
రైలు ఇంజిన్‌కు నిప్పుపెట్టిన మావోయిస్టులు
జార్ఖండ్: సాయుధులైన మావోయిస్టులు జార్కండ్‌లోని ఓ రైలు స్టేషన్‌పై దాడి చేసి నిప్పుపెట్టారు. అక్కడ ఉన్న ఓ గూడ్స్ రైలు ఇంజిన్‌ను తగులబెట్టారు.
దుమ్రి బిహార్ రైల్వే స్టేషన్ వద్ద మావోయిస్టులు గురువారం రాత్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సీఎన్‌టీ-ఎస్‌పీటీ యాక్ట్‌లో గిరిజనులకు వ్యతిరేకంగా సవరణలను తీవ్రంగా నిరసిస్తున్నామని ఘటనా స్థలం వద్ద వదిలివెళ్లిన కరపత్రాల్లో మావోలు పేర్కొన్నారు. ఈ దాడిలో సుమారు 50 మంది మావోయిస్టులు పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు. గూడ్స్ రైలు డ్రైవర్, కో డ్రైవర్‌ల వద్ద ఉన్న వాకీటాకీలను సైతం నక్సల్స్ లూటీ చేశారని తెలిపారు.
రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని నష్ట వివరాలను అంచనా వేస్తున్నారు. మావోయిస్టుల దాడి విషయం తెలిసిన వెంటనే భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్నాయి. బొకారో-గోమో రైలు మార్గంలో రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.