మణిపూర్లో భారీ హింస చెలరేగింది.
ఇంఫాల్: మణిపూర్లో భారీ హింస చెలరేగింది. సోమవారం రాత్రి మణిపూర్ దక్షిణ ప్రాంతంలోని చురచంద్పూర్లో ఓ మంత్రి, నలుగురు ఎమ్మెల్యేల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
మణిపూర్ ఆరోగ్య శాఖ మంత్రి ఫుంగ్జతాంగ్ టాన్సింగ్ ఇంటిని దహనం చేశారు. ఇన్నర్ లైన్ పర్మిట్ అంశంపై వారు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు నిరసనకారులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం మొదలైన ఆందోళన ఇంకా కొనసాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.