జెరూసలేం: అలనాటి నాజీ మారణహోమం భయాందోళనలను భరిస్తూ జీవనం సాగించిన మహిళలను గౌరవించే నిమిత్తం రూపొందించిన వార్షిక ఇజ్రాయెల్ అందాల పోటీల్లో 86 ఏళ్ల బామ్మ కుకా పాల్మోన్ విజేతగా నిలిచి "మిస్ హోలోకాస్ట్ సర్వైవర్" కిరీటాన్ని గెలిపొందారు. ఈ మేరకు జెరూసలేంలోని ఒక మ్యూజియంలో ఈ పోటీలు నిర్వహించారు. అయితే ఈ పోటీల్లో సుమారు 10 మంది 79 నుంచి 90 సంవత్సరాల వయసు ఉన్న బామ్మలు మంచి హెయిర్ స్టైల్, మేకప్ వేసుకుని గౌనులాంటి చీరలను ధరించి క్యాట్‌వ్యాక్‌తో సందడి చేశారు.
(చదవండి: వామ్మో! మొసలిని కౌగలింతలతో ఎలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందో!!)
ఈ మేరకు కుకా పాల్మోన్ మాట్లాడుతూ.."హోలోకాస్ట్‌లో గడిపిన తర్వాత నేను నా కుటుంబసభ్యులతో కలిసి జీవిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు, నలుగురు మనవరాళ్ళు, ఇద్దరు ముని మనవరాళ్ళు ఉన్నారు. పైగా నేను ఇక్కడకు వచ్చి పాల్గొంటానని కలలో కూడా అనుకోలేదు. ఈ వయసులో విజేతగా నిలిచి ఈ కిరిటాన్ని గెలుచకోవడం అద్భతమైన విషయం వర్ణించలేనిది". అంటూ చెప్పుకొచ్చింది.
రెండో ప్రపంచ యుద్ధంలో అప్పటి నాజీల మారణహోమం కారణంగా ఇజ్రాయెల్ పెద్ద సంఖ్యలో యువతను కోల్పోయింది. అప్పటి భయానక పరిస్థితులను భరిస్తూ ప్రాణాలతో బయటపడిన అతి కొద్ది మంది యూదు మహిళలను గౌరవించే నిమిత్తం ఈ అందాల పోటీలు ఎంతగానో దోహదపడతాయని ఇజ్రాయెల్ అందాల పోటీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు కరోనా మహమ్మారి దృష్ట్యా గతేడాది నిర్వహించ లేకపోయినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment