![Food Poisoning In Madrasah In Vijayawada](/styles/webp/s3/article_images/2024/06/28/FoodPoisoning_VJA.jpg.webp?itok=jdqpNgR8)
సాక్షి, విజయవాడ: నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హైస్కూల్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. నిన్న( గురువారం) రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 8 మందికి వాంతులు కావడంతో పాటు గుడివాడ అంగళూరు ప్రాంతానికి చెందిన కరిష్మా(17) అనే బాలిక ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.. అయితే, ఆహారం కలుషితమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
కాగా, మదరసా చారిటబుల్ ట్రస్ట్ ముందు బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ కూతురు కరిష్మా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వందల కేజీల కుళ్లిపోయిన మాంసాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ట్రస్ట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు, డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీలు చేశారు. డీప్ ఫ్రీజ్‌లో ఫుడ్ ఇన్స్పెక్టర్ గౌస్.. మాంసాన్ని పరిశీలించారు.
ఫ్రీజ్‌లో 100 కేజీల మటన్ ఉందని.. ఈ నెల 17వ తేదీన తెచ్చిన మటన్ నేటికి వాడుతున్నారని తెలిపారు. బుధవారం పుడ్ పాయిజన్ జరిగింది.. కరిష్మా అనే బాలిక మృతి చెందింది. 8 మంది ఆసుపత్రిలో చికిత్స తీసుకుని వచ్చారు. మదర్సాకు నోటీసులు ఇచ్చాం’ అని ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment