బ్యాంకాక్: పైన కనిపిస్తున్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అచ్చం నవ్వుతున్నట్లుగా కనిపిస్తున్న ఈ సాధువు వందేళ్ల క్రితం మరణించాడని, అయినప్పటికీ అతని శరీరం, ముఖ్యంగా ఆ నవ్వు చెక్కు చెదరలేదంటూ వార్తలు ఊపందుకున్నాయి. దీంతో సాధారణ ప్రజానీకం అతడికి ఏదో శక్తులు ఉన్నట్లు భావిస్తూ ఇతరులకు తెగ షేర్ చేస్తున్నారు. పైగా ఆ సాధువు ఇంకా ధ్యాన ముద్రలోనే ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. వందేళ్ల క్రితం పెట్టెలో భ్రదపరిచిన ఇతని శరీరం ఈ మధ్యే మంగోలియాలోని ఉలాన్‌బాతర్‌లో లభ్యమైనట్లు పేర్కొంటున్నారు. (చదవండి: దొంగ కోతి: ఫోన్ ఎత్తుకెళ్లి సెల్ఫీలు)
కాగా నిజానిజాలు నిగ్గు తేల్చే క్రమంలో ఈ వార్త పూర్తిగా కట్టుకథ అని నిర్ధారణ అయింది. అసలు నిజమేంటేంటే.. ఫొటోలో కనిపిస్తున్న సాధువు పేరు లుయాంగ్ ఫోర్ పియాన్. అతడు 2017లో అనారోగ్యం కారణంగా థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో ఓ స్థానిక ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. అయితే అతడి మృతదేహాన్ని వెంటనే దహనం చేయలేదు. బౌద్ధుల ఆచారం ప్రకారం రెండు నెలల పాటు భద్రపరిచి తర్వాత ఆ శవానికి కొత్త వస్త్రాలు తొడిగించారు. ఆ సందర్భంలో తీసిన ఫొటో ఇది. కానీ అన్ని రోజుల తర్వాత కూడా సాధువు శరీరం ఏమాత్రం కుళ్లిపోకుండా ఉండటం గమనార్హం. ఇక ఆయన చనిపోయిన వంద రోజుల తర్వాత మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. (చదవండి: దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు!)
వాస్తవం: ఫొటోలో కనిపిస్తున్న సన్యాసి వందేళ్ల క్రితం మరణించలేదు.
Comments
Please login to add a commentAdd a comment