
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. గుట్కా ఇవ్వలేదని ఓ వ్యక్తిపై కిరోసిన్ పోసి అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటన మధుర జిల్లాలోని సపోహ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితుని సోదరుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పార్‌దేసీ (32) సరుకులు కొనుగోలు చేద్దామని స్థానికంగా ఉండే దుకాణం వద్దకు వెళ్లాడు. అతని వద్ద ఉన్న గుట్కా ఇవ్వుమని రాజు, రాహుక్ టాకూర్ దురుసుగా ప్రవర్తించారు. వారిమధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో తన తమ్ముడిపై కిరోసిన్ పోసి రాజు, టాకూర్ నిప్పటించారని తెలిపాడు.
కాగా, ఈ ఉదంతంపై మరో వాదన వినిపిస్తోంది. గుట్కా విషయంలో వాగ్వాదం జరిగింది నిజమేననీ నిందితులు తెలిపారు. అయితే, పార్‌దేసీపై తామెలాంటి దుశ్చర్యకు పాల్పడలేదని వెల్లడించారు. గొడవ అనంతరం ఇంటికి వెళ్లిన పార్‌దేసీ ఒంటిపై కిరోసిన్ పోసుకుని వచ్చాడనీ, తమ ముందే నిప్పంటిచుకున్నాడని తెలిపారు. బాధితుడి కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామనీ పోలీసులు వెల్లడించారు. కాగా, పార్‌దేసీ జిల్లా ఆస్పత్రితో చికిత్స పొందుతున్నాడు. అతని ఒంటిపై 20 శాతం కాలిన గాయాలయ్యాయనీ, ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment