ప్రతీకాత్మకచిత్రం
లక్నో : మహిళతో వివాహేతర సంబంధం కలిగిఉన్నాడనే ఆరోపణలతో ఓ యువకుడిని సజీవ దహనం చేసిన ఘటన యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో వెలుగుచూసింది. హతుడిని భుజామి గ్రామానికి చెందిన అంబికా పటేల్‌గా గుర్తించారు. కొద్ది నెలల కిందట మహిళ వీడియో క్లిప్‌ను ఆ యువకుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం మహిళ బంధువులకు ఆగ్రహం కలిగించింది.
దీంతో అనైతిక బంధం కొనసాగిస్తున్నాడనే అనుమానంతో మహిళ బంధువులు సోమవారం బాధితుడిని ఇంటి నుంచి వెలుపలకి తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం బాధితుడిపై పెట్రోల్ చల్లి నిప్పుపెట్టారు. యువకుడి హత్యపై బాధిత కుటుంబ సభ్యులు, స్ధానికులు ఆగ్రహంతో పోలీస్ వాహనాలను దగ్ధం చేశారు. పరిస్థితి అదుపుతప్పడంతో ఘటనా ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను రప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment