అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్ కిరీటం దక్కించుకుంది. శనివారం ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఓ వేడుకలో 22 ఏళ్ల డచ్ మొలుకన్ మోడల్ రిక్కీ వాలెరీ కొల్లె అనే ట్రాన్స్ జెండర్ ఈ ఘనతను సృష్టించింది. ఆమె ఈ వేడుకలో హబీబా మోస్టాఫా, లౌ డిర్చ్‌లు, నథాలీ మోగ్‌బెల్జాదాలను వెనక్కి నెట్టి మరీ మిస్ నెదర్లాండ్స్ టైటిల్‌ను గెలుచుకుంది. అందాల పోటీల చరిత్రలో ఓ ట్రాన్స్‌జెండర్‌కి కిరీటం దక్కడం తొలిసారి.
ఈ చారిత్రత్మక విజయం 72వ మిస్ యూనివర్స్ టైటిల్‌కు పోటీదారుగా తన స్థానాన్ని పదిలం చేసింది. ఈ మేరకు ట్రాన్స్‌జెండర్ హబీబా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ..నా కమ్యూనిటీని గర్వించేలా చేశాను. నేను విజయం సాధించడం నాకు అత్యంత ముఖ్యం. అందుకోసం ప్రతిక్షణం తపనపడ్డా. నేను గెలుస్తానని భావించిన మిస్ నెదర్లాండ్స్ జట్టులోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.
తాను తనలాంటి వాళ్లందరికీ ఒక రోల్‌మోడల్‌గా ఉండాలని కోరుకున్నా. సమాజంలో తమ పట్ల ఉన్న వివక్షకు వ్యతిరేకంగా పోరాడేలా శక్తిమంతం చేసేందుకు దీన్ని ఒక ఫ్లాట్‌ఫాంగా చేయాలనుకుంటున్నా. నిబద్ధత, బలం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం, తమలాంటి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే తన ధ్యేయం అని పేర్కొంది రిక్కీ. మిస్ నెదర్లాండ్స్ సంస్థ నా వెనుక ఉండటం వల్లే ఈ విజయం సాధించగలిగానని సంతోషంగా చెబుతోంది రిక్కీ.
(చదవండి: కెమెరా లాక్కున్న ఆక్టోపస్..ఇచ్చేదే లే! అంటూ యుద్ధమే చేసింది)
Comments
Please login to add a commentAdd a comment