా అక్కినేని శ్రీ సీతారామ జననం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు రాముడిగా కనిపించారు. 1944లో వచ్చిన ఈ సినిమాలో ఆయన పూర్తిస్థాయి కథానాయకుడిగా నటించారు. తొలి సినిమా అయినా వెండితెరపై రాముడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా ఘంటసాలకు కూడా ఇది తొలిచిత్రం కావడం విశేషం. రాముడంటే ఆయనే అనేలా.. తెలుగు సినిమాల్లో రాముడు అనగానే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. ఆయనే నట విశ్వరూపం నందమూరి తారకరామారావు. 1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంలో తొలిసారి రాముడిగా కనిపించారు. ఆ తర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రాల్లోనూ రాముడి పాత్ర పోషించారు. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన శ్రీరామ పట్టాభిషేకం సినిమాలోనూ రాముడి పాత్రలో కనిపించారు. ఎన్టీఆర్‌ను రాముడిలా తెరపై కనిపిస్తే ప్రేక్షకులు థియేటర్లలో స్క్రీన్‌కే హారతులు ఇచ్చారంటే ఆయన ఎంతలా ఒదిగిపోయాడో తెలుస్తోంది. రావణుడిగా ఎన్టీఆర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలో నటుడు హరనాథ్ రాముడి పాత్ర పోషించారు. 1961లో విడుదలైన ఈ మూవీలో రావణుడిగా రామారావు నటించారు. ఆ తర్వాత 1968లో విడుదలైన ‘శ్రీరామకథ’ సినిమాలోనూ హరనాథ్ రాముడిగా కనిపించారు. ఒక్కసారైనా ఒదిగిపోయారు.. తెలుగు సినీరంగంలో అందగాడైన హీరో శోభన్‌బాబు ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంపూర్ణ రామాయణంలో రాముడి పాత్ర పోషించారు. 1971లో వచ్చిన ఈ సినిమాలో రావణుడి పాత్రలో ఎస్వీ రంగారావు ఆకట్టుకున్నారు. 1968లో వచ్చిన వీరాంజనేయ చిత్రంలో కాంతారావు రాముడిగా కనిపించారు. 1976లో బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతా కల్యాణం సినిమాలో నటుడు రవికుమార్ రాముడిగా ఒదిగిపోయారు. (ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్.. ఆ థియేటర్లలో ఆదిపురుష్ రిలీజ్ లేనట్లేనా?) బాల రాముడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్ మనవడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రలో మెప్పించారు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’లో జూనియర్ నటించారు. 1997లో వచ్చిన ఈ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు, రెండు నంది అవార్డులను దక్కించుకుంది. రామదాసులో సుమన్.. దేవుళ్లులో శ్రీకాంత్.. శ్రీ రామరాజ్యంలో బాలయ్య ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కూడా రాముడి పాత్ర పోషించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ రామదాసు’లో సుమన్ రాముడిగా ఆకట్టుకున్నారు. అలాగే కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘దేవుళ్లు’ చిత్రంలోని ఓపాటలో శ్రీకాంత్ రాముడిగా కనిపించారు. నందమూరి బాలకృష్ణ సైతం ఓ చిత్రంలో రాముడిగా కనిపించారు. బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామరాజ్యంలో మెప్పించారు. 2011లో వచ్చిన మూవీలో సీతగా నయనతార ఆకట్టుకుంది. ఆదిపురుష్‌లో ప్రభాస్ అయితే ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో రాముడి పాత్రలో అలనాటి హీరోలు అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే అప్పటి రామాయణానికి.. ఇప్పుడు తెరకెక్కిన రామాయణానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఇంతలా సాంకేతికపరమైన టెక్నాలజీ లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో రూపొందించారు. ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్, సరికొత్త హంగులతో తీర్చిదిద్దారు. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన ఆదిపురుష్‌లో ప్రభాస్ రూపంలో ఉన్న రాముడు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో తెలియాలంటే తెరపై చూడాల్సిందే. రావణుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కనిపించనుండగా.. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16న ఆదిపురుష్ థియేటర్లలో సందడి చేయనుంది. -పిన్నాపురం మధుసూదన్ -
జై శ్రీరామ్.. జై శ్రీరామ్
‘నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం. సఫలం స్వామి కార్యం’ అంటూ ‘జై శ్రీరామ్’ నామం ప్రతిధ్వనించేలా ‘ఆదిపురుష్’ చిత్రం నుంచి ఓ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రభాస్ టైటిల్ రోల్లో ఓం రౌత్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిపురుష్’. శనివారం ఈ చిత్రం నుంచి 60 సెకన్ల ‘జై శ్రీరామ్’ పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. అజయ్–అతుల్ స్వరపరిచిన ఈ గీతాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాశారు. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ కానుంది. -
జై శ్రీరాం నినాదాలపై ఐపీఎస్ అధికారి వ్యాఖ్యలు
తిరువనంతపురం : జై శ్రీరాం అంటూ ప్రజలు గట్టిగా నినదించాలని సస్పెండ్ అయిన కేరళ డీజీపీ జాకబ్ థామస్ అన్నారు. మనం జై శ్రీరాం అని గట్టిగా నినదించలేని పరిస్థితికి వచ్చామా అని ఆయన వ్యాఖ్యానించారు. జై శ్రీరాం నినాదాన్ని మరింత గట్టిగా నినదించాల్సిన సమయం ఇదేనని అన్నారు. త్రిసూర్‌లో జరిగిన రామాయణ ఫెస్ట్ కార్యక్రమంలోథామస్ మాట్లాడుతూ రాముడిని కీర్తించలేని పరిస్థితులకు మనం చేరామా అని అన్నారు. రాముడిని కీర్తించలేని స్ధితికి మన మనసులు చేరాయంటే అవి ఎంత కలుషితమయ్యాయో ఆలోచించాలని ఆయన చెప్పుకొచ్చారు దేశవ్యాప్తంగా పలుచోట్ల జై శ్రీరాం నినాదాలు చేయనందుకు దాడులు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో థామస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఓఖి తుపాన్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలను విమర్శించడంతో థామస్‌పై 2017 డిసెంబర్లో కేరళ ప్రభుత్వం వేటువేసింది. మరోవైపు ఏడాదిన్నరగా సస్పెన్షల్‌లో ఉన్న థామస్‌ను ఆయనకు తగిన పదవిలో తిరిగి నియమించాలని సెంట్రల్ అడ్మినిస్ర్టేటివ్ ట్రిబ్యునల్ ఎర్నాకుళం బ్రాంచ్ ఉత్తర్వులు జారీ చేసింది -
జై శ్రీరాం అనలేదని 15 ఏళ్ల బాలుడికి నిప్పు
లక్నో : జై శ్రీరాం అంటూ నినదించలేదని ఓ 15 ఏళ్ల ముస్లిం బాలుడికి నలుగురు వ్యక్తులు నిప్పంటించిన ఘటన యూపీలోని చందౌలీ జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనలో 60 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న బాలుడిని కబీర్ చౌరా ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. జై శ్రీరాం అని నినదించేందుకు నిరాకరించడంతోనే తనకు నిప్పంటించారని బాలుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆస్పత్రి కెమెరాలో రికార్డయింది. మరోవైపు పోలీసులు చెబుతున్నవివరాలు బాలుడి స్టేట్మెంట్కు విరుద్ధంగా ఉన్నాయి. దుధారి బ్రిడ్జ్‌పై తాను వెళుతుండగా నలుగురు వ్యక్తులు తనను కిడ్నాప్ చేశాడని, వారిలో ఇద్దరు తన చేతులను కట్టివేయగా..మరో వ్యక్తి తనపై కిరోసిన్‌పోసి నిప్పటించాడని, అనంతరం వారు పారిపోయారని బాధిత బాలుడు పేర్కొన్నాడు. కాగా, బాలుడు ఇంటికి చేరే సమయానికే కాలిన గాయాలయ్యాయని పోలీసులు చెబుతూ దీన్ని అనుమానిత కేసుగా పరిగణిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
ప్రతిపక్షాన్ని హేళన చేసిన బీజేపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రతిపక్షానికి పార్లమెంట్లో ఎంత మంది ఉన్నారన్నది ఇక్కడ ముఖ్యం కాదు. పార్లమెంట్ కార్యకలాపాల్లో ప్రతిపక్షాలు క్రియాశీలక పాత్ర వహించాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది అత్యవసరం. కలిసికట్టుగా ముందుకు సాగి దేశాభివద్ధికి కషి చేయాలన్నది నా అభిమతం’ అని పార్లమెంట్ సమావేశాల తొలిరోజైన సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లోపల, బయట విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయన స్ఫూర్తి విపక్షాలకు ఎంత అర్థమైందో తెలియదుగానీ పాలకపక్ష బీజేపీ ఎంపీలకు అస్సలు అర్థం కాలేదు. తెలంగాణ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం పార్లమెంట్ సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వెళుతుంటే బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, వందేమాతరం’ అంటూ నినాదాలు చేశారు. ప్రొటెమ్ స్పీకర్ వీరేంద్ర కుమార్ కూడా వారిని వారించలేక పోయారు. నినాదాల మధ్య మౌనంగా నడుచుకుంటూ వెళ్లిన ఒవైసీ ప్రమాణ స్వీకారం అనంతరం ‘జై భీమ్, అల్లాహు అక్బర్’ అంటూ ప్రతిగా నినాదాలు చేశారు. జై భీమ్ అంటూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరిట నినాదాలు చేయడం బీజేపీ సభ్యులను కాస్త ఇరుకున పెట్టింది. ఒవైసీ ఒక్కరి పట్లనే బీజేపీ ఎంపీలు అనుచితంగా ప్రవర్తించలేదు. ప్రతిపక్ష సభ్యుల అందరి విషయంలో వారు అలాగే వ్యవహరించారు. సమాజ్‌వాది పార్టీకి చెందిన ఎంపీ షఫీకర్ రహమాన్ బార్క్ ప్రమాణ స్వీకారానికి వెళుతున్నప్పుడు కూడా బీజేపీ ఎంపీలు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేశారు. అందుకు ఆయన ప్రతిగా ‘కానిస్టిట్యూషన్ జిందాబాద్’ అంటూ నినదించారు. అదే పార్టీకి చెందిన హెచ్‌టీ హాసన్‌కు అదే అనుభవం ఎదురవ్వగా ఆయన ‘హిందుస్థాన్ జిందాబాద్’ నినదించారు. అలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన తణమూల్ ఎంపీలు, తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీలు ప్రమాణం చేసినప్పుడు, అందులోనూ ప్రధాని స్ఫూర్తిదాయక వాఖ్యలు చేసిన సోమవారం నాడే బీజేపీ ఎంపీలు అనుచితంగా వ్యవహరించారు. కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ ప్రమాణం చేసిన తర్వాత హిందీలో ప్రమాణం చేసినందుకు ఆమెకు కతజ్ఞతలు తెలిపారు. అక్కడ కూడా ఆమె ఇటలీకి చెందిన వనిత అని గుర్తు చేయడమే! 543 లోక్‌సభ స్థానాలకు 303 స్థానాలు గెలుచుకోవడంతో పార్లమెంట్ నియమ నిబంధనలకు తాము అతీతులమని బీజేపీ ఎంపీలు భావిస్తున్నట్లు ఉంది. వారు ప్రతిపక్షం పట్ల సమభావం చూపకపోతే తమ నాయకుడు మోదీ చేసిన వ్యాఖ్యల్లో స్ఫూర్తిని వారే పాతరేసినట్లువుతుంది. -
‘తన గొయ్యి తానే తవ్వుకుంటుంది’
కోల్‌కతా : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని తీవ్ర నిరాశకు గురి చేశాయి. బెంగాల్లో బీజేపీ ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించి.. దీదీకి గట్టి సవాల్ విసిరింది. ఎన్నికలు ముగిసినప్పటికి ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు మాత్రం చల్లారడం లేదు. గత కొన్ని రోజులుగా బీజేపీ కార్యకర్తలు మమత ఎదురుగా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేయడం.. ఆమె వారి మీద ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో.. బీజేపీ కార్యకర్తల పట్ల మమత అతిగా స్పందిస్తూ.. తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు అన్నారు అవార్డు విన్నింగ్ నటి అపర్ణా సేన్. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై అపర్ణ స్పందిస్తూ.. బీజేపీ కార్యకర్తల పట్ల మమతా బెనర్జీ వ్యవహరిస్తున్న తీరు నాకు నచ్చడం లేదు. మనది ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ప్రజలు జై శ్రీరాం, జై కాళీ మాతా, అల్లా అంటూ ఇలా తమకు నచ్చిన దేవుని పేరు తల్చుకోవచ్చు. ఇది ఈ దేశ ప్రజలుగా వారికున్న హక్కు. మమతా బెనర్జీ ఈ విషయాన్ని గుర్తించలేకపోవడం దురదృష్టకరం. రాజకీయాలు వేరు.. మతం వేరు. ఈ రెండింటిని కలపి చూస్తే ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి. ముఖ్యమంత్రి అయ్యుండి.. బీజేపీ కార్యకర్తల పట్ల ఆమె స్పందిస్తున్న తీరు ఏ మాత్రం బాగాలేదు. దీర్ఘకాలం ఆమె బెంగాల్‌కు సీఎంగా కొనసాగలనుకుంటే.. కంట్రోల్‌గా మాట్లాడాలి’ అని తెలిపారు. ‘దీదీ తీరు ఇలానే కొనసాగితే ఓటర్లను తనకు వ్యతిరేకంగా తానే మార్చుకున్నట్లు అవుతుంది. అదే జరిగితే ఆమె గొయ్యి ఆమె తవ్వుకున్నట్లు అవుతుంది’ అన్నారు అపర్ణా సేన్. (చదవండి : దీదీకి తప్పని జై శ్రీరాం సెగ..) -
జై శ్రీరామ్ అన్న బిహార్ ముస్లిం మంత్రి
పట్నా: నితీశ్ కుమార్ మంత్రివర్గంలో మైనార్టీ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఖుర్షిద్ అలియాస్ ఫిరోజ్ అహ్మద్ జైశ్రీరామ్ అని నినదించటం వివాదానికి దారితీసింది. జూలై 28న అసెంబ్లీలో నితీశ్ విశ్వాస పరీక్ష నెగ్గాక∙ఖుర్షిద్ ఈ నినాదాలు చేశారు. ‘నేను రామ్, రహీమ్‌లిద్దరినీ ఆరాధిస్తాను. బిహారీలకు మేలు జరుగుతుందంటే జై శ్రీరామ్ అని నినదించేదుకు నేను సంకోచించను’ అని పేర్కొన్నారు . చేతికి కట్టుకున్న హిందువుల పవిత్రమైన దారాన్నీ ప్రదర్శించారు. దీనిపై ముస్లిం మతపెద్దలు, విపక్షాల్లోని ముస్లిం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి ముస్లిం సమాజాన్ని అవమానించారని.. అతను ఇస్లాంలో ఉండేందుకు అనర్హుడని ముస్లిం మతపెద్దలు మండిపడ్డారు. రాజకీయ అవసరాల కోసం ఖుర్షీద్ ఎంతకైనా దిగజారతారని మండిపడ్డారు. -
పూర్తి వినోదం
ఎస్ఎస్ సెల్యులాయిడ్స్ పతాకంపై పొట్నూరు చక్రధరుడు సమర్పణలో విజయ్ భరత్, అశ్విని జంటగా జై శ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరు శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం ‘వినోదం 100%’. సుభాష్ ఆనంద్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాతలు కిషోర్ రాఠి, కె. అచ్చిరెడ్డి విడుదల చేశారు. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ చేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో సాయి వెంకట్, శోభారాణి, ఉత్తేజ్ తదితర అతిథులతో పాటు చిత్ర బృందం కూడా పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీరామ మహాయజ్ఞం
భద్రాచలం: భద్రాద్రి శ్రీరామ మహాయజ్ఞంలో భాగంగా శుక్రవారం అత్యంత వైభవంగా అగ్నిప్రతిష్ట ప్రారంభమైంది. విశాఖపట్నం జిల్లా కొండకొప్పాక అష్టలక్ష్మీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీరామమహాయజ్ఞంలో అరుదైన ఘట్టానికి తెరలేచింది. యాగశాల ప్రవేశం చేసిన వేదపండితులు, అర్చకులు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. హరణితో(కర్రలతో చిలకటం ద్వారా) అగ్నిహోత్రం సృష్టించి, దానిని ప్రధాన హోమగుండంలో వేశారు. శ్రీమద్రామాయణం పుస్తకాలను తలపై ఉంచి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా జై శ్రీరామ్ అనే నినాదాలు ఆ ప్రాంగణంలో మార్మోగాయి. నిర్వాహకులైన పీతాంబరం రఘునాథాచార్య స్వామి చేతుల మీదుగా ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఆలయ ఈవో జ్యోతి, ఏఈవో శ్రావణ్ కుమార్ తదితరులకు కంకణధారణ చేశారు. యజ్ఞం తిలకించేందుకు తెలంగాణ, ఏపీల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. -
‘జైశ్రీరాం’ వరికి పెరుగుతున్న డిమాండ్
మోర్తాడ్: సన్నరకంలో మరింత సన్నగా ఉండే జై శ్రీరాం రకం వరికి డిమాండ్ పెరుగుతోంది. ప్రైవేటు విత్తన కంపెనీలు ఐదేళ్ల కింద జై శ్రీరాం రకం వరి విత్తనాలను ఉత్పత్తి చేశాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూ ర్ సబ్ డివిజన్లోని రైతులు దీనిని ఎక్కువగా సాగు చేశారు. సాధారణంగా సన్న రకాల్లో బీపీటీ, హెచ్ఎంటీ రకాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. జై శ్రీరాం రకం బీపీటీ, హెచ్‌ఎంటీల కంటే సన్నగా ఉండటంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. బీపీటీ, హెచ్ఎంటీ ల ధర అంతంతమాత్రమే. జై శ్రీరాం రకానికి మాత్రం పెరుగుతోంది. మార్కెట్ ఆరంభమైన మొదట్లో క్వింటాలుకు రూ.1,600 నుంచి రూ.1,750 పలికిన ధర ఇప్పుడు రూ. 2,200కు చేరింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సన్న రకాలను దాదాపు 70 వేల హెక్టార్ల వరకు సాగు చేశారు. జై శ్రీరాం రకాన్ని ఎనిమిది వేల ఎకరాల వరకు పండించారు. బీపీటీ, హెచ్‌ఎంటీలు ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి లభిస్తే జై శ్రీరాం రకం 15 నుంచి 25 క్వింటాళ్ల వరకు మాత్రమే దిగుబడి వస్తుంది. జై శ్రీరాం క్వింటాల్ ధర రూ. 2,300 ఉంది. ఈ రకం బియ్యం క్వింటాల్‌కు రూ. 5,200కు పైగా ఉంది.