ఫుడ్ పాయిజనింగ్‌లా ఏంటీ వాటర్ పాయిజనింగ్. నీళ్లు కూడా పాయిజన్‌గా అవుతాయా..? లేక కలుషిత నీటి వల్ల ఇలా జరుగుతుందా అంటే..?. అవేమీ కాదు. తాగాల్సిన నీటికంటే అధికంగా తాగితే ఈ పరిస్థితికి గురవ్వుతామని చెబుతున్నారు నిపుణుల. దీని వల్ల ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు. అసలేంటి వాటర్ పాయిజనింగ్? ఎలా ప్రాణాంతకమో? సవివరంగా చూద్దాం.
టెక్సాస్‌కి చెందిన 74 ఏళ్ల వృద్ధుడు జూన్‌లో తీవ్ర వేసవి వేడికి గురయ్యాడు. చెప్పాలంటే తీవ్ర వేడిమికి తాళ్లలేక అధికంగా నీటిని తాగాడు. సుమారు 11 లీటర్ల మేర నీళ్లు ఆత్రంగా తాగేశాడు. అంతే కాసేపటికి కారం, అలసట, ఛాతీ నొప్పిని వంటి సమస్యలతో స్ప్రుహ కోల్పోయాడు. వెంటనే అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడు నీటి పాయిజన్‌కి గురయ్యినట్లు నిర్థారించారు. అసలేంటి నీటి పాయిజన్ అంటే..
వేడి, తేమతో కూడిన పరిస్థితుల్లో నివశించే ప్రజలు అధిక దాహానికి గురవ్వుతారు. త్వరగా నీటిని తాగి డీహైడ్రేషన్ నష్టాన్ని భర్తీ చేయాల్సిఉంటుంది. ఇలా తాగేటప్పుడూ అధికంగా తాగితే నీటిపాయిజన్‌కి గురవ్వుతారు. వెంటనే ఇది కిడ్నీలు, ఎలక్ట్రోలైట్‌లు, సోడియంపై ప్రభావం చూపుతుంది. ఇక్కడ నీటిని అధికంగా తీసుకున్న వెంటనే ఎలక్ట్రోలైట్‌లు, ఉప్పు కరిగిపోవడం జరుగుతుంది. దీంతో ఆ అధిక నీటిని మూత్రపిండాలు బయటకు పంపలేక పాయిజన్‌గా మారిపోవడం జరుగుతుంది.
ఇది ఉబ్బరం, పాలీయూరియా, హైపోనాట్రేమియా (సీరం సోడియం గాఢత 135 mEq/L కంటే తక్కువ), వాపు, బలహీనమైన జీవక్రియకు దారితీస్తుంది. మూత్రపిండాలు ఒక సమయంలో పరిమిత నీటిని మాత్రమే నిర్వహించగలవు. తక్కువ వ్యవధిలో అధిక మొత్తంలో ద్రవాలను నిర్వహించడం తీవ్రమైన పరిణామలకు దారితీసి.. కణాల వాపు, గుండెపోటు వంటి లక్షణాలు ఎదురవ్వుతాయి.
లక్షణాలు..
కండరాల బలహీనత లేదా తిమ్మిరి
రక్తపోటు పెరుగుదల
ద్వంద్వ దృష్టి
గందరగోళం
ఇంద్రియ సమాచారాన్ని గుర్తించలేకపోవడం
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
మానసిక రుగ్మతలో బాధపడుతున్నవారు, క్రీడాకారులు, సైనిక శిక్షణ, అధిక శ్రమతో కూడిన పనులు చేసేవారు అధికంగా నీటిని తాగకూడదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్(ఎన్‌ఐహెచ్) ప్రకారం అమెరికాలో ప్రతి ఏడాది మూడు నుంచి ఆరు మిలియన్ల మంది ఈ వాటర్ పాయిజనింగ్ బారినపడుతున్నట్లు నివేదిక పేర్కొంది.
ఎంత నీరు తాగితే మంచిదంటే..
ఒక వ్యక్తి రోజూలో ఎంత నీరు తాగొచ్చు అని చెప్పేందుకు ఎలాంటి మార్గదర్శకాలు లేవు. అయితే ఆరోగ్యానికి అవసరమైనంత మేర నీటిని తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. హైపోనట్రేమియాకి గురై, మూత్రపిండాలపై ప్రభావం పడేలా నీటిని అధికంగా తీసుకోకూడదు. విపరీతమైన వేడి వాతావరణంలో శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత కాపాడుకునేలా రోజుకి సుమారు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
(చదవండి: రోజూ ఎనిమిది గ్లాసుల పాలు తాగేవాడినంటున్న బాబీ డియోల్.. దీని వల్ల వచ్చే సమస్యలివే..!)
Comments
Please login to add a commentAdd a comment