తనపై జరగబోయిన అత్యాచారాన్ని అడ్డుకున్నందుకు ఓ బాలిక మీద ఆ దుండగుడు కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు! ఈ దారుణం ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ర జిల్లాలో గురువారం జరిగింది.
తనపై జరగబోయిన అత్యాచారాన్ని అడ్డుకున్నందుకు ఓ బాలిక మీద ఆ దుండగుడు కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు! ఈ దారుణం ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ర జిల్లాలో గురువారం జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ బాలిక 90 శాతం కాలిన గాయాలతో అలీగఢ్ వైద్యకళాశాల ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
పహసు ప్రాంతంలో ఈ దారుణ సంఘటన జరిగింది. బాలిక తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి అదే గ్రామానికి చెందిన నిందితుడు ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కోపం వచ్చిన అతడు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించేశాడు. దీంతో పోలీసులు అతడిపై అత్యాచారయత్నంతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.