తిరువనంతపురం : జై శ్రీరాం అంటూ ప్రజలు గట్టిగా నినదించాలని సస్పెండ్ అయిన కేరళ డీజీపీ జాకబ్ థామస్ అన్నారు. మనం జై శ్రీరాం అని గట్టిగా నినదించలేని పరిస్థితికి వచ్చామా అని ఆయన వ్యాఖ్యానించారు. జై శ్రీరాం నినాదాన్ని మరింత గట్టిగా నినదించాల్సిన సమయం ఇదేనని అన్నారు. త్రిసూర్‌లో జరిగిన రామాయణ ఫెస్ట్ కార్యక్రమంలోథామస్ మాట్లాడుతూ రాముడిని కీర్తించలేని పరిస్థితులకు మనం చేరామా అని అన్నారు. రాముడిని కీర్తించలేని స్ధితికి మన మనసులు చేరాయంటే అవి ఎంత కలుషితమయ్యాయో ఆలోచించాలని ఆయన చెప్పుకొచ్చారు
దేశవ్యాప్తంగా పలుచోట్ల జై శ్రీరాం నినాదాలు చేయనందుకు దాడులు జరుగుతున్నాయనే వార్తల నేపథ్యంలో థామస్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా ఓఖి తుపాన్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలను విమర్శించడంతో థామస్‌పై 2017 డిసెంబర్‌లో కేరళ ప్రభుత్వం వేటువేసింది. మరోవైపు ఏడాదిన్నరగా సస్పెన్షల్‌లో ఉన్న థామస్‌ను ఆయనకు తగిన పదవిలో తిరిగి నియమించాలని సెంట్రల్ అడ్మినిస్ర్టేటివ్ ట్రిబ్యునల్ ఎర్నాకుళం బ్రాంచ్ ఉత్తర్వులు జారీ చేసింది
Comments
Please login to add a commentAdd a comment