Fashion Model Beauty Pageant Winner Warangal Saritha Inspirational Journey - Sakshi
Sakshi News home page

Saritha: వైకల్యం శరీరానికి మాత్రమే! మనసుకు కాదు.. బాహుబలిలో నటించా!

Published Thu, Nov 17 2022 4:03 PM | Last Updated on Thu, Nov 17 2022 7:59 PM

Warangal Saritha Fashion Model Beauty Pageant Winner Inspirational Journey - Sakshi

సరిత (PC: Saritha Musuku Facebook)

ప్రతిభ, ఉన్నత స్థానాన్ని అధిరోహించాలన్న పట్టుదల ఉంటే శారీరక వైకల్యం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించింది వరంగల్‌ జిల్లాకు చెందిన సరిత. తన అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసంతో మోడల్‌ ఎదిగి పలు అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. ఫ్యాషన్‌ మోడల్‌గా కెరీర్‌ను నిర్మించుకుంటోంది.

తొలుత మిస్‌ తెలంగాణ డెఫ్‌ అండ్‌ డంబ్‌గా ఎంపికైన సరిత.. ఇటీవల టాంజానియా మిస్టర్‌ అండ్‌ మిస్‌ డెఫ్‌ అండ్‌ డంబ్‌ బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని రన్నరప్‌గా కిరీటం అందుకుంది. తద్వారా అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటింది. 

చిన్ననాటి నుంచే
స్కూల్లో ఉన్ననాటి నుంచే మోడలింగ్‌పై మక్కువ పెంచుకున్న సరిత.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. వైకల్యాన్ని జయించి విజయాలను చిరునామాగా మార్చుకుని తన ప్రయాణం కొనసాగిస్తోంది. మూగ, చెవుడు వంటి సమస్యల కారణంగా ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ చిరునవ్వుతోనే వాటిని దాటుకుంటూ సినిమాల్లోనూ తన ప్రతిభ నిరూపించుకుంటోంది. 

విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌లతో పాటు కీర్తి సురేశ్‌ తన ఫేవరెట్‌ అంటున్న సరిత స్ఫూర్తిదాయక కథ పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ కింది వీడియో చూసేయండి! తన కాళ్ల మీద తాను నిలబడి సొంతంగా ఇక్కడి దాకా చేరుకున్న సరిత మరిన్ని విజయాలు సాధించాలని ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేయండి!
 


చదవండి: ట్రెండ్‌: కుటుంబాలకు రీల్స్‌ గండం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement