
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని హౌజింగ్‌బోర్డు కాలనీలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. సరిగా చదవడం లేదని కొడుకుపై తండ్రి కిరాతకానికి ఒడిగట్టాడు. చరణ్ అనే పదేళ్ల యువకుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. అయితే కుమారుడు సరిగా చదువుకోవడం లేదని తండ్రి అతనిపై పలుమార్లు విచక్షణారహితంగా కొట్టాడు. అంతేగాక కొడుకుపై కోపం చల్లారకపోవడంతో ఆదివారం రాత్రి టీవీ చూస్తున్న చరణ్‌పై టర్పెంటైల్ పోసి నిప్పంటించి తగలబెట్టాడు. ఒంటినిండా గాయాలవ్వడంతో బాలుడు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చదవండి: ఈ అగ్ని ప్రమాదం హైదరాబాద్లో జరిగిందా?