మధురలో శ్రీకృష్ణాష్టమి వేళ విషాదం చోటుచేసుకుంది. పండుగ నాడు ఉదయమంతా ఉపవాసం ఉండి, సాయంత్రం వేళ బక్వీట్(గోధుమ తరహా ఆహారధాన్యం) పిండితో చేసిన పకోడీలు తిన్న 60 మందికిపైగా జనం అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన మధురలోని ఫరా ప్రాంతంలో చోటుచేసుకుంది. బక్వీట్ పకోడీలు తిన్న కొద్దిసేపటికే చాలామంది కడుపునొప్పి, వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. స్థానికులు వీరిని వెంటనే కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఆరోగ్యం మరింతగా క్షీణించిన ఆరుగురిని ఆగ్రాలోని ఎస్‌ఎన్ ఆస్పత్రికి తరలించారు. అలాగే 15 మంది బాధితులను మధుర జిల్లా ఆస్పత్రికి, 11 మందిని బృందావన్‌లోని ఆస్పత్రికి తరలించారు.
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ స్టాఫ్ నర్సు జస్వంత్ యాదవ్ మాట్లాడుతూ ఫుడ్ పాయిజన్ కారణంగా 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారన్నారు. వీరింతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ఘటన అనంతరం జిల్లా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్ అధికారులు బక్వీట్ పిండి విక్రయించిన ఇద్దరు దుకాణదారులపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment