జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌ | Jai Shri Ram Lyrical Motion Poster Release In Adipurush | Sakshi
Sakshi News home page

జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌

Published Sun, Apr 23 2023 3:57 AM | Last Updated on Sun, Apr 23 2023 3:57 AM

Jai Shri Ram Lyrical Motion Poster Release In Adipurush - Sakshi

‘నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వ సైన్యం.. సహచరులై పదా వస్తున్నాం. సఫలం స్వామి కార్యం’ అంటూ ‘జై  శ్రీరామ్‌’ నామం ప్రతిధ్వనించేలా ‘ఆదిపురుష్‌’ చిత్రం నుంచి ఓ లిరికల్‌ వీడియోను చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆదిపురుష్‌’.

శనివారం ఈ చిత్రం నుంచి 60 సెకన్ల ‘జై శ్రీరామ్‌’ పాట లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేశారు. అజయ్‌–అతుల్‌ స్వరపరిచిన ఈ గీతాన్ని హిందీ, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాశారు. భూషణ్‌ కుమార్, క్రిషన్‌ కుమార్, ఓం రౌత్, ప్రసాద్‌ సుతార్, రాజేష్‌ నాయర్, వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 16న రిలీజ్‌ కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement