ప్రాణాలమీదికొచ్చిన ఫేస్‌బుక్‌ పరిచయం..! | Bahrain Man Set On Fire A Women In Hyderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 1:22 PM | Last Updated on Sat, Oct 6 2018 9:35 PM

Bahrain Man Set On Fire A Women In Hyderabad - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న స్థానికురాలు.. కాలిన గాయాలతో ఇబ్రహీ

సాక్షి, హైదదాబాద్‌ : నగరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమను నిరాకరించిందనీ యువతికి ఓ వ్యక్తి నిప్పుపెట్టాడు. తను కూడా నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో యువతితో పాటు ఆమె వదిన కూడా తీవ్ర గాయాలపాలైంది. 90 శాతం కాలిన గాయాలతో ఇద్దరూ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. యువకుడికి 40 శాతం గాయాలయ్యాయి. టప్పచబుత్రలో ఈ దారుణం చోటుచేసుకుంది. వివరాలు.. బహ్రెయిన్‌కు చెందిన ఇబ్రహీం గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. టప్పచబుత్రకు చెందిన అజీనా బేగంతో  అతనికి ఫేస్‌బుక్‌లో పరిచయమేర్పడింది. తనను ప్రేమించాలంటూ ఇబ్రహీం కొన్ని రోజులుగా ఆమెను వేధిస్తున్నాడు. అందుకు యువతి నిరాకరించడంతో ఇటీవల ఇండియాకి వచ్చి ఆమెను కలవడానికి ప్రయత్నించాడు.

అయితే, ఇబ్రహీంకు ఇదివరకే పెళ్లై, ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో అజీనా అతనికి లొంగలేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.. తన వెంటపడొద్దని వేడుకుంది. అయినా, కనికరించిన ఆ రాక్షసుడు శనివారం ఉదయం పెట్రోల్‌ క్యాన్‌తో యువతి ఇంటికి వెళ్లాడు. అజీనాపై పెట్రోల్‌ పోసి, తను కూడా నిప్పించుకున్నాడు. అజీనా వదిన ఘటనలో తీవ్రంగా గాయపడింది. ఊహించని పరిణామంతో ఆ కాలనీ వాసులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. ఘటనలో బాధితుల ఇళ్లు పూర్తిగా కాలిపోయింది.

చికిత్స పొందుతూ షబానా బేగం మృతి
ఇబ్రహీం దాడిలో 90శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన బాధితురాలు చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది. షబానా మృతి చెందటంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement