
ప్రతీకాత్మక చిత్రం
లక్నో : శ్మశాన స్థలాన్ని కబ్జాదారులనుంచి రక్షించలేకపోతున్నానన్న బాధతో ఓ వ్యక్తి తనతో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేశాడు. కుటుంబంతో కలిసి మూకుమ్మడి ఆత్మహత్యలకు ప్రయత్నించాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు... కాన్పూర్ దేహత్, మూసా నగర్‌కు చెందిన గుల్ఫమ్(35) ఊర్లోని శ్మశాన వాటిక స్థలానికి కాపలాగా ఉంటున్నాడు.
అయితే ఆ స్థలాన్ని ఆక్రమించుకున్న కొందరు నిర్మాణాన్ని చేపట్టారు. గుల్ఫమ్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికి లాభం లేకపోయింది. దీంతో భార్య, బిడ్డలతో కలిసి చచ్చిపోవటానికి సిద్ధపడ్డాడు. గురువారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అనంతరం తనపై, వారిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలుతున్న వారి అరుపులు విన్న దారినపోయేవారు ఆసుపత్రికి తరలించారు. ప్రసుత్తం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేట్టారు.
( లేడీ డాక్టర్‌ను కాల్చిచంపిన ఇండియన్ డాక్టర్)
Comments
Please login to add a commentAdd a comment